నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వైరల్ అవుతున్న వీడియో

చాలామంది వాహన ప్రేమికులు మరియు సెలబ్రెటీలు అత్యంత ఖరీదైన ఆధునిక కార్లతో పాటు అమెరికన్ బ్రాండ్ ఆయిన 'హమ్మర్' (Hummer) కార్లను కూడా కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ బ్రాండ్ వాహనాల పట్ల వారికున్న మక్కువే దీనికి కారణం. హమ్మర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రెటీలలో అల్లు అర్జున్, మహేంద్ర సింగ్ ధోని మొదలైన వారు ఉన్నారు.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

హమ్మర్ బ్రాండ్ యొక్క హెచ్2 ఇప్పటి వరకు కూడా మంచి ఆదరణ పొందుతున్న కంపెనీ కారు. అద్భుతమైన పనితీరుని అందించడమే కాకుండా అత్యంత విశాలంగా ఉండటం వల్ల దీనిని ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఇటీవల ఒక హమ్మర్ హెచ్ 2 ప్రవహించే నదిలో చిక్కుకుపోయింది. ఎంత సేపటికీ బయటకు రావడానికి కుదరకపోవడంతో పాత మహీంద్రా జీప్ సాయంతో బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

ఈ వీడియో శనీల్ MpNz అనే యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయబడింది. ఇందులో హమ్మర్ హెచ్2 వాహనాన్ని మహీంద్రా జీప్ ఎలా బయటకు లాగించో చూడవచ్చు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం స్పష్టంగా తెలియదు.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

ఈ వీడియోలో మీరు గమనించినట్లైతే ఒక ప్రవహించే నదిలో హమ్మర్ నిలిచిపోయింది, ఎంత ప్రయత్నించినా కూడా బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. అయితే ఆ సమయంలో మహీంద్రా కంపెనీ యొక్క ఒక పాత జీప్ ద్వారా 'హమ్మర్ హెచ్2' ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

జీప్ యొక్క ఫ్రంట్ బంపర్ కి మరియు హమ్మర్ హెచ్2 యొక్క ఫ్రంట్ బంపర్ కి తాళ్లతో గట్టిగా కడతారు. ఆ తరువాత జీప్ బలంగా లాగుతుంది. అదే సమయంలో హమ్మర్ హెచ్2 కూడా ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంది. మొత్తం మీద చివరికి హమ్మర్ హెచ్2 నది నుంచి బయటపడుతుంది. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

నిజానికి హమ్మర్ H2 అనేది 4X4 మోడ్ లో ఉన్నప్పటికి నదిలో నుంచి బయటకు రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ నది మరీ ఎక్కువ లేదు అని కూడా మనకు వీడియోలో తెలుస్తుంది. అయితే ఆ నదిలో రాళ్లు మొదలైనవి ఉన్నట్లు కూడా మనం గమనించవచ్చు.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

4X4 వాహనాలు ఆఫ్ రోడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే కంపెనీలు ప్రత్యేకంగా వాటిని ఆఫ్ రోడ్ కోసం తయారుచేయబడి ఉంటాయి. అయితే కొన్ని అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి అవాంతరాలే ఎదురవుతాయి.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

అదే సమయంలో హమ్మర్ హెచ్2 రోడ్ బయాస్డ్ టైర్లను పొందుతుంది, కావున ఇది నది నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంది. అయితే ఇందులో మీరు చూసే మహీంద్రా జీప్ మాత్రం ఆఫ్ రోడ్ కి కావలసిన క్యాపబిలిటీస్ కలిగి ఉంది. ఈ కారణంగానే ప్రవహించే నదిలో కూడా హమ్మర్ ని బయటకు తీయగలిగింది.

ఇక్కడ కనిపించే హమ్మర్ హెచ్2 మనదేశంలో రిజిస్టర్ చేయబడింది కాదు. ఎందుకంటే దీనిమీద ఉన్న నెంబర్ ప్లేట్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. నిజానికి ఇది దుబాయ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉంది. దీన్ని బట్టి చూస్తే విదేశీయలలో కూడా చాలామంది ఆఫ్ రోడ్ ప్రేమికులు ఉన్నారని తెలుస్తోంది.

గౌతమ్ సింఘానియా వంటి మిలియనీర్లు కూడా మెక్లారెన్ 720ఎస్ వంటి హై-ఎండ్ అన్యదేశాపు కార్లను భారతదేశానికి దిగుమతి చేసుకున్నారు. అయితే కొంతమంది ధనవంతులు తమకు నచ్చిన వారి వాహనాలను విదేశాల నుంచి కొన్ని కండిషన్స్ మీద మనదేశానికి కొన్ని రోజుల పాటు తీసుకురావచ్చు. ఈ విధంగా తీసుకువచ్చినదే ఈ హమ్మర్ హెచ్2 కూడా అని భావిస్తున్నాము.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

నిజానికి కొంతమంది కార్లను కార్నెట్ ద్వారా భారతదేశానికి తీసుకువస్తారు. ఇది వస్తువుల కోసం తాత్కాలిక పాస్‌పోర్ట్. కార్నెట్ ఉపయోగించి, ఒక వ్యక్తి ఆ నిర్దిష్ట వాహనంపై దిగుమతి పన్ను మరియు సుంకం చెల్లించకుండా భారతదేశానికి కారును దిగుమతి చేసుకోవచ్చు. కారు సాధారణంగా 6 నుండి 12 నెలల కాలానికి దిగుమతి చేయబడుతుంది మరియు అందుకే దీనికి దిగుమతి పన్ను మరియు సుంకం నుండి మినహాయింపు ఉంటుంది.

నదిలో చిక్కుకున్న 'హమ్మర్ హెచ్2' ను బయటకు లాగిన పాత మహీంద్రా జీప్.. వీడియో వైరల్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ప్రవహించే నదిలో వాహనాలను డ్రైవ్ చేయడం చాలా ప్రమాదం, అయినప్పటికీ దీనిని విస్మరించి వాహనాలను డ్రైవ్ చేసే ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ కథనంలో మనం చెప్పుకున్న హమ్మర్ నది ప్రవాహంలో చిక్కుకుంది, అయితే ఆ నదిలో నీటి ప్రవాహం అంత ఉదృతంగా లేదు, కావున ఎలాంటి ప్రమాదం జరగలేదు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ఏమి జరిగేదే ఊహించవచ్చు. మొత్తానికి హమ్మర్ వంటి ఆఫ్ రో డర్ నీటిలో నదిలో చిక్కుకోవడం కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, October 14, 2022, 10:30 [IST]
English summary
Old mahindra major rescued hummer h2 stuck in river video viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+