భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

భారతదేశంలో 15 నుండి 20 ఏళ్లకు పైబడిన పాత వాహనాలను స్క్రాప్ చేయాలనే నిబంధనలు తెరపైకి రావడంతో, వివిధ రాష్ట్రాలలోని అధికారులు తమ రాష్ట్రాలలో ఉండే పాత వాహనాల జాబితాలను బయటకు తీస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, భారత రోడ్లపై తిరుగుతున్న సుమారు 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే అని తెలుస్తోంది.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

రాష్ట్రాల వారీగా పాత వాహనాల జాబితాను కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి అశ్విని చౌబే వెల్లడించారు. ఈ జాబితాలో 39 లక్షలకు పైగా పాత వాహనాలతో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, 36 లక్షలకు పైగా పాత వాహనాలతో ఢిల్లీ ద్వితీయ స్థానంలో ఉంది. కేవలం ఈ రెండు రాష్ట్రాల్లోనే 75 లక్షలకు పైగా పాత వాహనాలు ఉన్నాయి.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మంత్రి అశ్విని చౌబే 20 సంవత్సరాలకు పైబడిన వాహనాలను అత్యధికంగా నడుపుతున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేశారు. మంత్రి విడుదల చేసిన జాబితా ప్రకారం, కర్ణాటక రాష్ట్రంలో 20 సంవత్సరాలకు పైబడిన వాహనాలు 39.48 లక్షలు ఉన్నాయి.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

అదే సమయంలో ఢిల్లీలో 20 ఏళ్లు నిండిన వాహనాలు 36.14 లక్షలు ఉన్నాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్ 26.20 లక్షల పాత వాహనాలతో మూడవ స్థానంలో ఉంది. కేవలం ఈ మూడు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలలో కూడా ఇప్పటికే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న పాత వాహనాలు భారీ సంఖ్యలో రోడ్లపై తిరుగుతున్నాయి.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

అశ్విని చౌబే విడుదల చేసిన జాబితా ప్రకారం, కేరళలో 20.67 లక్షలు, తమిళనాడులో 15.99 లక్షలు మరియు పంజాబ్‌లో 15.32 లక్షల పాత వాహనాలు ఇప్పటికీ రోడ్లపై తిరుగుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే, దేశంలో ఇప్పటికే 20 సంవత్సరాల వయస్సు పూర్తయిన మొత్తం పాత వాహనాల సంఖ్య 2,14,25,295 యూనిట్లుగా ఉంది.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

అయితే, ఈ గణాంకాల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ మరియు లక్షద్వీప్‌లోని వాహనాలను మినహాయించాయి. కేంద్రీకృత వాహన్ 4 పోర్టల్‌లో ఈ నగరాలు లేకపోవడం వల్లనే వీటిని ఈ జాబితా నుండి మినహాయించినట్లు అశ్విని చౌబే తెలిపారు. దేశంలోని మరికొన్ని ఇతర నగారల నుండి ఈ నివేదికలు రావల్సి ఉంది.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

భారతదేశంలో ఇలాంటి పాత వాహనాలన భవిష్యత్తులో అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా పాత పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు పర్యావరణాన్ని మరింత తీవ్రంగా కలుషితం చేస్తాయి. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాలు తీవ్ర వాయు కాలుష్య సమస్యను ఎదుర్కుంటున్నాయి.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య సమస్య ఆందోళన స్థాయికి చేరుకుంది. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాలతో నడిచే పాత వాహనాలే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో, పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.

భారతదేశంలో 2.15 కోట్లకు పైగా వాహనాలు 20 ఏళ్లకు పైబడినవే..

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మరియు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిందిగా కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే, ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ సబ్సిడీలను కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో భారత రోడ్లపై మరిన్ని గ్రీన్ వాహనాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Over 2 Crore Vehicles In Indian Roads Are Older Than 20 Years. Read in Telugu.
Story first published: Saturday, July 31, 2021, 14:38 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X