కేవలం 57 శాతం ఫెరారీ ఓనర్లు మాత్రమే సంతోషంగా ఉన్నారట!
మీ వద్ద ఫెరారీ కారు ఉంటే మీరు సంతోషంగా ఉంటారా..? ఎందుకుండం.. ఎగిరి గంతేసేంత సంతోషంగా ఉంటాం అంటారా..! అయితే, తాజా అధ్యయనం ప్రకారం, కేవలం 57 శాతం మంది ఫెరారీ యజమానులు మాత్రమే సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ బీమా సంస్థ ఆక్సా గ్రూప్ (AXA Group) చేపట్టిన ఓ పరిశోధనలో కేవలం 57 శాతం మంది ఫెరీరా యజమానలు మాత్రమే తమ కోట్ల రూపాయల ఖరీదు చేసే స్పోర్ట్స్ కార్ల డ్రైవింగ్‌ను ఆస్వాదిస్తూ, సంతోషంగా ఉన్నట్లు తేలింది.
బ్రిటన్‌లో నిర్వహించిన ఈ పరిశోధనలో, 2000 మంది ఫెరారీ యజమానుల అభిప్రాయాలను సేకరించారు. వారి అభిప్రాయాలను ఆధారంగా చేసుకొని ఆక్సా గ్రూప్ తయారు చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అయితే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మిగిలిన 43 శాతం మంది ఫెరారీ యజమానులు సంతోషంగా లేరని కానీ లేదా ఫెరారీ సర్వీస్ పట్ల విసిగి వేసారిపోయారని సదరు రీసెర్చ్ తెలుపలేదు. దానికి బదులుగా వారు సాధారణంగా ఫెరారీ డ్రైవింగ్‌ను ఆస్వాదించటం లేదని ఇందులో పేర్కొన్నారు.
ఈ రీసెర్చ్‌ను కేవలం ఫెరారీ కార్లపై మాత్రమే కాకుండా, వివిధ లగ్జరీ కార్లపై కూడా చేపట్టారు. ఇందులో 82 శాతం మంది బిఎమ్‌డబ్ల్యూ యజమానులు తమ లగ్జరీ కార్ల డ్రైవింగ్‌ను ఆస్వాదిస్తుండగా, 78 శాతం మంది ఆస్టన్ మార్టిన్ కార్ల యజమానులు, 78 శాతం మంది లెక్సస్ కార్ల యజమానులు, 76 శాతం సియట్ కార్ల యజమానులు, 75 శాతం ప్యూజో కార్ల యజమానులు సంతోషంగా ఉన్నట్లు తేలింది. ఇక సంతోషంగా లేని కార్ల యజమానుల విషయానికి వస్తే, 59 శాతం మంది ల్యాండ్ రోవర్ కార్ల యజమానులు, 46 శాతం మంది వోల్వో కార్ల యజమానులు తమ డ్రైవింగ్‌ను ఆస్వాదించడం లేదని తేలింది.

Click it and Unblock the Notifications