GPS Tracking దొంగతనం చేసిన స్కూటీని పట్టించిన జీపీఎస్.. బిత్తర పోయిన దొంగలు..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది అందుకు తగినట్లుగా సంస్థలు కూడా భారీ మొత్తంలో ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రస్తుతం తీసుకు వస్తున్న స్కూటర్లు లేదా బైక్లలో అత్యాధునిక ఫీచర్లను కంపెనీలు జోడిస్తున్నాయి తద్వారా బైక్ లేదా స్కూటర్ దొంగతనానికి గురైనప్పుడు సులభంగా ట్రాక్ చేసే విధంగా జీపీఎస్ సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి.

ప్రస్తుతం కొత్తగా విడుదలైన దాదాపు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్‌లు/ బైక్ లల్లో స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ చేసిన GPS ట్రాకర్ ను పొందుతున్నాయి. రియల్ టైం లో బైకులు లేదా కార్లు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. ట్రాక్ చేయడానికి సరికొత్త పరికరాలు అనుమతిస్తున్నాయి. స్కూటర్ దొంగిలించబడిన తర్వాత దాన్ని తిరిగి పొందడానికి యజమాని లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ని ఉపయోగించిన ఓ సంఘటన గురించి మీకోసం.

ola S1 pro

జీపీఎస్ ఆధారంగా..
తన దొంగలించబడిన స్కూటర్‌ను తిరిగి అందించినందుకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమాన్యానికి జోధ్‌పూర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ అంజలి పాల్ అనే యువతి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం చోరీకి గురైన తన స్కూటర్ వివరాలను ఆమె తాజాగా పంచుకున్నారు. జోధ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనానికి గురైన స్కూటర్ ను కార్గో లో తరలించేందుకు దొంగలు ప్లాన్ చేస్తుండగా దానిని పోలీసులు గుర్తించినట్లు సమాచారం జిపిఎస్ ఆధారంగా పోలీసులు అంజలితో కలిసి దొంగల వద్దకు చేరుకుని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. Ola ఎలక్ట్రిక్ S1 ప్రోతో సహా అనేక ఆధునిక స్కూటర్లు ప్రత్యక్ష ట్రాకింగ్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. అయితే, ఈ ఫీచర్ గురించి తనకు తెలియదని, తరువాత వాహనాన్ని ట్రాక్ చేయడంలో ఓలా ఎలక్ట్రిక్ తనకు సహాయపడిందని యజమాని అంజలి తన ఆనందాన్ని వెల్లడించింది.

Article Published On: Friday, April 14, 2023, 15:56 [IST]
English summary
Ola s1 pro scooter stolen recoverd through gps tracking detaials in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+