Just In
Don't Miss
- Movies
అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!
- Lifestyle
ప్రతి రాశిచక్రం వారి చింతలను ఎలా నిర్వహించాలో తెలుసా? భాదల నుండి ఇలా భయటపడాలి
- Sports
Brisbane Test: పాపం శుభమన్ గిల్.. తృటిలో సెంచరీ మిస్!!
- Finance
మారుతీ సుజుకీ కార్ల ధరల షాక్, కార్లపై రూ.34,000 వరకు పెంపు
- News
నెల్లూరు ఎస్పీపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న బూతుపురాణం- అట్రాసిటీ కేసు పెట్టలేదని- తీవ్రవ్యాఖ్యలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?
వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని తెలుసు. ఈ ప్రమాదాలు కేవలం ప్రమాదం మాత్రమే కాదు ప్రాణాంతకం కూడా, ఇటువంటి సంఘటనలలో ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశం ఉంటుంది. రోడ్డుపై వెళ్ళేటప్పుడు వీలైనంతవరకు తక్కువ వేగంతో వెళ్ళాలి, అనుకోకుండా ఓవర్ స్పీడ్ లో వెళ్ళేటప్పుడు ఒక వేలా జంతువు ఎదురుగా వస్తే వాటి ప్రాణాలు కూడా పోతాయి.

ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం ఈ సంఘటనలో ఒక పెద్ద పులి ప్రాణాలు కోల్పోయింది. ఇది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ జిల్లాలో జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ ప్రాంతంలో 2021 జనవరి 6 రాత్రి 9 గంటల సమయంలో 12 ఏళ్ల వయసున్న పులిని కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆఆ పులి ప్రాణాలను కోల్పోయింది. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం రామ్‌నగర్-నేనిటల్ హై-వే నుండి దిగి కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతం గుండా వెళుతున్నట్లు సమాచారం.
MOST READ:టీవీఎస్ అపాచీ సిరీస్ బైకుల కొత్త ధరల జాబితా ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో ఇక్కడ చూడండి

ప్రమాదంలో మరణించిన పులికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత, వాహనం ఆ పులిని ఢీ కొట్టగానే అది 150 దూరంలో పడి మరణించినట్లు తెలిసింది. ఈ కారణంగా ఆ కారు డ్రైవర్ పై పోలీసులు 1972 వన్యప్రాణి రక్షణ చట్టం క్రింద పలు కేసులు నమోదు చేసి, పులికి దహన సంస్కారాలు జరిపారు.

అంతే కాకుండా ప్రమాదానికి కారణమైన ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి సమాచారం ఇస్తూ, బుధవారం రాత్రి 9 గంటల సమయంలో రామ్‌నగర్-నైనిటాల్ హైవేలోని భక్రా బ్రిడ్జ్ సమీపంలో పులిని ఎస్‌యూవీ ఢీ కొట్టిందని ఫతేపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖ్యాలి రామ్ ఆర్య తెలిపారు.
MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

కార్బెట్ రిజర్వ్ భారతదేశంలో అత్యధిక పులి జనాభా సాంద్రతను కలిగి ఉందని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జూలై 2020 నివేదికలో తెలిపింది. ఈ ప్రాంతంలో చాల సార్లు పులులు మనుషులపై దాడి చేసిన సంఘటనలు చాలా వున్నాయి. అయితే కొంతమంది మనుషులు వీటిని చమ్పదానికి ప్రయత్నిస్తారు. ఇది చట్ట విరుద్ధం. అంతే కాకుండా అడవిలో ఉన్న జంతువులను చంపినట్లైతే వారికి కఠినమైన శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది.

ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయుసిఎన్) రెడ్ లిస్ట్ ఆఫ్ త్రేటేడ్ పీసెస్ ప్రకారం, పులులు అంతరించిపోతున్న జాతి, అందువల్ల వాటి రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. కార్బెట్ టైగర్ రిజర్వ్ యొక్క చిన్న భాగం అయిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలోని పురాతన జాతీయ ఉద్యానవనాలలో ఒకటి, దీనికి హంటర్ టర్న్డ్ నాచురలిస్ట్ జిమ్ కార్బెట్ పేరు పెట్టారు.
MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

ఇది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ మరియు పౌరి గర్హ్వాల్ జిల్లాలలో విస్తరించి ఉంది మరియు ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యావరణ పర్యాటక కేంద్రం. ఏది ఏమైనా మనదేశంలో అంతరించిపోతున్న జాతులను కాపాడుకోవడం మన బాధ్యత. దీనిని గుర్తుంచుకోవాలి.