ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలే! ముసలాయన బైక్ స్టంట్ (వీడియో)
గతంలో యువకులు లేదా యువతులు బైక్స్ స్టంట్స్ చేయడం చాలా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ (వృద్ధుడు) బుల్లెట్ స్టంట్ చేయడం నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో వృద్ధుడు రోడ్డు పక్కన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ (Royal Enfield Bullet) మోటార్‌సైకిల్ స్టంట్ చేయడం చూడవచ్చు. బైకు మీద కూర్చుని వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తులతో ఏదో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత బైకుని ఎడమవైపుకు వంచి కుడి పాదాన్ని నేలపై గట్టిగా ఉంచి హ్యాండిల్ బార్ తిప్పి వేగంగా బైక్ స్టార్ట్ చేశారు. బైక్ వెంటనే దుమ్ములేపడం చూడవచ్చు.

ఈ సంఘటన మొత్తం కొన్ని సెకన్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. అయితే సుమారు 60 సంవత్సరాలు దాటినట్లు కనిపిస్తున్న ఈ వృద్ధుడు చాలా నమ్మకంతో బైక్ స్టంట్ చేశారు. స్టంట్ చేసే సమయంలో కూడా అయన ముఖం నవ్వుతో వెలిగిపోతుండటం స్పష్టంగా చూడవచ్చు. మొత్తానికి పెద్దాయన చేసిన బైక్ స్టంట్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది వెలుగులోకి రాలేదు.
ఇక అసలు విషయానికి వస్తే.. బైక్ స్టంట్ చేయడం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. వీడియోలో వృద్ధుడు హెల్మెట్ ధరించలేదు. ఒక రోడ్డు పక్కన బైక్ స్టంట్ చేశారు. ఆ సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలు వెళ్తుండటం గమనించవచ్చు. అనుకోను ప్రమాదం జరిగి బైక్ అదుపుతప్పి రోడ్డుమీదికి వెళ్తే.. ఊహకందని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహాతీతమనే చెప్పాలి.

హెల్మెట్ ధరించలేదు, కాబట్టి ఒకవేళా ప్రమాదం జరిగితే.. తలకు బలమైన గాయాలు అవ్వొచ్చు. బైక్ రైడింగ్ చేసే బైకర్లు సైతం రైడింగ్ గేర్ ధరించి ప్రమాదాల బారి నుంచి బయటపడిన సందర్భాలు చాలానే వెలుగులోకి వచ్చాయి. కాగా ఈ వీడియోలో కనిపించే వృద్ధుడు హెల్మెట్ కూడా ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణాలే కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఇక్కడ కనిపించే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ పరిమాణంలో మాత్రమే కాకుండా బరువులో కూడా భారీ బైక్. కాబట్టి ఈ బైకుతో స్టంట్స్ చేస్తే పట్టు కోల్పోవడం లేదా బ్యాలెన్స్ కోల్పోవడం జరగవచ్చు. నిజానికి స్టంట్స్ చేయడానికి లేదా బైక్ రేసుల్లో రైడింగ్ చేయడానికి ప్రత్యేకమైన బైకులు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా వాటిని రైడ్ చేసే రైడర్లు కూడా బాగా ట్రైనింగ్ అయినవాళ్లే ఉంటారు.
పబ్లిక్ రోడ్ల మీద నిషిద్ధం..
నిజానికి బైక్ స్టంట్స్ అనేవి పబ్లిక్ ప్లేసులో చేయకూడదని గతంలోనే చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. మీకు బైక్ స్టంట్స్ చేయాలనే ఆసక్తి ఉంటే.. దానికోసం ఏర్పాటు చేసిన ప్రైవేట్ స్థలాల్లో లేదా ట్రాకుల్లో నిపుణుల సమక్షంలో ట్రై చేసుకోవచ్చు. నిపుణుల సమక్షంలో కాకూండా మీకు మీరే ప్రమాదకర స్టంట్స్ చేస్తే ప్రమాదాలను ఆహ్వానించిన వారే అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








