ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి విజయం సాధిస్తారు. పేదరికంలో ఎదిగి గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు సైకిల్ మెకానిక్ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ రోజు జాగ్వార్ మరియు బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ కార్లను కొనుగోలు చేశాడు, దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

నివేదికల ప్రకారం రాహుల్ తనేజా మధ్యప్రదేశ్ లోని కట్లాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. అతడు తన తల్లికి చిన్న కుమారుడు, చిన్నతనంలో మెకానిక్ అయిన తన తండ్రికి సహాయం చేసేవాడు. తన తండ్రితో పాటు, టైర్లను పంక్చర్ చేసే పని కూడా చేసాడు.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

రాహుల్ తనేజా అంతటితో అతని ప్రయాణం ముగిసిపోకూడదని నిర్ణయించుకుని, ఇంటిని వదిలి స్థానిక ధాబాలో రూ. 150 సుమారు రెండు సంవత్సరాలు పనిచేశాడు. అంతే కాకుండా పండుగల సమయంలో దీపావళి సందర్భంగా బాణసంచా, హోలీ సమయంలో రంగులు మరియు సంక్రాంతి సమయంలో గాలిపటాలు అమ్మేవాడు.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

కానీ రాహుల్ తనేజా ఆరు అడుగుల పొడవుండి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల అతడు స్నేహితుల సూచన మేరకు రాహుల్ మోడలింగ్‌లోకి ప్రవేశించాడు. అతడు మోడలింగ్ లో ప్రవేశించి మిస్టర్ జైపూర్ మరియు మిస్టర్ రాజస్థాన్ అవార్డులను గెలుచుకున్నాడు.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

ఈ విధంగా అతడు విజయం వైపు మెల్లమెల్లగా అడుగులు వేసాడు. ఈ సమయంలో అతడు మొదటి లగ్జరీ కారు కొనడానికి అవసరమైన డబ్బును సేకరించాడు. రాహుల్ తనేజా 2011 లో బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్‌ను కొనుగోలుచేశాడు. అంతే కాకుండా ఆ తరువాత అతడు RJ 14 CP 0001 ఫ్యాన్సీ నంబర్‌ను కూడా కొనుగోలు చేసాడు.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

ఏడు సంవత్సరాల తరువాత, అతను తన డ్రీమ్ జాగ్వార్ ఎక్స్‌జెఎల్ కారును కొన్నాడు. వారు బ్లాక్ జాగ్వార్ కారును రూ. 1.5 కోట్లకు కొన్నారు. ఈ లగ్జరీ కారుకి కూడా ఫ్యాన్సీ నంబర్ కొనుగోలుచేశారు. రాహుల్ తనేజా జాగ్వార్ ఎక్స్‌జెఎల్ రిజిస్ట్రేషన్ నంబర్ 0001 ను ఒక నెల అందుకున్న తర్వాత కారు డెలివరీ చేసుకున్నాడు. ఈ నంబర్ పొందడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు చేసాడు.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

వారి బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ మరియు జాగ్వార్ ఎక్స్జెఎల్ కార్ల రిజిస్ట్రేషన్ సంఖ్య 0001. కారు రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి జాగ్వార్ బిడ్డింగ్ ద్వారా రూ. 16 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు వారు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ కార్ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి రూ. 10.3 లక్షలు చెల్లించారు.

ఒకప్పుడు సైకిల్ మెకానిక్.. ఇప్పుడు లగ్జరీ కార్స్ ఓనర్.. ఎలా అనుకున్నారా?

రాహుల్ తనేజా న్యూమరాలజీని ఎక్కువగా నమ్ముతుంటారు కావున తన లక్కీ నంబర్ 1 గా నిర్ణయించుకున్నాడు. అతను 1996 లో కొనుగోలు చేసిన స్కూటర్‌లో 2323 రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది. ఈ సంఖ్యల మొత్తం 10. ఏది ఏమైనా అట్టడుగు నుంచి లగ్జరీ కార్లు కొనుగోలుచేసేవరకు రావడం అనేది నిజంగా ప్రశంసనీయమైన చర్య.

Most Read Articles

English summary
A Cycle Repair Mechanic Now Owns Luxury Cars. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X