సముద్రం పాలైన 1200 జాగ్వార్ ల్యాండ్ రోవర్, మినీ లగ్జరీ కార్లు
భారీ సంఖ్యలో వాహనాలను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలించాలంటే చవకైన రవాణా మార్గం సముద్ర మార్గం ఒక్కటే. దాదాపు అనేక కార్ల తయారీ కంపెనీలు ఈ మార్గం గుండానే తమ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. అయితే, ఒక్కొక్కప్పుడు జరిగే విపరీత పరిణామాల వలన ఇటు కార్ కంపెనీలు అటు ఇన్సూరెన్స్ కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అలాంటి ఓ సంఘటనే ఇటీవల బ్రిటన్‌లో చోటు చేసుకుంది. దాదాపు 14,000ల వాహనాలను, ఇతర సామాగ్రిని తరలిస్తున్న ఓ రవాణా నౌక (కార్గో షిప్) బ్రిటన్‌కు సమీపంలోని ఐల్ ఆఫ్ వైట్ అనే ప్రాంతం సముద్రంలో ఓ వైపుకు ఒరిగి పోయింది. ఓడరేవుకు అతి సమీపంలో ఈ ప్రమాదం జరింది. అయితే, అప్పటికే భారీ ఆస్థి నష్టం కూడా జరిగిపోయింది. ఈ నౌకలో దాదాపు 1200 లకు పైగా లగ్జరీ కార్లున్నాయి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హోయెగ్ ఒసాకా కార్ ట్రాన్స్‌పోర్టర్ కంపెనీ గడచిన శనివారం రాత్రి సౌతాంప్టన్ పోర్ట్ నుంచి తన ప్రయాణం ప్రారంభించింది. ఈ నౌకలో 1400 వాహనాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. కాగా.. ఈ నౌక మునకు గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. కావాలనే దీనినే ముంచేశారనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

ఈ రవాణా నౌకలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారు చేసిన 1,200 కార్లు, 65 మినీ కార్లు మరియు దాదాపు 60-70 శాతం నిర్మాణ రంగానికి చెందిన వాహనాలు (జెసిబి లాంటివి) ఉన్నాయి.

తమకు సంబంధించిన 1200 కార్లు ఈ నౌకలో ఉన్నాయని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రతినిధి ధృవీకరించగా, తమకు చెందిన 105 నిర్మాణ రంగానికి చెందిన వాహనాలు ఉన్నాయని జెసిబి ధృవీకరించింది.

ఈ కార్గో షిప్ దాదాపు 45 డిగ్రీల కోణంలో ఓ పక్కకు ఒరిగిపోయి ఉంది. ఆ సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిని రక్షణ బలగాలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగలిగాయి. ఓడకు మునకు సంబంధించి కారణాలను అన్వేషించేందుకు విచారణ ప్రారంభమైంది.

దాదాపు సగానికి ఒరిగిపోయి ఉన్న ఈ రవాణా నౌకను తిరిగి సముద్రంపై ప్రయాణించేలా చేసేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. ఈ నౌక బరువు దాదాపు 51,000 టన్నులు.

వాస్తవానికి ఈ షిప్‌లో 5400 కార్లను తీసుకువెళ్లవచ్చు. అయితే, కేవలం 1400 వాహనాలను మాత్రమే తరలిస్తున్నప్పుడు ఓవర్‌లోడ్ కారణంగా ఇది పక్కకి ఒరిగిపోయే ఆస్కారం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

విచారకరమైన విషయం ఏంటంటే.. ఈ నౌకలో ఇప్పటి 500 టన్నులకు పైగా ఇంధనం ఉంది. ఇలా షిప్ ఒరిగిపోవటం వలన ఇంధనం లీక్ అయినట్లయితే, అది సముద్రంపై తెట్టులా పేరుకొని జలచరాలకు, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications








