వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
వయసు కేవలం సంఖ్య మాత్రమే.. ఈ వాక్యం చాలా మంది చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఈ మాటను ఓ వృద్ధుడు నిజమని నిరూపించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, ఓ వృద్ధుడు తనకు ఎంతగానో ఇష్టమైన పోర్స్చే 911 కారెరా 4ని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ వీడియో చూసిన ఆటోమోటివ్ ఔత్సాహికుల సంఘం ఆయన్ను గొప్పగా పొగిడేస్తోంది. వీడియోలో పెద్దమనిషి (వృద్ధుడు) కారు నుంచి కిందికి దిగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో రీనాజ్ అబ్దుల్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఇందులో తెల్లటి పోర్షే 911 సూపర్ కారును పునరుద్ధరించి ఉండటం చూడవచ్చు.

వృద్ధుడు సూపర్ కారులో వచ్చి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాడు. ఇందులో ఆ వ్యక్తి పూల చొక్కా ధరించి ఉండటం చూడవచ్చు. ఈయన పేరు 'నోషైర్ దారా మూడీ' (Noshire Dara Moody) అని, వారు గోవాలో నివసిస్తున్నట్లు సమాచారం. ఈయన వద్ద ఇతర అనేక అన్యదేశ్య కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈయన వద్ద ఉన్న ఇతర కార్లలో లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉన్నట్లు సమాచారం.
ఇక వీడియోలో కనిపిస్తున్న కారు విషయానికి వస్తే.. ఇది భారీగా ఉండే రియర్ స్పాయిలర్, చూడగానే ఆకర్శించబడే బంపర్ వంటివి పొందుతుంది. ఈ కారును కొంతమంది 991. 1 911 GT3 అని భావిస్తున్నారు. నిజానికి ఇది 2013 పోర్స్చే 911 కారెరా ఎస్ అని సమాచారం. ఈ కారు ఒక ప్రత్యేక బాడీ కిట్ పొందుతుంది. ఈ కిట్ వల్ల ఇది జీటీ3 మాదిరిగా కనిపిస్తుంది.

2013 పోర్స్చే 911 కారెరా ఎస్
పోర్స్చే ఇండియా భారతదేశంలో 911 కారెరా మరియు కారెరా ఎస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ. 1.14 కోట్లు మరియు రూ. 1.33 కోట్లు. ఈ సూపర్ కారు 3.8 లీటర్ ప్లాట్ సిక్స్ ఇంజిన్ పొందుతుంది. ఇది 400 పీఎస్ పవర్ మరియు 440 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.
పోర్స్చే 911 కారెరా కారు ఉన్న సెలబ్రిటీల జాబితాలో యానిమల్ మూవీ నటుడు బాబీ డియోల్ కూడా ఉన్నారు. ఈయన దగ్గర కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఖరీదైన 4ఎస్ వేరియంట్. బాబీ డియోల్ ఈ కారును తరచుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈయన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ మాధవ్ కూడా ఉన్నారు.
శ్రీరామ్ మాధవ్ 997 తరం నుంచి వైట్ పోర్స్చే 911 కారెరా 4 ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో కూడా పోర్స్చే 911 మోడల్ ఉందని తెలుస్తోంది. ఇతని వద్ద 2018 మోడల్ 991.2 పోర్స్చే 911 జీటీ3 ఉంది. ఇప్పటికి భారతదేశంలో ఈ మోడల్ కేవలం మూడు యూనిట్ల మాత్రమే ఉన్నట్లు సమాచారం. అందులో ఒకటి దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








