320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ప్రతి మనిషి తప్పకుండా తన జీవిత కాలంలో తప్పకుండా ఒక్క సరైన విమానాల్లో ప్రయాణించాలని కలలు కంటూ ఉంటాడు. అయితే ఈ కలలు కొంత మందికి నెరవేరతాయి, మరి కొంత మందికి ఆ కల నిజంగానే ఒక కలగానే మిగిలిపోతుంది.

కానీ ఒక విమానంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణిస్తే.. నిజంగా తలచుకుంటేనే అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది, కదా. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

నివేదికల ప్రకారం, అమృత్‌సర్ కి చెందిన ఒక వ్యక్తి విమానంలో ఒంటరి ప్రయాణికుడిగా దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. యుఎఇలో ఉన్న ఒక భారతీయ వ్యాపారవేత్త ఇటీవల అమృత్‌సర్ నుండి దుబాయ్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడుగా ప్రయాణించాడు.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

విమానంలో ప్రయాణించిన ఈ ఒంటరి ప్యాసింజర్ పేరు ఒబెరాయ్. యితడు పది సంవత్సరాల పాటు దుబాయ్‌లో బిజినెస్ చేస్తున్నాడు. ఈ కారణంగానే అక్కడి ప్రభుత్వం అతనికి గోల్డెన్ వీసా అందించింది. సాధారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 10 సంవత్సరాలు నివాసమున్న కొంతమంది ప్రముఖులు లేదా వ్యాపారవేత్తలకు ఈ గోల్డెన్ వీసా అందిస్తారు.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

కరోనా సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులు అధికంగా పెరుగుతున్న కారణంగా ఇండియా మరియు యుఎఇ మధ్య విమాన ప్రయాణాలు నిషేదించబడ్డాయి. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కొన్ని నియమాలను అనుసరిస్తూ విమాన ప్రయాణాలు మొదలయ్యాయి.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ఈ సమయంలో జూన్ 23 న ఉందయం 4 గంటలకు ఎయిర్ ఇండియా (AI-929) ద్వారా అమృత్సర్ నుండి దుబాయ్ వెళ్లాను. మొత్తం విమానంలో ప్రయాణించిన ఏకైక వ్యక్తి నేను, అని అతడు మీడియా ద్వారా తెలిపాడు. నిజంగా ఈ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని ఒక గొప్ప అనుభూతిని మిగిల్చింది.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

నేను విమానంలో ఒక్క ప్రయాణికుడుగా ఉన్నప్పుడు ఒక మహారాజ లాంటి అనుభూతి కలిగింది అని ఆయన అన్నారు, అంతే కాదు అక్కడ ఉన్న మొత్తం సిబ్బంది తనను బాగా చూసుకున్నారని, ఖాళీ సమయంలో నన్ను ఫోటోలు కూడా తీశారు అని అతడు తెలిపాడు.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ఒబెరాయ్ అతని ప్రయాణం కోసం 70 దిర్హామ్స్ చెల్లించారు. భారత కరెన్సీలో ప్రకారం దీని విలువ సుమారు రూ. 15,000. అతను సుమారు 320 సీట్లతో ఉన్న ఎయిర్ బస్ విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడుగా ప్రయాణించాడు.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ఒబెరాయ్ కి గతంలో విమాన ప్రయాణ అనుమతి నిరాకరించబడింది, కాని తరువాత విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు జోక్యం చేసుకున్న తరువాత అనుమతి ఇచ్చారు. యుఎఇ ఆమోదించిన టీకా రుజువుతో సహా అన్ని సంబంధిత ప్రయాణ పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.

320 సీట్ల విమానం, కేవలం ఒక్కడే ప్రయాణికుడు.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం

ఇటువంటి గొప్ప ప్రయాణానికి సహకరించిన యుఎఇ మరియు భారత ప్రభుత్వాలకు ఒబెరాయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక సేవలకు అందించిన ఎయిర్ ఇండియాకు ధన్యవాదాలుప్రయాణం అని అతడు తన పేస్ బుక్ ద్వారా పేర్కొన్నాడు. ఒబెరాయ్ గోల్డెన్ వీసా కలిగి ఉన్నందున అతని ఒక్కడికైనా తప్పకుండా విమానం ఎగరడం అవసరం. నిజంగా ఇలాంటి అనుభవం మీకు ఎదురై ఉంటే తప్పకుండా మాతో పంచుకోండి.

Most Read Articles

English summary
Indian Businessman Only Passenger On Flight To Dubai. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X