వర్షపు నీటిలో వెళ్లినా చెక్కు చెదరని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. అందుకేనా జనాలు ఇష్టంగా కొంటున్నారు?
వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎక్కడికక్కడ వాహనాల నిలిచిపోతున్నాయి. ఈ వానలకు ద్విచక్ర వాహనాలు కూడా భారీగా దెబ్బతింటాయి. ఈ వర్షాలకు ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను బయటకు తీసేందుకు జనాలు భయపడతారు. దానిని పటా పంచలు చేస్తూ చాలా సందర్భాల్లో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు నీటిలోనూ అద్భుతంగా రాణించాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వార్తలు ఇంటర్‌నెట్‌లో దర్శనమిచ్చాయి. తాజాగా ఓ వ్యక్తి పూర్తిగా నీటిలో ఓలా స్కూటర్‌ని డ్రైవ్ చేస్తున్న విజువల్స్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నాణ్యతను మరోసారి రుజువు అయ్యింది. ముంబయిలోని అంధేరీలో ఓ వ్యక్తి తన ఓలా ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని (Ola S1 Pro) ఓ బ్రిడ్జి కింద నడుము లోతు వర్షపునీటి గుండా తీసుకెళ్లాడు. అతను ప్రయాణించే దారిలో బ్రిడ్జి కిందకు వెళ్లే సరికి నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో అలాగే స్కూటర్‌ని ముందుకు పోనిచ్చాడు. దీంతో ఈ విజువల్స్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో స్కూటర్ సీటు వరకు వర్షపు నీరు కనిపించింది. నేవీ ముంబైలోని సంపాడా-జునాగర్ సబ్ వేపై దగ్గర ఈ ఘటన జరిగింది. సబ్‌వే కింద పేరుకుపోయిన వర్షపు నీటిలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండటాన్ని గమనించిన రైడర్.. నీరు తక్కువే ఉందని భావించాడు. అయితే ఆ వ్యక్తి నెమ్మదిగా స్కూటర్‌ని ముందుకు తీసుకెళ్తున్న కొద్ది స్కూటర్ పూర్తిగా నీటిలో మునగడం మొదలైంది.
అక్కడ 2 ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. ఒకదానికి మరొకదానికి మధ్య గ్యాప్ ఉంటుంది. నీరు తక్కువే ఉందని భావించిన రైడర్ అయిష్టంగానే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని వర్షపు నీటిలోకి తీసుకెళ్లాడు. సబ్‌వే మధ్యలో నీటి మట్టం కాస్త ఎక్కువగా ఉండటం చూసి అతను కాస్త అయోమయానికి గురవుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. అయినా అధైర్యపడకుండా చివరి వరకు స్కూటర్ నడుపుతూ వర్షపు నీటి నుంచి విజయవంతంగా బయటపడ్డాడు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, చాలా మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లోతైన నీటిలో తీసుకెళ్లారు. ముంబయిలో, ఇటీవల గుజరాత్‌లో జరిగిన ఘటనల్లోనూ ఓలా పూర్తిగా సీట్ల వరకు మునిగింది. అయినప్పటికీ ఈ స్కూటర్లు మంచి పనితీరును కనబరుస్తాన్నాయని యజమానులు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాని తన స్కూటర్‌ని సముద్రం మధ్యలోకి తీసుకెళ్లి దాని సామర్థ్యాన్ని పరీక్షించాడు.
ఇలా చేయడం సబబేనా?: అయితే లోతైన నీటిలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకెళ్లడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు వర్షపు నీటితో ఉన్న రోడ్లపై ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే కాకుండా ఏ వాహనాన్ని తీసుకెళ్లవద్దు. ఎందుకంటే అధిక వర్షపు నీటి వల్ల పార్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుంచి మీరు అప్పటికప్పుడు బయటపడవచ్చు కానీ దీర్ఘకాలికంగా అది మీ వెహికిల్స్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
అందువల్ల నడుము లోతు ఉండే వర్షపు నీటిలో ఎలక్ట్రిక్ వాహనాలను రవాణా చేయకండి. దీనివల్ల బ్యాటరీ, మోటార్ దెబ్బతినే ఆస్కారం ఉంటుంది. ఇక సాంప్రదాయ వెహికిల్స్ ఎక్కువగా ఆయిల్‌ని కలిగి ఉంటాయి కాబట్టి ద్రవం తొలగిపోయి వర్షపు నీరు వల్ల తప్పు పట్టి పోయే ప్రమాదం ఉంటుంది. మీ జేబులకు చిల్లు పడకూడదు అంటే ఎక్కువ శాతం అలాంటి రూట్‌లలో వెళ్లకపోవడమే ఉత్తమమైన మార్గం.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








