ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

గత రెండు రోజులుగా ఇంటర్నెట్‌లో ఎక్కువగా వినిపిస్తున్న, కనిపిస్తున్న పేరు విల్ స్మిత్ (Will Smith). ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్‌లో ఈ విలక్షన నటుడు చేసిన వింత పనికి ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్కార్ అవార్డులు వేదికగా, ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యాఖ్యాత క్రిస్ రాక్ చెంప్ చెళ్లుమనిపించాడు విల్ స్మిత్. ఇందుకు క్రిస్ రాక్ చేసిందల్లా స్మిత్ భార్యపై జాడా స్మిత్‌పై జోక్ వేయడమే.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

అసలేం జరిగిందంటే.. ఇటీవల జరిగిన 94వ ఆస్కార్ అవార్డులు కార్యక్రమంలో స్మిత్ భార్య జాడా స్మిత్ గుండుతో కనిపించారు. నిజానికి, ఆమెకు అలోపేసియా అనే ఓ అరుదైన అనారోగ్యం కారణంగా జుట్టు రాలిపోతుండటంతో, గుండు చేయించుకుంది. ఈ ఫంక్షన్‌లో ఆమెను చూసిన క్రిస్ రాక్, జి.ఐ. జేన్ చిత్రంలో డెమి మూర్ పోషించిన పాత్రతో జాడా స్మిత్‌ను పోలుస్తాడు.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

బహుశా జి.ఐ.జేన్2 కోసం ఆమె ఈ గెటప్‌లో ఉన్నారని చలాకులు విసిరాడు క్రిస్. ఈ జోక్ జాడా స్మిత్‌కు నచ్చలేదు. ఆ జోక్ వేయగానే ఆమె ముఖం మాడిపోయింది. దీంతో భార్యపై తనకున్న ప్రేమను చూపేందుకు స్మిత్ నేరుగా వేదికపైకి వెళ్లి కోట్లాది మంది చూస్తుండగా, క్రిస్ రాక్ గూబ గుయ్యిమనేలా చెంపపై కొట్టాడు. తొలుత ఇదంతా ఓ స్కిట్‌లో భాగమేమో అని అందరూ నవ్వుకున్నారు. కానీ, క్రిందకు దిగిన తర్వాత కూడా విల్ స్మిత్ గట్టిగా అరుస్తూ తన భార్యపై కామెంట్స్ చేయవద్దని క్రిస్ రాక్‌పై కోపం వ్యక్తం చేశాడు.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే విల్ స్మిత్ ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన కింగ్ రిచర్డ్ చిత్రానికి గానూ ఆస్కార్ అవార్డు లభించింది. అనంతరం విల్ స్మిత్ ఆస్కార్ వేదిక మీదుగా అతని దురుసు ప్రవర్తన పట్ల క్రిస్ రాక్‌కు మరియు అకాడెమీకి క్షమాపణలు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు ఆస్కార్ అకాడెమీ ఈ స్టార్ హీరోపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే, అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు కూడా జారీచేసినట్లు సమాచారం.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

హాలీవుడ్ అత్యుత్తమ నటుడైన విల్ స్మిత్ భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన ఇటీవలి డిస్నీ చిత్రం అలాడిన్ పలు భారతీయ స్థానిక భాషలలో అనువదించబడింది మరియు ఇతగాడికి భారతదేశంలో కూడా మంచిపేరును తెచ్చిపెట్టింది. ఇక ఈ హాలీవుడ్ హీరో దగ్గర ప్రపంచంలోనే చాలా అత్యుత్తమ కార్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం రండి.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

1. 1965 ఫోర్డ్ మస్టాంగ్ (1965 Ford Mustang)

అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్ 1960 కాలంలో తయారు చేసిన ఐకానిక్ స్పోర్ట్స్ కారు 1965 ఫోర్డ్ మస్టాంగ్ విల్ స్మిత్ క్లాసిక్ కార్ కలెక్షన్‌లో భాగంగా ఉంది. ఈ ఐకానిక్ మజిక్యులర్ కారులో పవర్‌ఫుల్ 4.7 లీటర్ వి8 పెట్రోల్‌ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 270 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. విల్ స్మిత్ వద్ద ఉన్న ఈ క్లాసిక్ ఫోర్డ్ మస్టాంగ్ ఇప్పటికీ అదే రెట్రో లుక్‌లో ఉంటుంది. ఇది రెడ్ కలర్ పెయింట్ స్కీమ్ లో చాలా స్పోర్టీగా కనిపిస్తుంది.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

2. మేబ్యాక్ 57ఎస్ (Maybach 57S)

మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ బ్రాండ్ యొక్క హైపర్ లగ్జరీ కార్ బ్రాండ్ మేబ్యాక్. విల్ స్మిత్ కార్ కలెక్షన్‌లో ఈ మేబ్యాక్ సిరీస్‌లో ఉన్న కారు మేబ్యాక్ 57ఎస్, వాస్తవానికి ఇది కంపెనీ నుండి వచ్చిన మొదటి మోడళ్లలో ఒకటి మరియు ఇది 2005 సంవత్సరంలో మేబ్యాక్ బ్రాండ్ యొక్క పునరుద్ధరణను గుర్తించింది. ఈ కారులో 6 లీటర్ వి12 ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 612 బిహెచ్‌పి శక్తిని మరియు 1000 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

3. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost)

బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ రోల్స్ రాయిస్ అందిస్తున్న అత్యంత విలాసవంతమైన కారు రోల్స్ రాయిస్ ఘోస్ట్‌ కూడా విల్ స్మిత్ కార్ గ్యారేజ్ లో ఉంది. ఈ పవర్‌ఫుల్ కారులో 6.75 లీటర్ వి12 ఇంజన్‌ ఉంటుంది, ఇది ఏకంగా 563 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కారు యొక్క అసలైన ప్రత్యేకత దాని వెనుక సీట్లలో ఉంటుంది. ఇది ప్రీమియం లగ్జరీ ఎయిర్‌లైనర్ వంటి డ్యూయల్ స్క్రీన్ మరియు లెదర్ సీట్లు కలిగి ఉంటుంది. కంపెనీ ఈ కారును సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేసిస్తుంది.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

4. బెంట్లీ అజూర్ (Bentley Azure)

విల్ స్మిత్ కార్ కలెక్షన్ లో మరొక అరుదైన మోడల్ బెంట్లీ అజూర్. ఈ లగ్జరీ కార్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది క్షణాల్లో ఓపెన్ టాప్ కారుగా మారిపోగలదు. బెంట్లీ అజూర్ కారులో కంపెనీ శక్తివంతమైన 6.75 లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 456 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

5. మొదటి తరం టెస్లా రోడ్‌స్టర్ (First Gen Tesla Roadster)

టెస్లా బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితం కానప్పుడే, విల్ స్మిత్ ఈ బ్రాండ్ మొదటి తరం రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. టెస్లా బ్రాండ్ నుండి లభ్యమయ్యే అత్యంత వేగవంతమైన కారు ఈ రోడ్‌స్టర్. విల్ స్మిత్ వద్ద ఉన్నది మొదటి తరానికి చెందిన టెస్లా రోడ్‌స్టర్. ఈ కారును కలిగి ఉన్న మొదటి కొద్దిమందిలో విల్ స్మిత్ కూడా ఒకరు. లోటస్ ఎలిస్ ఛాసిస్ ఆధారంగా తయారైన టెస్లా రోడ్‌స్టర్ కారులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 288 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

6. బిఎమ్‌డబ్ల్యూ (BMW i8)

జర్మన్ కార్ బ్రాండ్ బిఎమ్‍డబ్ల్యూ అందిస్తున్న ప్లగ్-ఇన్-హైబ్రిడ్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఐ8 కూడా ఈ జీనీ కార్ కలెక్షన్ లో భాగంగా ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ హైబ్రిడ్ కారులో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ ఇన్‌లైన్ త్రీ పెట్రోల్ ఇంజన్‌ మరియు ఓ ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 369 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

ఆస్కార్ అవార్డ్ విజేత విల్ స్మిత్ కార్ గ్యారేజ్‌లో ఏయే మోడళ్లు ఉన్నాయో తెలుసా?

7. కాడిలాక్ ఎస్కలేడ్ ఈఎస్‌వి (Cadillac Escalade ESV)

హాలీవుడ్‌లో కాడిలాక్ కారు లేని సెలబ్రిటీలు చాలా తక్కువ మంది ఉంటారు మరియు వారిలో విల్ స్మిత్ ఒకరు. అమెరికాలో కాడిలాక్ అనేది ఓ స్టేటస్ సింబల్ లగ్జరీ కార్ బ్రాండ్. ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఉపయోగించే కారు కూడా కాడిలాక్ బ్రాండ్‌కి చెందినదే. అందుకే, ఈ బ్రాండ్‌కు అక్కడ అంత క్రేజ్. కాడిలాక్ ఎస్కలేడ్ ఈఎస్‌వి కారులో గరిష్టంగా 420 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 5.3 లీటర్ ఎల్ఎమ్7 వోర్టెక్స్ వి8 ఇంజన్‌ ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, March 31, 2022, 14:21 [IST]
English summary
Oscar winner will smith cars collection from 1965 ford mustang to bmw i8
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+