సరికొత్త అవతారంలో 'వన్‌ఇండియా'.. డిజిటల్‌ మీడియాలో తిరుగులేని ఆధిపత్యం!

భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వన్ఇండియా సరికొత్త రీబ్రాండింగ్‌తో వచ్చింది. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మల్టీ లాంగ్వేజెస్‌ కంటెంట్‌ని అందిచడంలో వన్‌ఇండియా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కొత్త లోగో, అప్‌డెటెడ్‌ వెబ్‌సైట్‌తో పాటు మరింత స్టైలిష్‌ లుక్‌ని కలిగి ఉంది. "There's only Oneindia" అనే ట్యాగ్‌లైన్‌తో బ్రాండింగ్‌ని ఆవిష్కరించింది.

1999లో Indiainfo.comగా స్థాపించబడిన ఈ సంస్థ 25 ఏళ్లలో వన్ఇండియాగా అభివృద్ధి చెందింది. ఇది పాఠకులకు తగినట్లుగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా మార్పు చెందుతూ వస్తుంది. ఈ తాజా రీబ్రాండింగ్ దాని విజయవంతమైన ప్రయాణంలో మరో అడుగు అని చెప్పవచ్చు.

Oneindia-Unveils-Reimagined-Identity

బహుభాషావాదాన్ని ప్రతిబింబించే 'కొత్త లోగో': సుపరిచితమైన Oneindia లోగో మరింత డైనమిక్ మరియు ఆధునిక డిజైన్‌లో అప్‌డేట్‌ చేయబడింది. ఈ వన్ఇండియా కొత్త రీబ్రాండింగ్ బహుభాషావాదం మరియు భిన్నత్వంలో ఏకత్వం అనే స్ఫూర్తిని సూచిస్తుంది. ప్రస్తుతం వన్‌ఇండియా పది భాషల్లో వార్తలను అందిస్తుంది.

10 భాషల్లో సేవలు: వన్‌ఇండియా ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, ఒరియా, బెంగాలీ మరియు పంజాబీ భాషల్లో వార్తలను అందిస్తుంది. ఈ వన్‌ఇండియాకు చెందిన YouTube, WhatsApp, Facebook, Twitter (Now X), Instagram వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఫాలోయింగ్‌ని కలిగి ఉంది.

విశ్వసనీయ వార్తలకు నిబద్ధత: వన్‌ఇండియా విలువైన మరియు నమ్మదగిన వార్తలను అందించే వెబ్‌సైట్‌గా అవతరిచింది. ప్లాట్‌ఫామ్‌కి అనుగుణంగా మారుతున్న పాఠకుల ప్రాధాన్యతలకు అనుగుణంగా వార్తలను వేగంగా అందించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తుంది. ఈ బ్రాండ్‌ నిబద్ధత అది రూపొందించిన కంటెంట్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఏకఛత్రాధిపత్యం: ఈ వన్‌ఇండియా ప్లాట్‌ఫారమ్ నెలవారీ 200 మిలియన్ల ప్రత్యేక వినియోగదారులను చేరుకుంటుంది. అంటే భారతదేశంలోని ప్రతి ఐదుగురు ఇంటర్నెట్ వినియోగదారులలో ఒకరు వన్ఇండియాను సందర్శిస్తున్నారు. దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులలో 25 శాతం మంది వన్‌ఇండియాతో నిమగ్నమై ఉన్నారు.

అందరికీ విభిన్నమైన కంటెంట్: వన్‌ఇండియా వివిధ ఛానెల్స్‌ ద్వారా వివిధ రంగాల వార్తలను అందిస్తుంది. వినోదం కోసం ఫిల్మీబీట్‌ (FilmiBeat), ఆటోమోటివ్ వార్తల కోసం డ్వైవ్స్‌పార్క్ (DriveSpark), ఫైనాన్స్ అప్‌డేట్‌ల కోసం గుడ్‌రిటర్న్స్ (GoodReturns), స్పోర్ట్స్ కవరేజీ కోసం మైఖేల్ (MyKhel), టెక్నాలజీ వార్తల కోసం గిజ్‌బాట్‌ (Gizbot), ట్రావెల్‌ సమాచారం కోసం నేటీవ్‌ ప్లానెట్ (NativePlanet), రోజువారీ లైఫ్‌స్టైల్‌ చిట్కాల కోసం బోల్డ్‌స్కై (BoldSky) వెబ్‌సైట్స్‌ ఉన్నాయి.

అంతే కాకుండాఎడ్యూకేషన్‌, కెరీర్ ఇండియా, ఉద్యోగ అప్‌డేట్స్‌ మరియు వైరల్ కంటెంట్‌ని వన్‌ఇండియా అందిస్తుంది. ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఇన్ని రకాల వార్తలను వన్‌ఇండియా అందిస్తోంది. ఈ విస్తృతమైన రీచ్ పాఠకులలో వన్‌ఇండియాకు ఉన్న ప్రజాదరణను హైలైట్ చేస్తుంది. ఇది వినియోగదారులు, ప్రకటనదారులకి మధ్య వారధిగా పని చేస్తూ డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌లో కీలక పాత్ర పోషిస్తుంది.

వన్‌ఇండియా రీబ్రాండింగ్ భారతదేశం అంతటా విభిన్న ప్రేక్షకులు, పాఠకులకు మరింత చేరువ అయ్యేందుకు అంకితభావంతో పనిచేయనుంది. కొత్త లోగో మరియు వెబ్‌సైట్ ఏకత్వంలో భిన్నత్వం ప్రధాన విలువలను కొనసాగిస్తూ వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడ్డాయి. వన్‌ఇండియా కొత్త జర్నీ ఇకపై మరింత వేగంగా సేవలు అందించనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 15, 2024, 12:31 [IST]
English summary
Oneindia unveils reimagined identity check new look and updates here
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+