ఇన్‌స్టా రీల్‌ కోసం ఎంత పని చేశావ్‌ తాతా.. పోలీసులు ఏం చేశారంటే..?

ప్రస్తుతం మానవ జీవితంలో సోషల్‌ మీడియా ఒక భాగం అయింది. ఇటీవల కాలంలో ఇందుకు సంబంధించిన అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు.. చాలా మంది యువత సహా పలువురు విచిత్రమైన ఛేష్టలకు పాల్పడుతున్నారు. అందుకోసం రూల్స్‌ను కూడా ఉల్లంఘిస్తున్నారు. పోలీస్‌ అధికారులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నా.. చాలా మందిలో మార్పులు రావడం లేదు.

అయితే సోషల్‌ మీడియా క్రేజ్‌ ఘటనల్లో ఇప్పటి వరకు యువత బాధ్యులుగా ఉన్నారు. అయితే తాజాగా ఓ సీనియర్‌ సిటిజన్‌ కూడా ఇన్‌స్టా రీల్‌ కోసం ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

old man pours fuel on his tata harrier car

ఓ వృద్దుడు తన టాటా హారియర్‌ కారును తీసుకొని ఫిల్లింగ్‌ స్టేషన్‌ (పెట్రోల్‌ బంక్) వచ్చాడు. అక్కడున్న సిబ్బందిని కాదని, తానే స్వయంగా తన కారులో డీజిల్ నింపడం ప్రారంభించాడు. అయితే నేరుగా ఇంధన ట్యాంక్‌లో డిజిల్‌ నింపకుండా ఇష్టానుసారం ప్రవర్తించడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఫలితంగా చాలా వరకు డీజిల్‌ బయట పడుతోంది.

టాటా హారియర్‌ కారులో డీజిల్‌ నింపడం అతని ఉద్దేశం కాదని ఈ వీడియో సరిగా గమనిస్తే అర్థం అవుతుంది. కేవలం సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యేందుకే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. కారు టైర్లు, నేలపైనా డీజిల్‌పైనా పడింది. ఫిల్లింగ్‌ స్టేషన్‌ సిబ్బంది క్లాత్‌తో కారును శుభ్రం చేయడం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ ఘటనపై నోయిడా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ స్పందించారు. దర్యాప్తు చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

old man pours fuel on his tata harrier car

పెట్రోల్‌, డిజిల్‌ అధికంగా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ వీడియోలోని వ్యక్తి రీల్స్‌ కోసం పెద్ద రిస్క్‌ చేశాడు. అది కూడా ఫిల్లింగ్‌ స్టేషన్‌ (పెట్రోల్‌, డిజిల్‌ బంక్‌)లో ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. ఆ సమీపంలో చిన్న మంటలు వచ్చినా.. భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సమీపంలోని చాలా దూరం వరకు ప్రజలకు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఘటనపై గతం వారం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నోయిడా డీసీపీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకున్నారా లేదా అనేది తెలియలేదు. సోషల్‌ మీడియా క్రేజీ కారణంగా ఇప్పటికే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులను కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేందుకు ఈ మధ్య కాలంలో యువత అనేక విన్యాసాలు చేస్తున్నారు. బైక్, కార్లపై ప్రమాదకరంగా ప్రయాణించడం సహా పబ్లిక్‌ రోడ్లపైనే రేస్‌లు నిర్వహిస్తున్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణం అవుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చాలా మందిలో ఎటువంటి మార్పులు రావడం లేదు. భారీగా జరిమానాలు విధించడం, వాహనాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు చేసిన మార్పు రావడం లేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, August 16, 2023, 13:09 [IST]
English summary
Old man pours fuel on his tata harrier car to create viral video in noida
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+