యాక్టివా స్కూటర్‌ను అమ్మేసి బుల్లి ఎలక్ట్రిక్‌ కారును కొనుగోలు చేసిన డాక్టర్‌.. కారణమిదేనంటూ వెల్లడి.!!

ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో క్రేజ్ పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ ఎక్కువగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ డాక్టర్‌ స్కూటర్‌కు బదులు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసి విజయం సాధించాడు కూడా. అదేంటి అనుకుంటున్నారా.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

చాలా మంది కొత్త కారును కొనుగోలు చేసిన తర్వాత ఆ వాహనంతో తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్‌ చేసుకుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఒక డాక్టర్‌ తన యాక్టివా స్కూటర్‌ను విక్రయించి, బదులుగా MG కారును కొనుగోలు చేశారు. ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు కొనుగోలు అనంతరం దానితో తన అనుభవాన్ని పంచుకున్నారు. తన తల్లి కోసం ఈ కారు కొన్నట్లు తెలిపారు. అయితే ఈ కారు స్కూటర్‌ కంటే తనకెంతో మేలు చేసిందని.. ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Owner-Sells-Honda-Activa-For-MG-Comet

ఆ డాక్టర్‌ ఇప్పటికే వోక్స్‌వ్యాగన్ టిగువాన్‌ కారును కలిగి ఉండగా.. అతను స్థానిక అవసరాల కోసం హోండా యాక్టివా స్కూటర్‌ని కూడా ఇటీవల కొనుగోలు చేశాడు. అయితే ఈ స్కూటర్‌ను అతని తల్లి ఎక్కువగా షాపింగ్‌కు, ఇతర పనులకు వినియోగించేవారు. బయటకు వెళ్లినప్పుడు, విహారయాత్రలకు, కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

అయితే ఈ సందర్భంలో, తన తల్లి ఎక్కువగా వాడుతున్న హోండా యాక్టివా స్కూటర్‌ని మార్చి, దానికి బదులుగా చిన్న కారు కొనాలని యోచించాడు. అయితే అప్పటికే ఒక కారు ఉండగా మరో పెద్ద కారును పార్క్ చేయడానికి అతనికి ఇంట్లో సరిపడా స్థలం లేకపోవడంతో.. కొత్తగా కొనుగోలు చేసే కారు చిన్న కారు అయి ఉండాలని, అదే సమయంలో నగర అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలని భావించారు.

Owner-Sells-Honda-Activa-For-MG-Comet

ఇందుకోసం మార్కెట్లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లను విశ్లేషించారు. ఫైనల్‌గా టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ అనే రెండు కార్లలో ఏది కొనాలో ఆలోచించారు. ఆయన మొదట ఈ కార్లలోని ఫీచర్లు మరియు వాటి అవసరాలను చూడటం ప్రారంభించినట్లు చెప్పారు. కారును పార్క్ చేయడానికి ఇంట్లో తగినంత స్థలం లేకపోవడం, అంతే కాకుండా తన తల్లి ఎక్కువగా డ్రైవ్‌ చేస్తుంది.. కాబట్టి కొన్ని ఫీచర్లు తప్పనిసరిగా ఉండాలి అనుకున్నారు.

ఉదాహరణకు ఫ్లిప్ కీ, మ్యూజిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల ORVM, పవర్ విండో వంటి ఫీచర్లు వారికి ప్రధాన అవసరాలుగా ఉన్నాయి. ఎంజీ కామెట్‌తో పోలిస్తే టాటా టియాగో EV కొంచెం వెడల్పుగా ఉండటంతో.. పార్కింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతుండటంతో పాటు.. వారికి అవసరమైన అన్ని ఫీచర్లు తక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేసే టియాగోలో లేవని గమనించారు.

Owner-Sells-Honda-Activa-For-MG-Comet

అయితే ఆయన కొత్త కారును రూ. 8 లక్షల బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకున్నారు. ఎంజీ కామెట్‌ EV లో తమకు కావాల్సిన అన్ని ఫీచర్లను బేస్ వేరియంట్‌లో ఉన్నాయని గుర్తించారు. అంతే కాకుండా ఈ కారు కేవలం రూ. 7.90 లక్షల ధరకే హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు వన్ టచ్ పవర్ విండోతో లభిస్తోంది. ఇది కాకుండా ఇందులో రివర్స్ కెమెరా ఫీచర్ కూడా ఉంది.

దీంతో వారు MG Comet EV ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు. నేరుగా MG షోరూమ్‌తో మాట్లాడినప్పుడు, బుకింగ్ చేసిన రెండు రోజుల్లోనే కారు వారికి డెలివరీ చేశారు. తన తల్లి ప్రస్తుతం ఈ కారును ఉపయోగిస్తున్నట్లు డాక్టర్‌ చెప్పుకొచ్చారు. స్థానిక అవసరాలకు ఈ కారు ఎంతగానో ఉపయోగపడుతోందని వెల్లడించారు.

Owner-Sells-Honda-Activa-For-MG-Comet

MG Comet EV ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్పోర్ట్స్‌ మోడ్‌లో 180 కిలోమీటర్ల వరకు డాక్టర్‌ తెలిపారు. అయితే 230 కి.మీ వరకు ప్రయాణించవచ్చని ఈ కారును అందించే ఎంజీ కంపెనీ వెల్లడించింది. కానీ ఈ కారును సరిగ్గా నడిపితే కచ్చితంగా 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని యజమాని పేర్కొన్నారు. కానీ ఈ కారును ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.

Owner-Sells-Honda-Activa-For-MG-Comet

ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 7 గంటలు పడుతుండగా.. ఈ కారును తక్కువ దూరాలకు మాత్రమే ఉపయోగించవచ్చని వెల్లడించారు. చిన్న వీల్‌ మరియు తేలికపాటి టైర్ కారణంగా ఈ కారు రోడ్డుపై గుంతల మీదుగా వెళ్తున్నప్పుడు సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలిపారు. పెద్దగా స్టోరేజీ సౌకర్యం లేకపోవడం మైనస్‌ పాయింట్‌ అని చెప్పుకొచ్చారు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 24, 2024, 19:24 [IST]
English summary
Owner replaces mg comet ev by selling honda activa shares his experience
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+