టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

హోరాహోరీగా జరిగిన టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో భారతీయ ఆటగాళ్లు తమదైన రీతిలో అద్భుతమైన ప్రతిభను చూపారు. ఇందులో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించగా పీవీ సింధు బ్రాంజ్ మెడల్ సాధించింది. అయితే ఒలంపిక్ చరిత్రను తిరగరాస్తూ భారతీయ ఆణిముత్యం ప్రముఖ అథ్లెట్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సొంతం చేసుకుని, భారతదేశానికి వన్నె తెచ్చాడు.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రాను యావత్ భారతదేశం వేనోళ్ళా కొనియాడుతోంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు భారీ నజరానాలు కూడా ప్రకటించింది. ఐ=అంతే కాకుండా మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారుని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్ గేమ్స్ లో జావెలిన్ తో విభాగంలో 87.58 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. 13 సంవత్సరాల తర్వాత నీరజ్ తొలి భారతీయ ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచాడు. అంతే కాకుండా కేవలం 23 ఏళ్ల వయసులో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన అతి పిన్న వయస్కుడు కూడా.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

ఇప్పుడు ప్రపంచానికి సుపరిచితుడైన నీరజ్ చోప్రా ఒలంపిక్ గోల్డ్ మెడల్ గెలుచుకున్న వ్యక్తిగా మాత్రమే తెలుసు, అయితే ఇతడు బైక్ రైడర్ కూడా.. ఈ విషయం దాదాపు ఎవరికీ తెలియకపోవచ్చు. నీరజ్ చోప్రా హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఖండారా నివాసి మరియు ఒక రైతు కుమారుడు. మోటార్ సైకిళ్ల పట్ల నీరజ్ చోప్రాకున్న అభిరుచిని గురించి తెలుసుకోవడానికి అతని ఇన్‌స్టాగ్రామ్ చూడవచ్చు.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

నీరజ్ చోప్రా ఇన్‌స్టాగ్రామ్ లో బజాజ్ పల్సర్ 220 ఎఫ్‌తో ఉన్న ఫోటోలు చాలా చూడవచ్చు. అంతే కాకుండా చోప్రా మార్కెట్లో అత్యంత ఖరీదైన హార్లీ-డేవిడ్సన్ 1200 రోడ్‌స్టర్‌ కూడా కలిగి ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు మీరు ఇక్కడ గమనించవచ్చు.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

నీరజ్ చోప్రా 2019 సంవత్సరంలో ఆసియా క్రీడలలో గెలిచినప్పుడు, ఈ బైక్‌ తనకు గిఫ్ట్ గా లభించింది. ప్రస్తుతం, నీరజ్ చోప్రా తన హార్లే డేవిడ్‌సన్‌ను ఖండారాలోని తన పూర్వీకుల ఇంటిలో ఉంచాడు, ఇవి కాకుండా అదే సంవత్సరంలో అతను ఒక ట్రాక్టర్ కూడా కొనుగోలు చేశాడు.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

వీటన్నిటిని గమనిస్తే నీరజ్ చోప్రాకి వాహనాలపై ఎంత మక్కువ ఉందొ మనకు అర్థమవుతుంది. తన ఒలింపిక్ విజయం తర్వాత ఆనంద్ మహీంద్రా ప్రకటించిన మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కూడా త్వరలో నీరజ్ చోప్రా గ్యారేజీలో చేరనుంది.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

ఇప్పటికే ఆనంద్ మహీంద్రా ప్రకటించినదాని ప్రకారం మహీంద్రా ఎక్స్‌యూవీ 700 యొక్క మొదటి బ్యాచ్ నుండి, నీరజ్ చోప్రాకు అందించబడుతుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఇంకా విడుదల కాలేదు, అయితే ఇది 2021 ఆగష్టు 15 న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

టోక్యో ఒలంపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా గురించి మీకు తెలియని వివరాలు

మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రానున్న కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ 700 అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది కంపెనీ యొక్క మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ గా ఉండే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తి సమాచారం విడుదల సమయంలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Olympic gold medal winner neeraj chopra bike collection details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X