మీ దగ్గర 20 ఏళ్ల పాత వాహనం ఉందా ? దాని రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవాలంటే ఆస్తులు అమ్మాల్సిందే
మీరు 20 ఏళ్లకు పైబడిన పాత కారు లేదా బైక్‌ను ఉపయోగిస్తున్నారా? అయితే ఇకపై ఆ వాహనాలను రోడ్లపై నడపాలంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం. పాత వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం, భద్రతను పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లకు పైబడిన వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులను దాదాపు రెట్టింపు చేసింది.
ఈ కొత్త నిబంధనలు సెంట్రల్ మోటార్ వెహికల్స్ (థర్డ్ అమెండ్‌మెంట్) రూల్స్ 2025 కింద అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం పాత వాహనాలను నడుపుతున్న లక్షలాది మంది వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. పాత వాహనాలను దశలవారీగా రోడ్ల నుంచి తొలగించి, వాటి స్థానంలో కొత్త, పర్యావరణ అనుకూల వాహనాలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని ఈ నిర్ణయం స్పష్టం చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, వివిధ రకాల వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులు భారీగా పెరిగాయి. ఈ కొత్త ఛార్జీలు జీఎస్టీని మినహాయించి ఉన్నాయి. ఒకప్పుడు తక్కువ ఫీజులతో రిజిస్ట్రేషన్ పొడిగించుకునే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది.
మోటార్‌సైకిల్: పాత మోటార్‌సైకిల్‌కు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు ఇప్పుడు రూ. 1,000 నుంచి రూ. 2,000 కు పెరిగింది.
త్రీ-వీలర్/క్వాడ్రిసైకిల్: ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 3,500 నుంచి రూ. 5,000 కు పెరిగింది.
లైట్ మోటార్ వెహికల్ (కారు): అత్యధికంగా ఉపయోగించే కార్లకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ. 5,000 నుంచి ఏకంగా రూ. 10,000 కు పెరిగింది. ఇది సాధారణ ప్రజలపై తీవ్ర భారం మోపనుంది.

ఇంపోర్టెడ్ 2/3 వీలర్లు: వీటి ఫీజు రూ. 10,000 నుంచి రూ. 20,000 కు పెరిగింది.
ఇంపోర్టెడ్ 4 వీలర్/పెద్ద వాహనాలు: ఈ వాహనాలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజు రూ. 40,000 నుంచి రూ. 80,000 కు పెరిగింది.
ఇతర వాహనాలు: పైన పేర్కొనని ఇతర కేటగిరీల వాహనాలకు రూ. 12,000 ఫీజు వర్తిస్తుంది.

పాత వాహనాలపై ప్రభుత్వం ఇంత కఠినంగా వ్యవహరించడానికి ముఖ్య కారణాలు ఉన్నాయి. పాత వాహనాలు అధిక మొత్తంలో కాలుష్యాన్ని వెదజల్లుతాయి, ఇంధనాన్ని కూడా ఎక్కువగా వినియోగిస్తాయి. దీంతో పాటు, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం వల్ల ఇవి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ వాహనాలను క్రమంగా రోడ్ల నుంచి తొలగించి, వాహనదారులను కొత్త, ఆధునిక, సురక్షితమైన, పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ నిర్ణయం జాతీయ వాహన స్క్రాప్ పాలసీతో కూడా ముడిపడి ఉంది.
వాహన యజమానుల ముందు ఉన్న మార్గాలు
ప్రభుత్వ ఈ నిర్ణయంతో పాత వాహన యజమానుల ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి:
భారీ ఫీజులు చెల్లించడం: వాహనాన్ని ఇంకా కొనసాగించాలనుకుంటే, భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఫీజులను చెల్లించి రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేసుకోవడం. ఇది చాలా మందికి ఆర్థికంగా భారం కావచ్చు.
స్క్రాప్ పాలసీని ఉపయోగించుకోవడం: ప్రభుత్వ స్క్రాప్ పాలసీ ప్రయోజనాన్ని పొంది, తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేసి, కొత్త వాహనం కొనుగోలు చేయడం. స్క్రాప్ పాలసీ కింద పాత వాహనం అమ్మకంపై కొంత ప్రయోజనం, కొత్త వాహనం కొనుగోలుపై పన్ను రాయితీలు లభిస్తాయి. ఇది పాత వాహనాలను వదిలించుకోవడానికి, కొత్త వాహనాన్ని సొంతం చేసుకోవడానికి మంచి అవకాశం.
ఈ కొత్త నిబంధనల అమలు పాత వాహన మార్కెట్‌ను గణనీయంగా ప్రభావితం చేయనుంది. భవిష్యత్తులో వాహనదారులు పాత మోడళ్లకు బదులుగా, ఆధునిక, పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








