ఓలా క్యాబ్ రైడ్ క్యాన్సిల్ సమస్యకు చెక్.. ఇకపై ఈ కొత్త ఫీచర్‌తో ఈజీగా పేమెంట్స్.!!
ప్రముఖ క్యాబ్ బుకింగ్‌ల సంస్థ ఓలా.. తమ క్యాబ్‌ల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఇకపై ఓలా క్యాబ్స్ ప్రయాణికులకు రైడ్ క్యాన్సిల్ అయ్యే సమస్య ఉండదు. నేరుగా UPI ద్వారా ఛార్జీలు చెల్లించే సదుపాయాన్ని కల్పించింది. దీని ద్వారా పేమెంట్స్ సులభం కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓలా క్యాబ్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి దేశంలోని ప్రధాన నగరాల్లో ఓలా సేవలు విస్తృతమయ్యాయి. ముఖ్యంగా మెట్రో పాలిటన్ నగరాల్లో ఓలా క్యాబ్‌ల వినియోగం పెరుగుతోంది. తక్కువ ఛార్జీల వసూలుతో ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులకు ఆదరణ పెరుగుతోంది. అయితే వీటిలో ప్రధానంలో ఆన్‌లైన్ లావాదేవీల సమస్య ప్రధానంగా మారింది.

ఓలా క్యాబ్ సర్వీస్ ప్రత్యేకంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉంది. అయితే ప్రయాణీకులు ఆ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా లావాదేవీలు చేసినట్లయితే.. ఆ డబ్బులను Ola డ్రైవర్లకు నావిగేట్ చేయడానికి సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దాదాపు రెండు రోజుల తర్వాత వారి బ్యాంకు ఖాతాలో డబ్బు జమ అవుతోంది. దీంతో ఓలా క్యాబ్ డ్రైవర్లు రైడ్‌ను అంగీకరించేముందు.. వారు ఆన్‌లైన్ ట్రాన్సక్షన్ చేస్తున్నట్లు భావిస్తే.. వారు రైడ్‌ను అంగీకరించడం లేదు.
దీంతో కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల డిజిటల్ పేమెంట్స్‌కు ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతుండటంతో చాలా మంది తమ జేబుల్లో డబ్బులు ఉంచుకోవడం లేదు. హైదరాబాద్ మహానగరంలో ఈ పరిస్థితి తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పటి వరకు బుకింగ్‌కు మాత్రమే పరిమితమైన ఓలా యాప్ ద్వారా ఇకపై పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు.

ఈ క్రమంలో ఈ సమస్యను పరిగణనలోకి తీసుకున్న ఓలా.. యూపీఐ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఓలా యాప్‌లో UPI ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రయాణికుడు నేరుగా ఓలా యాప్ నుంచి యూపీఐలో డబ్బు పంపించవ్చచు. తద్వారా నేరుగా డ్రైవర్ బ్యాంక్ ఖాతాకు నగదు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. పేమెంట్స్ కోసం డ్రైవర్ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ఇందుకు సంబంధించి ఓలా సీఈవో భవిష్ అగర్వాల్(Bhavish Agarwal) తన X(గతంలో ట్విట్టర్) పేజీలో పోస్ట్ చేశారు. ఈ సదుపాయం మొదటగా బెంగళూరులో డిసెంబర్ 10 న ప్రారంభం కానున్నట్లు భవిష్ తెలిపారు. అనంతరం క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు.

కస్టమర్లకు డ్రైవ్ సులభతరం చేసేందుకు ఓలా తన యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త సేవలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఓలా ఇటీవల ONTC ఫుడ్ డెలివరీ ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆహారం, మందులు, బట్టలు, ఇతర వస్తువులను డెలివరీ చేసేందుకు ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఓలా తీసుకువస్తున్న UPI సదుపాయం ద్వారా ఇకపై రైడ్లు సులభతరం కానుంది. ఇకపై ఆన్‌లైన్ చెల్లింపుల కారణంగా రైడ్‌ను క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు. ప్రయాణికులు డ్రైవర్ బ్యాంక్ ఖాతాకే తక్షణమే డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఇది రైడ్‌ను రద్దు చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది.
కాగా దేశవ్యాప్తంగా యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) సేవలు బాగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద షోరూమ్‌ల వరకూ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. దీంతో మార్కెట్లో పలు రకాల యూపీఐ పేమెంట్ సర్సీసెస్ నడుస్తున్నాయి. పేటీఎం, ఫోన్‌పే, జీపీ వంటి ప్రముఖ యాప్స్‌తో పాటు.. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్ లాంటి అన్ని బ్యాంకులు యూపీఐ ఫెసిలిటీని కల్పించాయి.


Click it and Unblock the Notifications








