Just In
- 52 min ago
'బాబా రాందేవ్' మనసుదోచినది ఇదేనా.. వీడియో చూడండి
- 1 hr ago
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ
- 3 hrs ago
భారత్‌లో ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ లాంచ్ అప్పుడే.. మహీంద్రా
- 4 hrs ago
సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!
Don't Miss
- Sports
India Playing XI vs ZIM 1st ODI: రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! ఇసాన్ కిషన్ డౌట్!
- News
ఆంధ్రప్రదేశ్ వైపు అదానీ అడుగులు... వెల్లడించిన సీఎం జగన్
- Technology
ఆండ్రాయిడ్ 13 సాఫ్ట్వేర్ అప్డేట్ని పిక్సెల్ ఫోన్ల కోసం విడుదల చేసిన గూగుల్...
- Movies
Sita Ramam 11 Days Collections: ఫస్ట్ డే రేంజ్ లో 11వ రోజు కలెక్షన్స్.. మొత్తం ప్రాఫిట్ ఎంతంటే?
- Finance
SBI: ఇంటి వద్దకే బ్యాంక్ సేవలు.. ఆ కస్టమర్లకు నెలకు మూడుసార్లు.. 10 రకాల సేవలు ఉచితంగా..
- Lifestyle
Exercise and Sleep: నిద్రపై వ్యాయామ ప్రభావం.. పడుకునే ముందు చేయవచ్చా?
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
భారతదేశంలో ప్రతి ఏటా లక్ష కార్లకు పైగా చోరీ.. ఈ బ్రాండ్ కార్లే దొంగలకు మెయిన్ టార్గెట్!
ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలో భారతదేశం చాలా కీలకమైన మార్కెట్‌గా గుర్తించబడింది. మనదేశం ఇటీవలే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించింది. భారతదేశంలో వాహనాల వినియోగం నానాటికీ అధికమవుతోంది. వాహనాల ధరలు, ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, వాటి అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. అయితే, దేశంలో వాహనాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాహనాల చోరీ కేసుల సంఖ్య కూడా ఏటా పెరుగుతూనే ఉంది.

భారతదేశంలో వాహన తయారీదారులు చాలా సరసమైన ధరలకే సరికొత్త వాహనాలను ప్రవేశపెడుతున్నారు, ఈ నేపథ్యంలో దేశంలో వాహనాలు విక్రయం కూడా గణనీయంగా పెరిగింది. ఇక ధనవంతులైతే ఇంటిలో ప్రతి కుటుంబ సభ్యునికి ఒక్కొక్క కారు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు పెరుగుతున్న కార్ల అమ్మకాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంటే, మరో వైపు నానాటికీ పెరుగుతున్న కార్ల చోరీల కారణంగా సదరు వాహన యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.

దేశంలో కార్ల దొంగతనం ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారింది. భారతదేశంలో ప్రతి సంవత్సరానికి సుమారు 1,00,000 కు పైగా కార్లు దొంగిలించబడుతున్నాయని అంచనా. అయితే, ఈ కార్ల దొంగలకు కూడా ఓ ప్రత్యేకమైన టేస్ట్ ఉంది. వీరు ఏ కారు పడితే ఆ కారుని దొంగిలించరు, వీరికంటూ కొన్ని ప్రత్యేకమైన బ్రాండ్స్ ఉన్నాయి. అలాంటి బ్రాండ్ కార్లనే వీరు దొంగిలిస్తారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి బ్రాండ్ కార్లను కలిగి ఉన్నట్లయితే, మీ కారును సురక్షితంగా ఉంచడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

భారతదేశం అతిపెద్ద కార్ మార్కెట్
ఎక్కడైతే వినియోగం ఎక్కువగా ఉంటుందో అక్కడే మోసాలు/దొంగతనాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. మనదేశం ఇప్పుడు ఓ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ గా ఉంది. భారత్ లో తయారైన వాహనాలు కేవలం మన దేశంలోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించబడుతున్నాయి మరియు అక్కడి మార్కెట్లలో ఇవి మంచి ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. ఇతర దేశాల్లో తయారయ్యే మోడళ్ల కంటే భారత్‌లో తయారయ్యే కార్లు చౌకగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం.

ఇటీవలి కాలంలో భారతదేశంలో తయారయ్యే కార్లు చాలా విశ్వసనీయమైనవిగా మరియు సురక్షితమైనవిగా మారుతున్నాయి.అంతేకాకుండా, భారతీయ కార్ కంపెనీలు విదేశీ మార్కెట్లలో కస్టమర్లను ఆకర్షించే అనేక ఫీచర్లను అందిస్తున్నాయి. కాబట్టి పెరుగుతున్న డిమాండ్ ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో కార్ల మార్కెట్ మరింత గణనీయంగా పెరుగుతుందని అంచనా. భరతదేశంలో కార్ల మార్కెట్ ఇప్పటికే వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత ఐదేళ్లలో 20% కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది.

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న కొద్దీ ఈ వృద్ధి కొనసాగుతుందని అంచనా. వచ్చే 2023 నాటికి భారతదేశంలో 30 మిలియన్లకు పైగా కార్లు రోడ్లపైకి వస్తాయని అంచనా. ఇది ఒకవైపు దేశాభివృద్ధిని సూచిస్తుంటే మరోవైపు దొంగతనాల కేసులు కూడా పెరుగుతాయని చెబుతున్నారు. ఇప్పటికే వాహనాల చోరీల కేసులు ఏటా పెరుగుతున్నాయి. దొంగిలించబడిన వాహనాలు చాలా అరుదుగా తిరిగి పొందబడతాయి.

ఈ కార్ బ్రాండ్లే దొంగల టార్గెట్
దాదాపు అన్ని పాపులర్ బ్రాండ్ల కార్లు భారతదేశంలో ఎక్కువగా దొంగిలించబడుతున్నాయి (ప్రత్యేకించి అధిక డిమాండ్ కలిగిన మారుతి మరియు హ్యుందాయ్ కార్లు ఎక్కువగా చోరీకి గురవుతున్నట్లు సమాచారం). ఎందుకంటే వాటిని దొంగిలించిన తర్వాత దొంగలు వాటిని సులభంగా విక్రయిస్తారు. మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు హ్యుందాయ్ ఐ20 వంటి తక్కువ ధర కలిగిన కార్లు కూడా ఎక్కువగా దొంగిలించబడిన కార్ల జాబితాలో ఉన్నాయి. ఈ మోడళ్లు దొంగల కు చాలా బాగా నచ్చినవి మరియు వీటిని బ్లాక్ మార్కెట్లో విక్రయించడం కూడా సులభం అనేది వారి అభిప్రాయం.

మహారాష్ట్రలో అత్యధికంగా కార్ల చోరీ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా ఒకటి. అంతేకాకుండా, మహారాష్ట్రలోని ముంబై నగరం ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటి. దీంతో దొంగలు కార్లను దొంగిలించి సులువుగా పారిపోవడానికి ఈ నగరాన్ని ఎంచుకుంటున్నారు. ఇక్కడ కొట్టేసిన కార్లను, ఇతర రాష్ట్రాలలో చాలా తక్కువ ధరకే నకిలీ పత్రాలు సృష్టించి విక్రయిస్తున్నారు. ఇలా దొంగిలించబడిన కార్లను కొన్న కస్టమర్లు ఆ తర్వాత అనవసరమైన చిక్కుల్లో పడుతున్నారు.

పాత కార్లపై కూడా దొంగల కన్ను
కార్ల దొంగలు కొత్త కార్లనే కాకుండా పాత కార్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. భారతదేశంలో కొత్త కార్ల కంటే దాదాపు 12 సంవత్సరాల వయస్సు కలిగిన పాత కార్లే ఎక్కువగా ఉన్నాయి. చాలా మందికి కొత్త కారు కొనే స్థోమత ఉండదు కాబట్టి, వారు చాలా ఏళ్లుగా తమ పాత కారునే నడుపుతుంటారు. ఇలాంటి కార్లు చాలా తక్కువ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి కాబట్టి, దొంగలు చాలా తేలిగ్గా వీటిని దొంగిలిస్తున్నారు. పాత కార్లు సాంకేతికతలో వెనుకబడి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

భారతదేశంలో ఒక కారు సంవత్సరానికి సగటున 14,000 కి.మీ ప్రయాణిస్తుంది, ఇది యునైటెడ్ స్టేట్స్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో సగటు కంటే తక్కువ. భారతదేశంలో ఏటా 40 లక్షల వాహనాలు తయారవుతున్నాయి. 2020-2021లో అమ్మకాలు దాదాపు 3 మిలియన్లకు చేరుకోవచ్చని అంచనా. కార్ల పరిశ్రమ నుండి వచ్చే మొత్తం ఆదాయం 2026 నాటికి 6 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో సహాయపడనుంది.

జిపిఎస్ ట్రాకర్ తో కార్ దొంగతనాలకు చెక్..
కార్లు దొంగిలించబడకుండా ఉండాలన్నా లేదా దొంగిలించబడిన వాటిని వెంటనే గుర్తించాలన్నా ఒక్కటే మార్గం, కార్లలో జిపిఎస్ ట్రాకర్లను అమర్చుకోవడమే. సాధారణంగా కార్లలో ఉపయోగించే జిపిఎస్ ట్రాకర్లు రూ. 2000-3000 ధరను కలిగి ఉంటాయి. అయితే, ఈ పరికరం యొక్క ఫీచర్లు మరియు నాణ్యతను బట్టి వీటి ధర మారుతుంది. దొంగతనం నుండి మీ కారును రక్షించడంలో ఇవి ఎంతగానో సహాయపడుతాయి. వీటికి బదులుగా Apple AirTag లను కూడా ఉపయోగించవ్చచు. ఇది సుమారు రూ.1800 ఉంటుంది, దీనిని ఆన్లైన్ లో లేదా యాపిల్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాగ్ ను కారులో ఉంచడం ద్వారా ఐఫోన్ లోని ఫైండ్ మై యాప్ సాయంతో కారు యొక్క లొకేషన్ ని ట్రాక్ చేయవచ్చు.