అదృష్టమంటే ఈ కుక్కదే.. ఓలాలో ఉద్యోగంతో పాటు సకల సదుపాయాలు..

భూమి మీద విశ్వాసం చూపించే జీవులు ఏవి అంటే ఠక్కున ఎవరైనా చెప్పే సమాధానం కుక్క. ఎందుకంటే కాసింత ప్రేమ చూపిస్తే చాలు అన్నం పెట్టిన యజమాని పట్ల అది ఎంత విశ్వాసంగా పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుక్క మీద ఎనలేని అభిమానాన్ని చాటుకున్నారు ప్రముఖ వ్యక్తి.

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూవీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త ఉద్యోగి జాయిన్ అయ్యింది. దాని పేరు బిజిలి. గత ఆదివారం బిజిలీకి సంబంధించిన అధికారిక ఐడీ కార్డు, వివరాలను ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ట్వీట్‌ చేశారు. అయితే ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.

Dog-as-Ola-Employee

మనకి సాధారణంగా ఎవరితోనైనా గొడవ అయితే వారిని తిట్టాలంటే నీది ఓ బతుకేనా.. కుక్క బతుకు అంటారు.. కానీ ఈ స్టోరీ చదివితే మీ అభిప్రాయం టక్కున మార్చుకుంటారు. ఎందుకంటే ఒక కుక్క ఇప్పుడు ఓలా కంపెనీలో ఉద్యోగిగా మారింది. అందరు ఉద్యోగుల మాదిరిగానే దానికి ఐడీ కార్డు, ఎంప్లాయ్ కోడ్, చిరునామా, వసతులు, సదుపాయాలు సమకూర్చింది ఓలా కంపెనీ.

ఓలా కంపెనీకి, కుక్కలకు మధ్య మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే గతంలో ఓలా ఆఫీస్‌లో కుర్చీలో కుక్కలు సేదతీరుతున్న వీడియో, ఫొటోలను చేశారు ఆ సంస్థ సీఈఓ. అంతకు ముందు సంస్థలో డాగ్ డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా ఓ కుక్కకు ఏకంగా ఉద్యోగమే ఇచ్చి, దాని పేరుతో ఐడీ కార్డు కూడా తయారు చేయించారు. వివరాలను భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Dog-as-Ola-Employee

ఓలా ఎలక్ట్రిక్ విభాగంలో కొత్త ఉద్యోగిగా జాయిన్ అయిన ఆ శునకం పేరు బిజ్లీ. ఆంగ్లంలోకి అనువదిస్తే Electricity అని వస్తుంది. గత ఆదివారం(జూలై 30) బిజ్లీకి సంబంధించిన అధికారిక ఐడీ కార్డు, వివరాలను భవిష్ అగర్వాల్ ట్వీట్‌ చేశారు. ఐడీ కార్డ్ ప్రకారం బిజిలీ ఎంప్లాయ్ కోడ్ '440 V'. ఇది వోల్టేజ్‌ను సూచిస్తుంది. బిజ్లీ బ్లడ్ గ్రూప్ 'PAW+Ve' అని కార్డులో రాయించారు.

సంస్థలోని ఉద్యోగులు సంస్థలో అంతర్గత సమాచార మార్పిడికి ఉయోగించే స్లాక్ ద్వారా కుక్కను సంప్రదించవచ్చు. అంతే కాదు బిజ్లీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ను BA కార్యాలయంగా ముద్రించారు. బిజిలీ ఎక్కడ పనిచేస్తుందో తెలుసుకోవాలంటే.. చిరునామా హోసూర్ రోడ్‌లోని ఓలా ఎలక్ట్రిక్ కార్యాలయంగా కార్డులో పేర్కొన్నారు.

Dog-as-Ola-Employee

ఓలాలో ఉద్యోగిగా మారడంతో బిజ్లీకి ట్విటర్‌లో ఫ్యాన్స్‌ పెరిగిపోయారు. శుభాకాంక్షలు తెలిపారు. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. కామెంట్లు, షేర్, ట్యాగుల రూపంలో తమ ఉత్సాహం, ప్రేమను పంచుకున్నారు. ఓ నెటిజన్ బిజిలీ తనకు పేరు నచ్చిందని, యానిమేటెడ్ కుక్కల సినిమాలో పాత్రను సూచిస్తూ ట్వీట్ చేశారు.

ఇంకో నెటిజన్ అయితే "అద్భుతం పావ్‌సమ్!" అంటూ తమ సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. మరి కొందరు తమ కుక్కలకు సైతం ఇలాంటి ఉద్యోగం కావాలని ఫన్నీగా కామెంట్‌ చేశారు. మరికొందరు మాత్రం ఇంకొంచెం చమత్కారాన్ని జోడిస్తూ బిజ్లీ ఐటీఆర్ దాఖలు చేసిందా లేదా అంటూ కామెంట్‌ చేశారు.

ఈ కొత్త ఉద్యోగి అయినా క్రమశిక్షణతో పని చేయాలని కోరుకుంటున్నట్లు మరికొందరు ట్వీట్‌ చేశారు. వినియోగదారుల ఫిర్యాదులకు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వినియోగదారుల సమస్యలు పట్టించుకోకుండా నిద్రిస్తున్న ఉద్యోగులను నిద్ర లేపాలంటూ సెటైర్లు సేతం వేస్తున్నారు. మరికొందరు నిరుద్యోగులకు ఆ ఉద్యోగాలు ఇవ్వొచ్చు కదా అని సలహాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో మరికొందరు ఘాటుగా స్పందించారు. కుక్కలకు ఇస్తున్న విలువ వినియోగదారులకు లేదని మండిపడ్డారు. ఇకనైనా సంస్థ తీరు మార్చుకోవాలని సూచనలు ఇచ్చారు. కుక్కలతో సమానమైన ఓలా ఉద్యోగులకు శుభాకాంక్షలు అంటూ పలువురు కామెంట్‌ చేశారు. ఇప్పటికే ఈ ట్వీట్‌కు లక్షల్లో వ్యూస్‌ రాగా.. వేలల్లో లైక్‌లను సంపాదించింది.

అయితే ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ తన ఆఫీస్‌లో కుక్కలపై పోస్ట్‌లను షేర్ చేయడం ఇది తొలిసారి కాదు. ఇటీవల ఓలా కార్యాలయంలో సోఫాలపై నిద్రిస్తున్న మూడు కుక్కల ఫొటోను షేర్ చేశారు. గతేడాది ఆఫీసులో కుక్కతో ఆడుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఏదేమైనా శునకాలతో ఓలా కార్యాలయానికి అవినాభావ సంబంధం ఉందనేది ఈ కథనం ద్వారా అర్థమవుతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 1, 2023, 17:29 [IST]
English summary
Ola electric appoints a dog as employee ceo bhavish named it bijili
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+