22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

పాత వస్తువులను పాడేయటం ఇష్టం లేని వారు, వాటిని అధునాతంగా మార్చుకుని, వేరొక ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే, ఇలా చేసే కొన్ని ఆవిష్కరణలను చూస్తుంటే, ఔరా ఆశ్చర్యపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి ఓ సంఘటనే ఇది.

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

తన పాత కారును వదిలించుకోవటం ఇష్టం లేని ఓ ఇస్రో ఇంజనీర్ దానిని ఓ చిన్నసైజు ఎక్స్‌కావేటర్ (ప్రొక్లెయినర్)గా మార్చాడు. దీనికి కోసం ఉపయోగించిన కారు, అయిన ఖర్చు ఎంతో తెలిస్తే నిజంగానే ముక్కున వేలేసుకుంటారు.

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

వివరాల్లోకి వెళితే, బెన్ జాకబ్ అనే ఇస్రో ఇంజనీర్ తన 22 ఏళ్ల పాత కారును కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చాడు. ఇందుకోసం అతను డేవూ మోటార్స్ నుండి అప్పట్లో అత్యంత పాపులర్ అయిన మ్యాటిజ్ కారును ఉపయోగించారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ధరల జాబితా విడుదల ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో చూడండి

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

జాకబ్ తనకెంతో ఇష్టమైన డేవూ కారును విసిరేసే ఉద్దేశ్యం లేకపోవటంతో, దానిని ఇలా ల్యాండ్ మూవర్‌గా మార్చాడు. బెన్ జాకబ్ కేరళలోని తిరువనంతపురంలోని చూలత్తుకోట గ్రామానికి చెందినవాడు. అక్కడన అతను తన సొంత భూమిని పునరావాసం కోసం ఉపయోగించుకునేలా సరిచేయడానికి గానూ ఈ మోడిఫైడ్ డేవూ మ్యాటిజ్ ఎక్స్‌కావేటర్‌ను ఉపయోగించాడు.

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

అన్నింటికన్నా ముఖ్యంగా, అతను ఈ వాహనాన్ని స్క్రాప్ చేయటం ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మోడిఫైడ్ వాహనంతో 14 అడుగుల పొడవైన స్థలాన్ని కూడా సులువుగా లెవల్ చేయవచ్చని చెబుతున్నారు. కఠినమైన రహదారులను సైతం సులువుగా అధిగమించేలా దీనిని మోడిఫై చేశారు.

MOST READ:రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యర్థి 'హోండా హైనెస్ సిబి 350' ఫస్ట్ రైడ్ రివ్యూ ; వివరాలు

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

ఇస్రో ఇంజనీర్ బెన్ జాకబ్ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ యంత్రం 500 కిలోల బరువున్న వస్తువులను సైతం సులువుగా ఎత్తగలదని చెప్పారు. డేవూ మ్యాటిజ్ కారును ఇంత సామర్థ్యం గల వాహనంగా మార్చడానికి కేవలం రూ.70,000 మాత్రమే ఖర్చు చేసిట్లు తెలిపాడు.

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

సాధారణంగా, ఇలాంటి ఓ రియల్ ఎక్స్‌కావేటర్‌ను కొనుగోలు చేయాలంటే సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ జాకబ్ తన ఇంజనీరింగ్ తెలివితేటలతో, అతి తక్కువ ఖర్చుతేనే రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో ఈ ఎక్స్‌కావేటర్‌ను సృష్టించాడు.

కేరళకు చెందిన ఈ ఇస్రో ఇంజనీర్ తయారు చేసిన ఈ యంత్రం కోసం ఉపయోగించిన డేవూ మ్యాటిజ్ కారు 1998 మోడల్‌గా గుర్తించారు. సుమారు 22 సంవత్సరాలు వయస్సు కలిగిన ఈ కారు, ప్రస్తుత పరిస్థితుల్లో చక్కగా పనిచేయటం విశేషం.

MOST READ:ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం కల్పించిన గల్ఫ్ ఆయిల్.. ఏంటో చూసారా!

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

డేవూ మ్యాటిజ్ ఇప్పటి కారు కాదు, దీనికి భారత మార్కెట్లో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత కార్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే ఇది అత్యంత పాపులర్ అయిన కాంపాక్ట్ కారుగా హిస్టరీ క్రియేట్ చేసింది. (మన తెలుగు చలన చిత్రం 'ఖుషి'లో పవన్ కళ్యాన్ ఇలాంటి ఓ కారునే ఉపయోగించారు).

22 ఏళ్ల పాత డేవూ మాటిజ్ కారును ఎక్స్‌కావేటర్‌గా మార్చిన ఇస్రో ఇంజనీర్

డేవూ సంస్థ 1980 మరియు 1990 కాలంలో భారతదేశంలో ఒక శక్తివంతమైన సంస్థగా అవతరించింది. అయితే, వివిధ కారణాల వలన ఈ సంస్థ కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం విడిచి వెళ్లిపోయింది. ఇప్పటికీ మనదేశంలో అక్కడక్కడా డేవూ మోటార్ కంపెనీ తయారు చేసిన కొన్ని ఉత్పత్తులు కనిపిస్తూ ఉంటాయి.

MOST READ:ఒక ఛార్జ్‌తో 240 కి.మీ అందించగల సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ; వివరాలు

Most Read Articles

English summary
ISRO Engineer Turns 22 Year-Old Daewoo Matiz Car Into A Excavator. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X