ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలంపిక్ గేమ్స్ లో భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని తీసుకువచ్చిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా గురించి నేడు ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే నీరజ్ చోప్రాకు కార్లు మరియు బైకుల పట్ల విపరీతమైన ఇష్టం కూడా ఉంది. ఈ కారణంగానే ఇతని వద్ద లగ్జరీ కార్లు మరియు బైకులు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల నీరజ్ చోప్రా ఫోర్డ్ మస్టాంగ్‌ కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

భారతదేశం యొక్క కీర్తిని నలుదిక్కుల వ్యాపింపజేసిన మన నీరజ్ చోప్రా ఘనతకు మెచ్చిన దేశీయ కార్ల తయారీ సంస్థ అయిన Mahindra & Mahindra చైర్మన్ ఆనంద్ మహీంద్రా కంపెనీ యొక్క కొత్త XUV700 ని గిఫ్ట్ గా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇటీవల ఆనంద్ మహీంద్రా తాను ప్రకటించిన విధంగానే XUV700 గోల్డ్ ఎడిషన్ అతనికి అందించారు.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా బ్లూ అండ్ వైట్ కలర్‌లో ఉన్న ఫోర్డ్ మస్టాంగ్‌ను డ్రైవ్ చేశారు. అయితే ఈ కారు అతడిదేనా.. కాదా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఫోర్డ్ కంపెనీ ప్రస్తుతం కొత్త కార్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేసింది. ఈ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ చేయబడింది కానీ నీరజ్ హర్యానాలో డ్రైవింగ్ చేస్తూ కనిపించారు, కాబట్టి ఇది ఇంతకుముందే ఉపయోగించిన కారులా కనిపిస్తుంది.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

నీరజ్ ఈ కారును కొనుగోలు చేసినట్లయితే, అది మంచి నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కారుని కొనుగోలు చేయాలంటే బయటి నుండి దిగుమతి చేసుకోవలసి ఉంటుంది. కావున దీని ధర అప్పుడు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఇప్పటికే ఈ కారుని కొన్నట్లయితే ఇది సరసమైన ధరకే లభించింది అని చెప్పవచ్చు.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

ఫోర్డ్ ముస్టాంగ్ అనేది భారతదేశంలో కంపెనీకి చెందిన ఒక ప్రసిద్ధ కారు. ఇది కేవలం ఒక టాప్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ కారు 5 లీటర్ V8 ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 395 బిహెచ్‌పి పవర్ మరియు 515 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో లభించే ఇంధన నాణ్యత కారణంగా, దీనిని భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా మార్చారు. భారతదేశంలో రోహిత్ శెట్టి, రిషబ్ పంత్ వంటి చాలా మందికి ఈ కారు ఉంది.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

ఫోర్డ్ ముస్టాంగ్ కారు కేవలం భారతీయ మార్కెట్లో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నివేదికల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం, ఫోర్డ్ 2020 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 80,577 యూనిట్ల ముస్టాంగ్ కూపేని విక్రయించింది. ఈ మజిల్ కార్ గ్లోబల్ స్పోర్ట్స్ కూపే మార్కెట్‌లో 15.1 శాతాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ కూపే ఫోర్డ్ ముస్టాంగ్‌ను వరుసగా ఆరేళ్లపాటు నిలబెట్టుకోవడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

నీరజ్ చోప్రా Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్:

నీరజ్ చోప్రా ఇటీవల మహీంద్రా XUV700 గోల్డ్ ఎడిషన్ డెలివరీ పొందాడు. ఈ విషయం నీరజ్ చోప్రా స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది కంపెనీ యొక్క ప్రత్యేక ఎడిషన్, దీనిని కంపెనీ చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ రూపొందించారు, ఇది మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లో ఉంచబడింది.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

Mahindra XUV700 గోల్డ్ ఎడిషన్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, అంతే కాకుండా ఇది చాలా ప్రత్యేకమైనది, ఇందులో సుమిత్ ఆంటిల్ రికార్డ్, కస్టమ్ డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, గోల్డ్‌ కలర్ కొత్త మహీంద్రా లోగో మరియు సీట్ మరియు IP ప్యానెల్స్‌పై గోల్డ్ యాక్సెంట్‌లు ఉన్నాయి. ఈ గోల్డ్ యాక్సెంట్స్ కారణంగా ఇది మరింత దూకుడుగా కనిపిస్తుంది.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

ఈ కారు లోపల కూడా నీరజ్ చోప్రా ఒలంపిక్ గేమ్స్ లో సాధించిన రికార్డును టెయిల్‌గేట్‌లో బ్యాడ్జ్ రూపంలో అలాగే ముందు డ్యాష్‌బోర్డ్ మరియు ఆరు హెడ్‌రెస్ట్‌లపై అందించారు. అంతే కాకుండా దాని వర్టికల్ స్లేట్ గ్రిల్‌పై గోల్డ్ పూత కూడా ఇవ్వబడింది. దీని కారణంగా ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

దీనితో పాటు ఈ SUV యొక్క లోగో శాటిన్ గోల్డ్ ప్లేటింగ్‌లో ఉంచబడింది, కావున ఇది చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులోని అన్ని సీట్లు మరియు IP ప్యానెల్‌లు గోల్డ్ కలర్ దారంతో యాసగా కుట్టారు. మొత్తానికి ఇది సాధారణ XUV700 కంటే కూడా చాలా ప్రత్యేకంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

కొత్త మహీంద్రా XUV700 ప్రారంభ ధర ఇప్పుడు రూ. 12.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే దాని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 22.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కంపెనీ ఈ కారును మొత్తం నాలుగు వేరియంట్లలో విక్రయిస్తోంది, ఇందులో MX, AX3, AX5 మరియు AX7 వేరియంట్‌లు ఉన్నాయి.

ఫోర్డ్ ముస్టాంగ్‌ డ్రైవ్ చేస్తూ కనిపించిన నీరజ్ చోప్రా.. మీరు చూసారా..!!

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Olympics gold medalist neeraj chopra drives ford mustang details
Story first published: Thursday, November 25, 2021, 12:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X