రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. వారికి 21 రోజులే గడువు.. లేదంటే వాహనం షెడ్డుకే.!!
కాలం చెల్లిన వాహనాలు వాడుతున్న వారికి ఢిల్లీ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ ఇచ్చింది. పాత వాహనాన్ని రోడ్డుపై నడుపితే.. ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్న మూడు వారాల్లోగా యజమానులు సరైన పత్రాలు చూపించి వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వాటిని స్క్రాప్ చేయనున్నారు. ఇందుకు సదరు యజమానికి ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం: ఢిల్లీలో విపరీతమైన కాలుష్యం కారణంగా, రాష్ట్రంలో 10 సంవత్సరాల కంటే ఎక్కువ వినియోగించిన పాత డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వాడిన పాత పెట్రోల్ వాహనాలపై పూర్తిగా నిషేధం ఉంది. ఈ వాహనాల యజమానులు తమ వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేయవచ్చని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇదిలా ఉండగా కొందరు మాత్రం ఢిల్లీలో ఇంకా పాత వాహనాలను రోడ్డుపై నడిపిస్తున్నారు. దీంతో ఢిల్లీలో వాయుకాలుష్యం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. దీన్ని అరికట్టేందుకు అలాంటి నిషేధిత వాహనాలను రోడ్డుపై నడిపితే వాటిని జప్తు చేయాలని ఢిల్లీ ట్రాఫిక్(Ban On Old Vehicles In Delhi) విభాగం అధికారులు ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు.. వాహనాలను సీజ్ చేసే ప్రక్రియకు కూడా అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంలో వాహనాలు రిజిస్టర్ చేయబడి, వాహన యజమాని కోసం కొంత కాలం పాటు వేచి ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు పాత వాహనాలను స్వాధీనం చేసుకున్న తర్వాత.. వాహన యజమానులు సంబంధించిన పత్రాలు సిద్ధం చేస్తేనే వాహన యజమానికి వాటిని తిరిగి అప్పగించాలనే నిబంధన ఉంది.

ఇప్పుడు ఈ నిబంధనలో కొత్త మార్పు తీసుకొచ్చారు. దీని ప్రకారం, స్వాధీనం చేసుకున్న వాహనాలు మూడు వారాల పాటు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆ లోపు వాహన యజమాని సంబంధిత పత్రాలను అందజేయకపోతే, నిర్దిష్ట వాహనాన్ని స్క్రాప్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం. వాహనం సీజ్ చేసిన తర్వాత 21 రోజులు మాత్రమే వాహనం ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని తెలుస్తోంది.
పాత వాహనాలతో పొల్యూషన్: ఇదొక్కటే కాదు, వాహనాన్ని జప్తు చేసే సమయంలో, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వినియోగించిన డీజిల్ వాహనాలు లేదా పదిహేనేళ్ల కంటే ఎక్కువ నడిచిన పెట్రోల్ వాహనాలు నిషేధించినట్లయితే, ఆ వాహనాలకు ట్రాఫిక్ అధికారులు రూ.10,000 జరిమానా విధిస్తున్నట్లు సమాచారం. ఇది ద్విచక్ర వాహనమైతే ఆ వాహనానికి రూ.5000 ఫైన్ విధించనున్నారు.
Old Vehicles Ban In Delhi: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా.. నిషేధించబడిన వాహనం రోడ్డుపై తిరుగుతుంటే, దానిని స్వాధీనం చేసుకున్న వెంటనే యజమానికి అధికారులు తెలియజేస్తారు. వాహనాన్ని స్క్రాప్ చేసేలోగా యజమానులు సంబంధిత పత్రాలు సిద్ధం చేసి ఆ పత్రాలతో వస్తేనే వారికి వాహనాలను అప్పగిస్తారని తెలుస్తోంది.
కాగా ఒకవేళ యజమాని సంబంధిత వాహన పత్రాలతో వాహనాన్ని తిరిగి తీసుకుని.. అదే వాహనాన్ని మళ్లీ రోడ్డుపై ఉపయోగిస్తే, అధికారులు వాహనం స్వాధీనం చేసుకుంటారని.. దాని యజమానికి తిరిగి ఇవ్వబడదని కూడా తెలుస్తోంది. ఈ చట్టాలన్నీ ఇప్పటికే అమల్లో ఉన్నప్పటికీ.. ఇప్పుడు కేవలం 21 రోజులకే వాహనాలకు రక్షణ ఉంటుందన్న కొత్త నిబంధనను ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది.
కాబట్టి.. ఢిల్లీ వాసులు పాత వాహనాలను రోడ్డుపై నడిపితే, అవి 10 ఏళ్ల డీజిల్ వాహనాలు లేదా 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలు అయినా, వారు ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని రోడ్లపై నడపకూడదు. రోడ్డుపై కొత్త వాహనాలను మాత్రమే నడపాల్సి ఉంటుంది. వాయి కాలుష్యానికి పాత వాహనాలు కారణమవుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకువచ్చింది.


Click it and Unblock the Notifications








