వాట్‌ ఏ క్రేజీ థాట్‌.. G20 సమ్మిట్‌ సందర్భంగా వినూత్నంగా ప్రచారం.. కారుపై జాతీయ జెండా రంగులతో..

దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి రెండ్రోజుల పాటు G20 సమ్మిట్‌(G20 Summit) జరగనున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలిసారిగా జరగనున్న ఈ సమ్మిట్‌కు డెలిగేట్స్‌ పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓ వార్త సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అదేంటో ఈ కథనంలో చదివేయండి.

ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఖరీదైన కారుకు జాతీయ జెండాలోని రంగులను వేశారు. త్రివర్ణ పతాక రంగులతో ఆ కారు ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఇంకా ఏఏ మార్పులు చేశారంటే..

G20-Summit-2023

దక్షిణాసియాలో తొలిసారిగా మన దేశంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్‌ నిర్వహించనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ఈ ఆర్థిక సదస్సులో 19 దేశాల నేతలు, యూరోపియన్ యూనియన్ నేతలు పాల్గొననున్నారు. అయితే బాధాకరమైన విషయమేమంటే.. ప్రపంచ దేశాల డెలిగేట్స్‌ పాల్గొనే ఈ సమ్మిట్‌ మన దేశంలో జరుగుతోందని చాలా మందికి తెలియదు.

జీ20 సమ్మిట్‌పై కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసినా.. ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే చాలా మందికి దీనిపై అవగాహన లేదన్నది వాస్తవం. కానీ ఈ రోజుల్లో సోషల్‌ మీడియా అనేది గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. అందుకే G20 సదస్సు గురించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం చాలా అవసరం.

G20-Summit-2023

ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంకో అడుగు ముందుకేసి తన ఖరీదైన జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ కారుకు మన దేశ త్రివర్ణ పతాక రంగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా మధ్యలో జీ20 సదస్సు లోగోతో పాటు.. అమృత్‌ మహోత్సవ్‌ లోగోతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

కాగా ఈ గుజరాతీ వ్యక్తి పేరు సిద్ధార్థ్ దోషి. దీంతో జీ20 సదస్సుపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సిద్ధార్థ్‌ తన జాగ్వార్ కారును గుజరాత్ నుంచి ఢిల్లీకి నడిపాడు. ఈ ఏడాది జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం తమకు, భారత్‌కు గర్వకారణమంటూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్ధార్థ్ దోషి తెలిపారు.

G20-Summit-2023

తన కారు ద్వారా దేశం యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా సిద్ధార్థ్ దోషి ఒక వ్యాపారవేత్త. అంతేకాకుండా తను ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమానిగా పేర్కొన్నారు. సిద్ధార్థ్ తన జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ సెడాన్‌ను జాతీయ జెండా రంగులలో చిత్రించగా.. ఈ ప్రత్యేకమైన పెయింట్‌ను మ్యాట్ ఫినిషింగ్‌తో చేశారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది.

G20 సమ్మిట్ లోగోను కారుకు ఒక వైపు మరియు ముందు బానెట్‌పై చూడవచ్చు. సిద్ధార్థ్ దోషి కారు జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ ప్రెస్టీజ్ వేరియంట్‌. ఇది 2.0 లీటర్ 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. జాగ్వార్ కార్లలో విస్తృతంగా ఉపయోగించే ఈ డీజిల్ ఇంజిన్ గరిష్ఠంగా 180 PS శక్తిని మరియు 430 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

జాగ్వార్ విక్రయాల పరంగా మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ వంటి లగ్జరీ కార్లతో పోటీపడుతోంది. 2022లో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' పథకాన్ని ప్రచారం చేసేందుకు సిద్ధార్ దోషి జాతీయ జెండా రంగులను కూడా ఇదే విధంగా మోడిఫై చేశారు.

More from DriveSpark

Article Published On: Friday, September 8, 2023, 14:45 [IST]
English summary
Owner wraps his jaguar xf luxury car with indian flag tri colours and g20 summit logo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+