ఇ-రాజా.. ఇ-రిక్షాలను విడుదల చేసిన ఓకే ప్లే సంస్థ
రిక్షాలు తొక్కి తొక్కి అలసిపోయిన జీవితాలకు ఇది ఒక శుభ వార్త అని చెప్పవచ్చు. ఎందు కంటే ఓకే ప్లే అను మూడు చక్రాల వాహనాల తయారీ సంస్థ మార్కెట్లోకి ఇ-రాజా... ఇ-రిక్షా పేరుతో ఎలక్ట్రిక్ రిక్షాలను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. దీని ధర కూడా తక్కువే. వీటి ద్వారా రిక్షా కార్మికులకు ఎంతో మేలు కలుగుతుంది.
Also Read: రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు...!!
ఓకే ప్లే వారి ఇ-రాజా ఇ-రిక్షా గురించి మరిన్ని వివరాలు క్రింది ద్వారా తెలుసుకోగలరు.

ఎక్కువ ధృడత్వం గల ప్లాస్టక్ తయారీ సంస్థ ఓకే ప్లే మార్కెట్లోకి విడుదల చేసిన ఇ-రిక్షా ధర దాదాపుగా 1.15 నుండి 1.25 లక్షలు అన్ని పన్నులతో కలుపుకుని (ఢిల్లీ) గా ఉండనుంది.

ఇది పూర్తిగా కాలుష్య రహిత వాహనం దీని ద్వారా ఎటువంటి కాలుష్య ఉద్గారాలు కూడా వెలువడవని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

ఇందులో డ్రైవర్‌తో సహా మొత్తం నలుగురు వ్యక్తులు ప్రయాణించవచ్చు. మరియు దీని తయారీకి ఉపయోగించిన అన్ని పరికరాలు కూడా 90 శాతం దేశీయంగా తయారు చేసినవే అని తెలిపారు.

దీనిని మెటల్ బాడీ గల రిక్షాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు చాలా వరకు తక్కువ మరియు ఈ రిక్షాలకు ప్లాస్టిక్ కాలుష్య రహితమైనదని కూడా తెలిపారు.

ఓకే ప్లే సంస్థ దేశ వ్యాప్తంగా రెండు తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకుంది. ఇందులో దక్షిణ భారత దేశ మార్కెట్ కోసం హర్యానా లోని సోనా ప్లాంటు మరియు ఉత్తర భారత దేశం కోసం తమిళనాడులోని రాణిపేట్ ప్లాంట్ ద్వారా వాహనాలను అందించాలని నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








