కరెంట్ పోల్‌కి కారును కట్టేసిన యజమాని.. ఏం ఐడియా గురూ.. ఇలా చేస్తే దొంగలకు చెమటలు పట్టాల్సిందే.!!
భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రముఖ కార్ మోడళ్లలో ఒకటి మహీంద్రా స్కార్పియో SUV. అయితే ఈ కారు చోరీకి గురి కాకుండా ఉండేందుకు ఓ యజమాని సరికొత్త ప్లాన్ వేశాడు. అతని ఐడియాకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఏం చేశాడు అతను.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో వాహనాల దొంగతనాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలే కాకుండా పార్కింగ్ ప్లేసుల్లో ఉంచిన వాహనాలు సైతం చోరీలకు గురవుతున్నాయి. దొంగలు హైటెక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తూ చాలా సునాయాసంగా కార్లను దొంగతనం చేస్తున్నారు. అయితే దీనికి అనుగుణంగా వాహనదారులు కూడా సేఫ్టీ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు.

ఈ క్రమంలో కార్ల యజమానులు తమ కార్లలో దొంగతనం నిరోధక సాంకేతికతను ఏర్పాటు చేసుకుంటున్నారు. అంతే కాకుండా కారు చోరీకి గురైతే అది ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవడానికి అనేక సేఫ్టీ ఫీచర్లను జోడిస్తున్నారు. ఇలాంటి సమయంలో మహీంద్రా స్కార్పియో(Scorpio Tied To Electric Pole) కారు యజమాని తన కారు చోరీ కాకుండా ఉండేందుకు వినూత్న ప్రయత్నం చేశారు.
సాధారణంగా సైకిళ్లను పార్క్ చేసేటప్పుడు చైన్ వేయడం లేదంటే ఏదైనా స్తంభానికి కట్టేయడం చూస్తుంటాం. అదే మాదిరిగా ఇక్కడ స్కార్పియో యజమాని తన కారును ఎలక్ట్రిక్ పోల్‌కు జతచేసి కట్టారు. తను నివసించే ప్రాంతంలో వాహనాల చోరీలు ఎక్కువగా ఉండటంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లలో స్కార్పియో ఒకటి. మార్కెట్‌లో ఈ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు దొంగలు ఈ కారును టార్గెట్‌గా చేసుకుని చోరీకి పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తన కారును కాపాడేందుకు తాళం వేసి కరెంట్ స్తంభానికి కట్టేయడం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
అంతేకాకుండా కారుపై కుక్కలు, పిల్లుల వంటివి దాటి చేయకుండా ఉండేందుకు కారు బానెట్‌ను కప్పుతూ పదునైన ఆకృతితో ఉన్న దుప్పటిని కప్పారు. దీని ద్వారా జంతువులు కారుపై దాడి చేసినా ఇలాంటి ప్రమాదం జరగదని అతని ప్లాన్. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతని తెలివితేటలకు ఫిదా అవుతున్నారు.

ఎవరో ఈ సైంటిస్ట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ కారును ఎంత టెక్నాలజీ ఉపయోగించినా చోరీ చేయలేరంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వాట్ యాన్ ఐడియా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్త ఐడియా అదిరిందంటూ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.
కాగా ఈ రకమైన చర్యలతో పాటు, కొత్త ఆధునిక సాంకేతిక లక్షణాలను కారుకు జోడించడం వల్ల వాహనాలను దొంగతనం నుండి రక్షించవచ్చు. లైవ్ ట్రాకింగ్ డివైజ్ మరియు కార్ థెఫ్ట్ అలారం వంటి చాలా ఫీచర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. సరసమైన ధరల్లో ఈ ఫీచర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వీటిని యజమానులు సద్వినియోగం చేసుకోవచ్చు.
దేశంలో రోజురోజుకీ వాహనాల దొంగతనాల సంఖ్య ఎక్కువైపోతోంది. మీ కార్లు చోరీ కాకుండా ఉండేందుకు సీసీటీవీ ఉన్న ప్రాంతాల్లో మీ కార్లను పార్క్ చేయవచ్చు. మీ కారును కాపాడుకునేందుకు మీరు GPS పరికరం ఉపయోగించడం మీకు దోహదపడుతుంది. దీని ద్వారా మీ కారు చోరీకి గురైతే మీకు వెంటనే తెలుస్తుంది. తద్వారా చోరీకి గురైన మీ కారును మీరు వెంటనే దక్కించుకోవచ్చు.


Click it and Unblock the Notifications








