కెటిఎమ్ బైకుపై వృద్ద జంట.. మునుపెన్నడూ కనిపించని వీడియో

కెటిఎమ్ బైక్స్ ఎక్కువగా యువకులే రైడ్ చేస్తారని అందరికి తెలుసు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో ఓ వృద్ద జంట హ్యాపీగా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక పెద్దాయన కెటిఎమ్ బైక్ రైడ్ చేస్తున్నారు. వెనుక ఆయన భార్య కూర్చుని ఉండటం చూడవచ్చు. వీడియో రికార్డ్ చేసే సమయంలో వారు చాలా ఆనందంగా నవ్వడం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది? ఆ కెటిఎమ్ బైక్ వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

నివేదికల ప్రకారం, ఈ సంఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో వృద్ద జంట KTM RC 390 బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ వీడియోలో ఆ జంటను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మనం రోజు నెట్టింట్లో లెక్కకు మించిన వీడియోలు చూస్తూ ఉంటాము. కానీ ఇలాంటి ఓ వీడియో కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి.

Old Couple On KTM RC390 Bike

కెటిఎమ్ ఆర్సీ 390 బైక్ నడుపుతున్న పెద్దాయన ఏ మాత్రం కష్టపడకుండా బైక్ రైడ్ చేస్తుండటం చూడవచ్చు. వెనుక కూర్చున్న మహిళ కూడా చాలా సంతోషంగా కూర్చుని ఉంది. ఇప్పటి వరకు KTM బైకుల మీద యువకులను మాత్రమే చాలామంది చూసి ఉంటారు. కానీ వృద్ద జంట కెటిఎమ్ బైక్ రైడ్ చేయడం బహుశా చాలా తక్కువ చూసుంటారు. కొందరు బహుశా ఇదే మొదటిసారి చూసుంటారు అని భావిస్తున్నాము.

వృద్ద జంట హ్యాపీగా బైక్ రైడ్ చేస్తున్నారు. కానీ వారిద్దరిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా చాలామంది హెల్మెట్ ధరించి ఉండరు. ఎందుకంటే వారు పొలాలకు లేదా తక్కువ దూరాలకు ప్రయాణించే సమయంలో ఎందుకులే అన్నట్లు ఊరుకుంటారు. కానీ హెల్మెట్ ధరించడం అనేది చాలా అవసరం. ప్రమాదంలో ప్రాణాలను కాపాడే రక్షణ కవచం హెల్మెట్ అనే చెప్పాలి.

Old Couple On KTM RC390 Bike

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎంతోమంది ఆకర్షిస్తోంది. లక్షల సంఖ్యలో వ్యూవ్స్ పొందిన ఈ వీడియో మీద పలువురు నెత్తినాలు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. వారి ఆనందాలను పంచుకుంటున్నారు. మొత్తం మీద KTM బైక్ రైడ్ చేస్తున్న వ్యక్తి వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు. ఆసక్తి చూపితే ఇలాంటి బైకులను రైడ్ చేయడం పెద్ద గొప్ప కాదని చెప్పకనే చెప్పేశారు.

ఇక కెటిఎమ్ ఆర్సీ 390 బైక్ విషయానికి వస్తే.. ఇది భారతదేశంలో ఎక్కువ మంది యువకులు ఇష్టపడి మరీ కొనుగోలు చేసే బైకులలో ప్రధానంగా చెప్పుకోదగ్గది అని తెలుస్తోంది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ అత్యధునిక ఫీచర్స్ పొందుతుంది. డిజన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా పనితీరు పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ.3 లక్షల కంటే ఎక్కువే అని తెలుస్తోంది.

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన బైకుల కంపెనీలలో ఒకటైన KTM ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త బైకులను లేదా అప్డేటెడ్ బైకులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇది కొత్త బైక్ కొనాలనుకునే వారిని ఆకర్శించడానికి తొడపడుతుంది. కంపెనీ ఈ వచ్చే ఏడాదిలో కెటిఎమ్ ఆర్సీ 390 అప్డేటెడ్ మోడల్ లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2024, 9:00 [IST]
English summary
Old couple on ktm rc390 bike video goes viral in social media
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+