Just In
- 12 hrs ago
ల్యాండ్ రోవర్‌పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన ఫోక్స్‌వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 16 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 17 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Lifestyle
Mercury Transit in Aries on 16 April:మేషంలోకి బుధుడి సంచారం వల్ల.. ఈ 3 రాశులకు అద్భుత ప్రయోజనాలు..!
- News
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం... ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణ హత్య... పదునైన ఆయుధాలతో దాడి...
- Movies
‘ఆరెంజ్’ మూవీ నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్: ఆ అప్పులు ఆయనే తీర్చాడు.. చరణ్ విషయంలో అలా!
- Sports
RR vs DC: సిక్స్‌లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్
పాత వస్తువులను పాడేయటం ఇష్టం లేని వారు, వాటిని అధునాతంగా మార్చుకుని, వేరొక ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే, ఇలా చేసే కొన్ని ఆవిష్కరణలను చూస్తుంటే, ఔరా ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి ఓ సంఘటనే ఇది.

తన పాత కారును వదిలించుకోవటం ఇష్టం లేని ఓ ఇస్రో ఇంజనీర్ దానిని ఓ చిన్నసైజు ఎక్స్‌కావేటర్ (ప్రొక్లెయినర్)గా మార్చాడు. దీనికి కోసం ఉపయోగించిన కారు, అయిన ఖర్చు ఎంతో తెలిస్తే నిజంగానే ముక్కున వేలేసుకుంటారు.

వివరాల్లోకి వెళితే, బెన్ జాకబ్ అనే ఇస్రో ఇంజనీర్ తన 22 ఏళ్ల పాత కారును కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చాడు. ఇందుకోసం అతను డేవూ మోటార్స్ నుండి అప్పట్లో అత్యంత పాపులర్ అయిన మ్యాటిజ్ కారును ఉపయోగించారు.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో చూడండి

జాకబ్ తనకెంతో ఇష్టమైన డేవూ కారును విసిరేసే ఉద్దేశ్యం లేకపోవటంతో, దానిని ఇలా ల్యాండ్ మూవర్‌గా మార్చాడు. బెన్ జాకబ్ కేరళలోని తిరువనంతపురంలోని చూలత్తుకోట గ్రామానికి చెందినవాడు. అక్కడన అతను తన సొంత భూమిని పునరావాసం కోసం ఉపయోగించుకునేలా సరిచేయడానికి గానూ ఈ మోడిఫైడ్ డేవూ మ్యాటిజ్ ఎక్స్‌కావేటర్‌ను ఉపయోగించాడు.

అన్నింటికన్నా ముఖ్యంగా, అతను ఈ వాహనాన్ని స్క్రాప్ చేయటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మోడిఫైడ్ వాహనంతో 14 అడుగుల పొడవైన స్థలాన్ని కూడా సులువుగా లెవల్ చేయవచ్చని చెబుతున్నారు. కఠినమైన రహదారులను సైతం సులువుగా అధిగమించేలా దీనిని మోడిఫై చేశారు.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

ఇస్రో ఇంజనీర్ బెన్ జాకబ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ యంత్రం 500 కిలోల బరువున్న వస్తువులను సైతం సులువుగా ఎత్తగలదని చెప్పారు. డేవూ మ్యాటిజ్ కారును ఇంత సామర్థ్యం గల వాహనంగా మార్చడానికి కేవలం రూ.70,000 మాత్రమే ఖర్చు చేసిట్లు తెలిపాడు.

సాధారణంగా, ఇలాంటి ఓ రియల్ ఎక్స్‌కావేటర్‌ను కొనుగోలు చేయాలంటే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ జాకబ్ తన ఇంజనీరింగ్ తెలివితేటలతో, అతి తక్కువ ఖర్చుతేనే రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో ఈ ఎక్స్‌కావేటర్‌ను సృష్టించాడు.
కేరళకు చెందిన ఈ ఇస్రో ఇంజనీర్ తయారు చేసిన ఈ యంత్రం కోసం ఉపయోగించిన డేవూ మ్యాటిజ్ కారు 1998 మోడల్‌గా గుర్తించారు. సుమారు 22 సంవత్సరాలు వయస్సు కలిగిన ఈ కారు, ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా పనిచేయటం విశేషం.
MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

డేవూ మ్యాటిజ్ ఇప్పటి కారు కాదు, దీనికి భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత కార్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే ఇది అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ కారుగా హిస్టరీ క్రియేట్ చేసింది. (మన తెలుగు చలన చిత్రం 'ఖుషి'లో పవన్ కళ్యాన్ ఇలాంటి ఓ కారునే ఉపయోగించారు).

డేవూ సంస్థ 1980 మరియు 1990 కాలంలో భారతదేశంలో ఒక శక్తివంతమైన సంస్థగా అవతరించింది. అయితే, వివిధ కారణాల వలన ఈ సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం విడిచి వెళ్లిపోయింది. ఇప్పటికీ మనదేశంలో అక్కడక్కడా డేవూ మోటార్ కంపెనీ తయారు చేసిన కొన్ని ఉత్పత్తులు కనిపిస్తూ ఉంటాయి.
MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు