52 స్పీకర్లతో ట్రాక్టర్‌పై పాటలు మ్రోగించిన డ్రైవర్.. దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చిన పోలీసులు..

పంజాబ్ జాతీయంగా మరియు అంతర్జాతీయంగా వాహన సవరణ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. భారీ టైర్లు, ఆఫ్టర్‌మార్కెట్ లైట్లు, బాడీ కిట్‌లు, భారీ సౌండ్ సిస్టమ్‌లు, పెర్ఫార్మెన్స్ మోడ్‌లు మొదలైనవాటితో అనేక వాహనాలను పునరుద్ధరించడం మనం చూశాం. కానీ దీనికి చట్టం పరిమితులతో కూడిన కొన్ని మార్పులను తీసుకువచ్చింది.

ప్రయాణికులు మరియు పాదచారుల భద్రతను పరిగణనలోకి తీసుకుని చట్టం కొన్ని మార్పులు చేసింది. శబ్ధ, వాయు కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుని, వాహనాన్ని అనుకూలీకరించడానికి ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను విధించింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వారిపై కేసుల నమోదుతో పాటు జరిమానా విధించేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

Tractor with 52 Speakers

ఇటీవల పంజాబ్‌లో చట్ట విరుద్ధంగా ట్రాక్టర్‌ను మార్పులు చేసి నడుపుతూ పర్యావరణానికి హాని కలిగించిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 52-స్పీకర్ ఆడియో సిస్టమ్‌తో కూడిన ట్రాక్టర్‌ను కస్టమైజ్ చేసినట్లు పంజాబ్ పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా ఇందుకోసం ట్రాక్టర్‌ ట్రక్కు ఎత్తు కూడా సాధారణ ఎత్తును మించిపోవడం ఆశ్చర్యకరం.

ఈ సంఘటన పంజాబ్‌లోని ఖన్నా గ్రామంలో జరిగింది. ఒక యువకుడు తన ట్రాక్టర్‌ను 52 స్పీకర్లతో మార్పులు చేసి మ్యూజిక్‌ సిస్టమ్‌ జతచేసి.. ట్రక్కు ఎత్తు పెంచి, పలు మార్పులు చేసి నడుపుతూ పట్టుబడ్డాడు. ట్రాక్టర్‌లో అతను చేసిన మార్పులలో 52-స్పీకర్ సౌండ్ సిస్టమ్ హైలైట్.

Tractor with 52 Speakers

స్పీకర్లు, ఆంప్లిఫైయర్‌లతో కూడిన మొత్తం ఆడియో సిస్టమ్‌ను ట్రాక్టర్ వెనుక భాగంలో అమర్చారు. దీంతో ట్రక్కు ఎత్తు 10-12 అడుగుల ఎత్తుకు చేరుకుందని ఇది సాధారణ హెవీ డ్యూటీ ట్రక్కు ఎత్తును మించిపోయిందని పోలీసులు గుర్తించారు. అదనంగా ట్రాక్టర్‌లో ఆడియో సిస్టమ్ నుంచి అధిక శబ్ధంతో మ్యూజిక్‌ను ప్లే చేయడం ద్వారా విద్యార్థులకు ఆటంకం కలుగుతుందని గుర్తించారు. ఇంకా, ట్రాక్టర్‌లో నిషేధించబడిన ప్రెజర్ హార్న్ కూడా అమర్చబడింది.

ఈ వ్యక్తి గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రాక్టర్ యజమానిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో హెచ్చరించినా తీరు మారలేదని పోలీసులు పేర్కొన్నారు. అక్రమంగా మ్యూజిక్ సిస్టమ్ మరియు హారన్‌తో పట్టుబడగా, ట్రాక్టర్ యజమాని అతివేగంతో ట్రాక్టర్‌ను నడుపుతూ పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, ట్రాఫిక్ పోలీసులు అతడిని విజయవంతంగా పట్టుకుని ట్రాక్టర్‌తో సహా అదుపులోకి తీసుకున్నారు.

ట్రాక్టర్ యజమాని గతంలో ఆరు వేర్వేరు నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. సరైన బీమా, పొల్యూషన్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుండానే ట్రాక్టర్ నడుపుతున్నట్లు గుర్తించారు. నిందితుడిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. త్వరలో జిల్లా కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ట్రాక్టర్ యజమానికి విధించిన జరిమానా రూ. 1.5 - 2 లక్షల వరకు ఉంటుందని కూడా వారు పేర్కొన్నారు.

అసలు తయారీదారుల స్పెసిఫికేషన్‌లను మార్చకుండా వాహనాలకు కొన్ని మార్పులు చేయవచ్చు. కారుకు మళ్లీ పెయింట్ వేయడం, రెయిన్ వైజర్‌లు మరియు బంపర్ కార్నర్ ప్రొటెక్టర్‌ల వంటి చిన్న చిన్న చేర్పులు, కార్‌మేకర్ నిర్దేశించిన పరిమితుల్లో టైర్లు మరియు చక్రాలను పెంచడం, RTO నుండి ముందస్తు అనుమతితో ఇంజిన్ మార్పిడి చేయడం వంటి పలు మార్పులు ఇందులో ఉన్నాయి.

అయితే, ఈ నిబంధనలలో దేనినైనా ఉల్లంఘిస్తే, వాహన యజమాని ప్రతి మార్పునకు రూ. 5,000 జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష వంటి పరిణామాలను ఎదుర్కోవచ్చు. దేశంలో వాహనాలకు నిర్మాణాత్మక మార్పులు చట్టం ద్వారా అనుమతించబడవని గమనించాలి. ఇటువంటి మార్పులతో ప్రజా రహదారులపై వాహనాలను ఉపయోగించేందుకు సుప్రీంకోర్టు మరియు మోటారు వాహన చట్టం నిషేధించాయి.

More from DriveSpark

Article Published On: Monday, May 29, 2023, 20:13 [IST]
English summary
Owner modified tractor with 52 speakers police seized tractor and imposed fine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+