Old Car రెగ్యూలర్‌గా వీటిని చెక్ చేసుకోండి.. మీ పాత కారు ఎప్పుడు కొత్తగానే ఉంటుంది..!

మీ పాత కారుని సరికొత్తగా తయారు చేయాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు మీ కారు రోజు కొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడున్న కారును మార్చే ఆలోచన లేకపోతే మీ పాత కారును ఎలా చూసుకోవాలో మీరు ముందే ఊహించుకోవాలి. ముఖ్యంగా వాహనాన్ని నడుస్తున్న స్థితిలో ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ వస్తువైనా నడవలేని స్థితిలో ఉంటే అది మొత్తానికే అక్కరకు రాకుండా పోతుంది. కాబట్టి ఇది కచ్చితంగా పాటించాలి.

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో జనాలు సొంత వాహనాలను సరిగ్గా మెయిన్‌టైన్ చేయడంలో అలసత్వం వహిస్తున్నారు. కేవలం చిన్న టిప్స్‌ని ఉపయోగించి మీ పాత వాహనాలపై చిన్నశ్రద్ధ పెడితే చాలు మీకార్లు మెరుస్తూనే ఉంటాయి. వీటికోసం మీరు చేయాల్సిందల్లా కేవలం వాటి పనితీరును పర్యవేక్షించడమే. మీరు రెగ్యూలర్‌గా చెక్ చేసుకోవాల్సిన విభాగాలు ఇవే..

old car maintenance tips details

బ్రేకింగ్ సిస్టమ్: మీరు మీ వాహనాన్ని మంచి కండిషన్‌లో ఉందో లేదో తెలుసుకోవాలంటే అది అందించే మైలేజీ మీదే ఆధారపడి ఉంటుంది. అలానే వాహనంబ్రేకింగ్ సిస్టమ్ అత్యంత క్లిష్టమైన కీలకమైనది. మీ పాత కారు బ్రేకింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. పాత కార్లలో ఈ సమస్య ప్రధానంగా ఉంటుంది.బ్రేక్ ప్యాడ్‌లు సన్నగా మారకుండా బ్రేక్ ఫ్లూయిడ్ అయిపోకుండా చూసుకోవాలి.

టైర్లు: టైర్లు వాహనం చాలా కీలకం. నిత్యం రోడ్డు ప్రమాదాల్లో టైర్లు పేలిపోయిన ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వీటని నిత్యం చెక్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం నిలబడాలంటే కాళ్లు ఎంత ముఖ్యమో కార్లకు టైర్లు కూడా అంతే కీలకం. వీటని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. మీ టైర్లను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.

old car maintenance

టైర్లలో గాలి కావల్సినంత ఉండేలా చూసుకోవాలి. గాలి తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా 30 నుంచి 35 PSI మధ్య గాలి పీడనంతో నిండి ఉండేలా చూసుకోండి. అలాగే, మీరు టైర్లను మారుస్తున్నట్లయితే, నాణ్యత లేని టైర్లను కొనుగోలు చేయకండి. బాగా పేరొందిన టైర్ల కంపెనీ నుంచి సిఫార్సు చేసిన టైర్లను మాత్రమే కొనుగోలు చేయండి.

స్టీరింగ్: స్టీరింగ్ సిస్టమ్‌ పాత కారులో ప్రధాన సమస్యగా ఉంటుంది. ఇది టైర్లపై ఒత్తిడిని కలిగిస్తుంది. సరైన సమయంలో స్టీరింగ్ స్పందించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం ఉపయోగించే ప్రత్యేక ఆయిల్‌ లేదా గ్రీస్‌ని వాడాలి. స్టీరింగ్ సిస్టమ్‌ను సరైన స్థితిలో ఉంచడానికి సస్పెన్షన్‌లను క్రమానుగతంగా మెకానిక్‌ల సహాయంతో తనిఖీ చేయించాలి.

old car maintenance tips


విండ్‌షీల్డ్ వైపర్స్:
విండ్‌షీల్డ్ వైపర్స్‌ డ్రైవర్‌కు మెరుగైన విజిబిలిటీని అందిస్తాయి. రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల, వైపర్ బ్లేడ్‌లను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ అవి పనిచేయడం లేదని భావిస్తే వాటిని మార్చేయాలి. ఇది మాములుగా చూడటానికి చిన్న విషయమే అయినప్పటికి దీనిని ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మీ కారు పనితీరు తక్కువగా ఉండనుంది.

ఫ్యూయల్ లైన్: పాత కార్లలో ఇంధన లైన్లు తరచుగా పగుళ్లు ఏర్పడి ఇంధనాన్ని లీక్ చేయడం ప్రారంభిస్తాయి. అవి అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీరు దానిని కచ్చితంగా చెక్ చేయాలి. లీక్ అవుతున్న ఫ్యూయల్ లైన్‌ను సరిచేయడం అనేది సాధారణ ప్రక్రియలో భాగమే కాబట్టి దీనిని సరిచూసుకోవాలి. ఆయా కంపెనీలు నిర్దేశించిన నిర్దిష్ట పరిధిని డ్రైవింగ్ చేసిన తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్‌ని చెక్ చేసి రీప్లేస్ చేయండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 27, 2023, 18:55 [IST]
English summary
Old car regular checkup maintenance tips details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+