ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

ట్రాఫిక్ పోలీసులు ఒకే రోజు 2 వేలకు పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అది ఎక్కడ, ఎందుకు అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం, హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనం నడపడం నేరం, ఇలా టూవీలర్ నడపడం చాలా ప్రమాదకరం.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రమాదం జరిగినప్పుడు వాహనదారుడి ప్రాణ రక్షణ కోసం హెల్మెట్‌ నిబంధనను ట్రాఫిక్ పోలీసులు కఠినంగా అమలు చేస్తుంటారు. కేవలం టూవీలర్ ను నడిపే రైడర్ మాత్రమే కాకుండా, వెనక సీట్‌ పై కూర్చునే పిలియన్ రైడర్ కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలనే నిబంధన గత కొన్నేళ్లుగా అమల్లో ఉంది.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

అయితే, ప్రజలు మోటారిస్టులు మాత్రం ఈ ట్రాఫిక్ నిబంధనలను గాలికి వదిలేసి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హెల్మెట్ లేకుండా టూవీలర్లపై ప్రయాణిస్తున్నారు. ఈ నిబంధన ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఇది దేశవ్యాప్తంగా అమలులో ఉంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వాహనదారులు ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈరోడ్ జిల్లాలో చాలా వరకు ద్విచక్ర వాహనదారులు అస్సలు హెల్మెట్ ధరించరు.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

ఈరోడ్ జిల్లా ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఇద్దరు (రైడర్ మరియు పిలియన్ రైడర్) కూడా హెల్మెట్‌ లను ధరించాలని ఎస్పీ శశిమోహన్ ఆదేశించారు. ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే ద్విచక్ర వాహనాన్ని జప్తు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. ఈ ఉత్తర్వు అక్టోబర్ 13 నుండి అమలులోకి వచ్చింది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన మోటారిస్టులపై ట్రాఫిక్ అధికారులు కొరడా ఝలిపించారు.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

ఈరోడ్ జిల్లా సెంట్రల్ లోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఈ నియమాన్ని చురుకుగా అమలు చేస్తున్నారు. ఈరోడ్ జిల్లాలోని ఎబోనీ క్యాంప్, ఎద్దుల విగ్రహం, బస్టాండ్, పన్నీర్ సెల్వం పార్క్ మరియు ప్రభుత్వ ఆసుపత్రితో సహా అనేక ప్రాంతాల్లో ఆసస్మిక తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని వారి వాహనాలను సీజ్ చేశారు.

అలాగే, జిల్లాలోని భవానీ, మొదక్కురిచి, కోడుమూడి, పెరుండురై, అంత్యూర్, గోబిచెట్టిపాలెం, సత్యమంగళం ప్రాంతాల్లో కూడా పోలీసులు ఈ నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. నిన్న ఒకే రోజు ఈరోడ్ జిల్లాలో 2,300 కి పైగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనాల యజమానులకు జరిమానా కూడా విధించారు.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

నగరంలో రైడర్ మరియు పిలియన్ రైడర్ హెల్మెట్ తప్పనిసరి నిబంధనను పోలీసులు అమలు చేయడం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కూడా ఈ విషయంపై మోటారిస్టుల నుండి భారీ జరిమానాలు వసూలు చేశారు. తమిళనాడులోనే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా పోలీసులు గతంలో ఈ నియమాన్ని ఖచ్చితంగా అమలు చేయడం ప్రారంభించారు. కానీ, దీనిని పాటించాల్సిన ప్రజలు మాత్రం వివిధ కారణాలు చెప్పి, దీనిని విస్మరిస్తున్నారు.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

కానీ, ఈసారి ఈరోడ్ జిల్లా పోలీసులు మాత్రం ఈ నిబంధనను దీర్ఘకాలం పాటు, పూర్తిస్థాయిలో అమలు చేయాలని యోచిస్తున్నారు. దీని ప్రకారం, ఈరోడ్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుండి రెండవ రోజు కూడా వాహన తనిఖీలు జరిగాయి. భవిష్యత్తులో కూడా ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటిస్తామని పోలీసులు తెలిపారు.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రైడర్ మరియు పిలియన్ రైడర్ హెల్మెట్ నిబంధన అమల్లో ఉంది. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో కూడా అధికారులు పిలియన్‌ రైడర్‌ నిబంధనను ఖచ్చితంగా అమలు చేశారు. ఆ సమయంలో వెనక సీటుపై కూర్చున్న వ్యక్తికి హెల్మెట్‌లేకపోతే చలానాలు విధించారు. అయితే, లాక్‌డౌన్‌ తర్వాత ఆ నిబంధనను పోలీసులు అంతగా పట్టించుకోలేనట్లు తెలుస్తోంది.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

కానీ, ఇప్పుడు ఫొటో చలాన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, ఎవరైనా హెల్మెట్‌ లేకుండా టూవీలర్ నడుపుతున్నట్లు పోలీసులు గమనిస్తే, వెంటనే ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఇలా చేయగానే వాహనదారుడికి చలాన్ మెసేజ్‌ వస్తుంది. దీంతో చాలా మంది చలానాలు పడకుండా తప్పించుకునేందుకు ఇప్పుడు రెండో హెల్మెట్‌ కోసం పరుగులు తీస్తున్నారు.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారికి హెల్మెట్లు గరిష్ట రక్షణను అందిస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా, ప్రాణాలను కాపాడే గొప్ప పనిని హెల్మెట్‌లు నిర్వహిస్తాయి. చాలా మంది హెల్మెట్లు ధరించకపోవడానికి ప్రధాన కారణం, వారి టూవీలర్ నైపుణ్యంపై ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. బైక్ వెళ్తున్నప్పుడు నాకేం కాదు, నేను చక్కగానే నడుపుతాను అనే ధీమా ఉంటుంది.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

కానీ, నిజానికి రోడ్డుపై ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియదు. సోషల్ మీడియాలో మనం ఇప్పటికే అనేక రకాల యాక్సిడెంట్ వీడియోలను చూసి ఉంటాం. ఎవరి తప్పు లేకుండానే కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొన్ని ప్రమాదాల్లో హెల్మెట్ వలన ప్రాణ రక్షణ పొందిన వారి వీడియోలు కూడా మన చూసే ఉంటాం.

ఒక్క రోజే 2300 కి పైగా టూవీలర్ల సీజ్.. ఇంతకీ వారు ఏం తప్పు చేశారో తెలుసా..?

కాబట్టి, హెల్మెట్ నిబంధన విషయంలో నిర్లక్ష్యం వహించకండి. హెల్మెట్ మీ ప్రాణాలను రక్షిస్తుంది మరియు మీపై ఆధారపడిన వారికి భరోసాను ఇస్తుంది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలపై వెళ్లిన చాలా మంది విషాదంగా మరణించారని గుర్తుంచుకోండి. అలాగే కారులో ప్రయాణించేటప్పుడు కూడా తప్పనిసరిగా సీట్ బెల్ట్‌లు ధరించండి. కేవలం డ్రైవర్ మాత్రమే సీటు బెల్ట్ ధరించాలి అనే అపోహ ఇక్కడ చాలా మంది మనస్సులలో బలంగా నాటుకుపోయింది. కానీ ఇది తప్పుడు అభిప్రాయం. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి.

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే.

Most Read Articles

English summary
Over 2300 two wheelers seized in erode tamilnadu due to helmet rule violation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X