హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా ఫెన్సన్ డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

పక్కవాడికి ప్రాణం పోతున్న మనకెందుకులే అనుకునే ఈ రోజుల్లో ఎటువంటి ఫలితం ఆశించకుండా దాదాపు 11 సంవత్సరాలు నిరాఘాటంగా శ్రమిస్తూ దాదాపు 2,000 కు పైగా రోడ్డుపై ఉన్న గుంతలను తనకు వస్తున్న ఫెన్షన్ డబ్బుతో పూడుస్తున్న మన గంగాధర్ తిలక్ నిజంగా ఎంతో మందిచే ప్రశంసించబడుతున్నాడు.

ఇంతకీ దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటి అనే దానిని గురించి మొత్తం సమాచారాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

నివేదికల ప్రకారం హైదరాబాద్ నగరానికి చెందిన 73 సంవత్సరాల గంగాధర్ రిటైర్డ్ ఇండియన్ రైల్వే ఎంప్లాయ్. ఇండియన్ రైల్వేలో దాదాపు 35 సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేసిన ఆయన ఉద్యోగ విరమణ తరువాత హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసేందుకు వచ్చారు.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

అయితే అతడు నగరంలో ఉన్న రోడ్ల దుస్థితిని చూసి ఎంతో కలత చెందాడు. ఎందుకంటే భారతదేశంలో రోడ్లు చాలా గుంతలతో ఉంటాయి. ఇలాంటి రోడ్లను మనం కూడా ఎన్నో చూసి ఉంటాము. కానీ మనం దీనిని చాలా సింపుల్ గా తీసుకుంటాము. కానీ గంగాధర్ దీనిని మార్చాలని నిర్ణయించుకున్నారు.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంతే కాకుండా లెక్కకు మించిన ప్రజలు ప్రమాదాల్లో అవయవాలను కూడా కోల్పోయి చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఒక కారణం అయితే, సరైన రోడ్లు లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణం.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

దీనిపై స్పందించడానికి పూనుకున్న గంగాధర్ చాలా సార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఆశించిన ఫలితం లేకుండా పోయింది. కానీ అతడు నిరుత్సాహ పడకుండా తన భార్య వెంకటేశ్వరికి దీని గురించి చెప్పి, వారే స్వయంగా రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడానికి కంకణం కట్టుకున్నారు.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

అయితే ఈ విధంగా రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చడంలోనే ఎక్కువ సమయం ఖర్చవుతున్న కారణంగా తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేసాడు. ఉద్యోగానికి రాజీనామా చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నగరంలో దాదాపు 2,000 కు పైగా గుంతలను పూడ్చినట్లు తెలిపారు.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

రోడ్డుపై ఉన్న గుంతలు పూడచడానికి కూడా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. దీని కోసం అతనికి వచ్చే ఫెన్సన్ డబ్బును ఖర్చు చేస్తున్నారు. 73 ఏళ్ల గంగాధర్ మరియు అతని భార్య వెంకటేశ్వరి తమ సొంత కారులో ఈ పని చేయడాని బయలుదేరారు. వారు ప్రయాణించే కారుని ‘గుంతల అంబులెన్స్' అని పిలుస్తారు. అంతే కాదు గంగాధర్ ని గుంతల డాక్టర్ అని పిలుస్తున్నారు.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

వీరు ఈ కారులో ప్రయాణించేటప్పుడు వారికి కనిపించిన గుంతలను పూడ్చుతూ ఎంతోమంది దృష్టిని ఆకర్శించారు. వీరు చేస్తున్న ఈ పనికి ఎంతోమంది నెటిజన్స్ వారిపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. వీరు చేస్తున్న సామాజిక సేవకు మెచ్చి బిగ్‌బి అమితాబ్‌ ఓ కారును వారికి బహుమతిగా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది.

హ్యాట్సాఫ్.. 11 సంవత్సరాలుగా సొంత డబ్బుతో రోడ్లపై గుంతలు పూడుస్తున్న వృద్ధ జంట

గంగాధర్ దంపతులు చేస్తున్న ఈ పని రోడ్డుపై ప్రయాణించే ఎంతోమంది వాహనదారుల ప్రాణాలు కాపాడుతోంది. ప్రభుత్వం చేయాల్సిన పనిని, తమ పనిగా చేసుకున్న గంగాధర్ దంపతులు నిజంగా ప్రశంసనీయులు.

Most Read Articles

English summary
Hyderabad Old Couple Spends Pension Funds To Fill Potholes. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X