Ola Electric Sales అమ్మకాల్లో ఓలా దూకుడు.. మే నెలలో 35 వేల యూనిట్లకు పైగా సేల్స్..
భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ మే నెలలో 35,000 యూనిట్లకు పైగా విక్రయాలను జరిపింది. దీంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ సంతృప్తి వ్యక్తం చేశారు.
35 వేల యూనిట్ల విక్రయాలతో మే నెలలో ఓలా 30 శాతం పైగా మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. గత సంవత్సరం మే నెలలో జరిగిన విక్రయాలపై 300 శాతం వృద్ధిని సాధించింది. గత 3 త్రైమాసికాలుగా అమ్మకాల్లో నిలకడగా అగ్రస్థానంలో ఉండటపై ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ భావిష్ అగర్వాల్ స్పందించారు.

ప్రతి నెలా ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ విక్రయాలు ఆకట్టుకునే వృద్ధిని సాధించాయని భావిష్ అగర్వాల్ అన్నారు. భారత్‌లో ఈవీ విప్లవ రంగానికి ఓలా స్థిర నాయకత్వం వహిస్తోందని తెలిపారు. ఈ అభివృద్ధి తమ బ్రాండ్‌పై విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఈవీల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుందని తెలిపారు.
ఫేమ్ 2 ప్రాజెక్టులో భాగంగా ఈవీల రంగానికి ప్రభుత్వ సబ్సిడీలో గణనీయమైన తగ్గింపు ఉన్నప్పటికీ.. జూన్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను స్వల్పంగా మాత్రమే పెంచి Ola S1ని భారతదేశంలో అత్యుత్తమ EV ప్రతిపాదనగా మార్చాం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఓలా ఎలక్ట్రిక్ దృఢ నిశ్చయంతో ఉంది." అని భావిష్ అగర్వాల్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం సవరించిన సబ్సిడీలు జూన్ నుంచి అమలులోకి రావడంతో, ఓలా S1 ప్రో ఇప్పుడు రూ. 1,39,999 ధరకి, S1 ధర (3KWh) రూ. 1,29,999 కి, మరియు S1 ఎయిర్ (3KWh) రూ. 1,09,999 కి అందుబాటులో ఉన్నాయి. సబ్సిడీలు గణనీయంగా తగ్గినప్పటికీ దాని ప్రభావం వినియోగదారులపై ఓలా చూపలేదు. ఆసక్తికరంగా S1 Pro దాని ప్రారంభ ధరకే రిటైల్ చేయబడుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఓలా ఎస్1 ఎయిర్ ధర రూ.1,09,999కి చేరుకుంది. రూ.1,14,999కి విక్రయించిన ఓలా ఎస్1 ధర రూ.1,29,999 కాగా, రూ.1,24,999 ధర కలిగిన టాప్ ఎండ్ మోడల్ ఓలా ఎస్1 ప్రో ధర రూ.1,39,999 కి పెరిగాయి.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి భారతదేశం అంతటా అనేక ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECలు) ఏర్పాటు చేయడం ద్వారా ఓలా తన ఆఫ్‌లైన్ ఉనికిని చురుకుగా పెంచుతోంది. కంపెనీ ఇటీవలే తన 600వ ECని ప్రారంభించింది. ఆగస్టు నాటికి ఈ సంఖ్యను 1,000కి చేర్చాలని భావిస్తోంది.
ప్రస్తుతం, ఓలా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో బెస్ట్ సేల్స్‌తో అగ్రగామిగా ఉండగా, ఈథర్ మరియు టీవీఎస్ వంటి పోటీదారులు కూడా మంచి పోటీని ఇస్తున్నా.ి. రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత పెరగనుంది. ఈ విషయంలో అన్ని కంపెనీలు తమ మోడల్ లైన్‌కు అప్‌డేట్‌లు ఇస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం రానున్న రోజుల్లో తెలియనుంది.
ఓలా ఎస్1 ప్రో స్కూటర్ 4kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది మరియు 8.5 kW మోటార్‌తో శక్తిని అందిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌తో 181 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠంగా గంటకు 95 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.
ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ఇది 2kWh, 3kWh మరియు 4kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బ్యాటరీ ప్యాక్ ప్రకారం రేంజ్ 85 కి.మీ నుంచి 165 కి.మీ వరకు అందిస్తుంది. గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.


Click it and Unblock the Notifications








