కేంద్ర మంత్రులు, వారి కార్లు - పార్ట్ 2

No cars for AK Antony
కేంద్ర రక్షణ శాఖా మంత్రి ఏ.కె. ఆంటోనీ వద్ద కూడా ఎలాంటి బుల్లెట్ ప్రూఫ్ కార్లు లేవు (అధికారికంగా). ఆయన వద్ద ఉన్న ఒకే ఒక్క కారు మారుతి వ్యాగన్ఆర్, ఇది కూడా ఆయన సతీమణి ఎలిజబెత్‌కు చెందినది. దీన్ని సెకండ్ హ్యాండ్‌లో రూ.1,36,000 లకు కొనుగోలు చేశారట. ఈయన వ్యక్తిగత ఆస్తి కేవలం రూ.1,82,000 మాత్రమేనట. ఈయన పేరు మీద ఎలాంటి ప్రాపర్టీ లేదు. బహుశా క్యాబినెట్‌లోని ధనిక మంత్రుల జాబితాలో ఏ.కె. ఆంటోనీ చివర్లో ఉంటారేమో..!!

ఈ మంత్రి చెప్పుకోదగిన వ్యక్తే... మన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం వద్ద ఉండే కార్లు ఏంటంటే.. ఒక ఫోర్డ్ ఫియస్టా, ఒక స్కొడా మరొక ఫోక్స్‌వ్యాగన్ కార్లు ఉన్నాయి. కార్లపై ఈయన రూ.46 లక్షలకు పైగా ఖర్చు చేశారట. అందులో అత్యంత ఖరీదైనది స్కొడా కారు దీని విలువ సుమారు రూ.22 లక్షలు. అంతేకాదండోయ్ ఈయన దగ్గర ఓ సైకిల్ కూడా ఉంది, రూ.1,239 చెల్లించి చిదంబరం ఈ సైకిల్‌ను కొనుగోలు చేశారట.

టెలికాం మంత్రి కపిల్ సిబాల్ మంచి కార్ ప్రియుడు. ఈయన వద్ద ఓ టొయోటా కరోలా, హ్యుందాయ్ సొనాటా మరియు ఓ సుజుకి జీప్ ఉంది. అంతేకాకుండా సిబాల్ వద్ద ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కూడా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.7,97,000.

విదేశాంగ మంత్రి ఎస్.ఎమ్ క్రిష్ణ వద్ద రెండు కార్లు మాత్రమే ఉన్నాయట. అందులో ఒకటి మిత్సుబిషి లాన్సర్ మరొకటి హ్యుందాయ్ సొనాట. లాన్సర్ కారు కోసం రూ.8,30,000 లను, సొనాటా కోసం రూ.13,08,000 లను చెల్లించినట్లు ఆయన తన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు.

న్యాయ శాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వద్ద 1999 సంవత్సరానికి చెందిన మహీంద్రా జీప్, 2005 సంవత్సరానికి చెందిన టొయోటా ఇన్నోవా వాహనాలున్నాయి. ఈ రెండింటి విలువ సుమారు 10 లక్షల రూపాయలు. ఇవి కాకుండా ఈయన వద్ద ఓ పాత ఇంపోర్టెడ్ కారు కూడా ఉందని, దాని విలువ సుమారు రూ.1,13,093 అని ఖుర్షీద్ తెలిపారు.

Most Read Articles

English summary
Union defense minister AK Anthony who is known for his simple lifestyle owns a used car. His wife bought a second hand Maruti Suzuki Wagon R which is worth Rs.136,000.
Story first published: Saturday, September 17, 2011, 8:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X