Just In
- 8 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- News
viral video: బాలుణ్ని మింగిన భారీ మొసలి -దాన్ని బంధించి, పొట్ట చీల్చి చూడగా...
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇద్దరు కానిస్టేబుళ్లను పొట్టన పెట్టుకున్న బిఎండబ్ల్యు.. ఎలాగో మీరే చూడండి
భారతదేశంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఒక రోడ్డు ప్రమాదంలో బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారు ఢీ కొట్టడం వల్ల ఇద్దరు ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుళ్లు మరణించారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ విషాదం జరిగింది.

సాధారణంగా లగ్జరీ కార్లు చాలా అధునాతన సదుపాయాలతో, పేరుకు తగ్గట్టుగానే చాలా లగ్జరీగా ఉంటాయి. ఈ బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారు వేగంగా వెళ్లడమే కానిస్టేబుళ్ల మరణానికి కారణమైంది. ప్రమాద సమయంలో మరణించిన కానిస్టేబుల్స్ హెల్మెట్ ధరించి ఉన్నట్లు గుర్తించబడింది. అయితే హైస్పీడ్ లో వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరూ మరణించారు.

కారు ఢీ కొట్టడం వల్ల మరణించిన వారు రవీంద్రన్ (32), కార్తీక్ (34) గా గుర్తించారు. వీరిలో రవీంద్రన్ ద్విచక్ర వాహనం నడుపుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే అతడు అక్కడికక్కడే మరణించాడు. కానీ కార్తీక్ తీవ్ర గాయాలపాలై చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు.
MOST READ:మీకు తెలుసా.. జో బైడెన్ ప్రయాణించే విమానం, విమానం మాత్రమే కాదు.. రక్షణ కవచం

ఈ సంఘటన చెన్నైలోని మొగప్పైర్ ఈస్ట్ వద్ద జరిగినట్లు తెలుస్తుంది. ఇద్దరు పోలీసులు ద్విచక్ర వాహనంపై తమ పనికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ లగ్జరీ కారు డ్రైవర్ ఎస్. అమృత్ (25) గా గుర్తించబడింది. అతను తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఉదయం కావడంతో అమృత్ వేగంగా కారు నడుపుతున్నాడు. అనంతరం ద్విచక్ర వాహనంతో ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు ఐపిసి సెక్షన్ 304 (ii) కింద కేసు నమోదు చేసి కారులో ఉన్న డ్రైవర్ మరియు ఇతరులను అరెస్టు చేశారు. సంఘటన జరిగిన సమయంలో అమృత్ మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు. కానీ ప్రాథమిక దర్యాప్తులో మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. కారు మితిమీరిన వెళ్లడం వల్లే పోలీసులు హెల్మెట్స్ ధరించి ఉన్నప్పటికీ చనిపోయారు.
MOST READ:అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?

దేశవ్యాప్తంగా మోటార్ వాహన చట్టం ప్రకారం వాహనదారులు పరిమిత వేగం కంటే ఎక్కువ వేగంగా వెళ్ళకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లైతే వారు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పోలీసులు రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఎన్ని నియమాలు పెట్టినా ఇప్పటికీ చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించడంలేదు.
భారతదేశంలో రోడ్డుప్రమాదాలను తగ్గించడానికి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ప్రారంభమైంది. ప్రారంభమైన తరువాత కూడా ఇంత ఘోరం జరిగింది. వాహనదారులలో రహదారి భద్రతపై అవగాహన పెంచడానికి కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ప్రారంభించారు. ఈ ప్రచారం ద్వారా వాహనదారులకు వివిధ భద్రతా మార్గదర్శకాల గురించి తెలుస్తుంది.
MOST READ:బువ్వ తిను, బుల్లెట్ బైక్ పట్టుకెళ్లు: రాయల్ ఎన్ఫీల్డ్ 'బుల్లెట్' థాలి ఛాలెంజ్

వాహనదారులు రోడ్డుపై వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి, ట్రాఫిక్ నియమాలను అనుసరిస్తూ ఇతర వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అప్పుడే దేశంలో రోడ్డుప్రమాదాల సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు.