ఉబర్ క్యాబ్‌లో ప్యాడిల్ షిఫ్టర్లు.. ఆశ్చర్యపోయిన ప్రయాణికుడు.. ట్విట్టర్ వీడియో వైరల్!
ప్యాడిల్ షిఫ్టర్‌లు (Paddle shifters).. కారు గురించి తెలిసిన వారెవరికైనా ఈ పదం, వాటి పనితీరు గురించి తెలుస్తుంది. అయితే సాధారంగా ఈ ప్యాడిల్ షిఫ్టర్లు ఎక్కువగా స్పోర్ట్స్ సహా హైస్పీడ్ మోడల్ కార్లలో మాత్రమే చూస్తుంటాం. అయితే బెంగళూరు ఉబర్ క్యాబ్ డ్రైవ్ వినూత్న ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినూత్న ఆలోచన.. నెటిజన్ల ప్రశంసలు : ప్యాడిల్ షిఫ్టర్లను తన అవసరానికి అనుగుణంగా ఉబర్ క్యాబ్‌లో అమర్చుకున్నాడు. తాను సొంతంగా ఆలోచించి ఈ ఏర్పాట్లు చేయించుకున్నట్లు ఉబర్ డ్రైవర్ తెలిపారు. ఇందుకు రూ.9 వేల వరకు ఖర్చు అయినట్లు డ్రైవర్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఉబర్ డ్రైవర్ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలు అందుకుంది.

ఆశ్చర్యపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ : బెంగళూరులోని మారతహళ్లి నుంచి హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. ఉబర్ క్యాబ్ బుకింగ్ చేసుకున్నాడు. క్యాబ్ రాగానే అందులోకి వెళ్లి కూర్చున్నాడు. అయితే కాసేపటికి కారు డ్యాష్‌బోర్డును గమనించాడు. అయితే అదేంటని ఉబర్ డ్రైవర్‌ను సాఫ్ట్‌వేర్ ఇంజిన్ అడుగుతాడు. ప్యాడిల్ షిఫ్టర్ అంటూ డ్రైవర్ బదులిస్తాడు. దీంతో ఆశ్చర్యపోయిన ఇంజినీర్ వివరంగా చెప్పాలని కోరతాడు.
వీడియో ట్వీట్‌చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ : తనకు భుజం నొప్పి ఉందని, ఈ కారణంగా గేర్‌లివర్ వద్ద చేయిపెట్టి గేర్లు మార్చేందుకు అవస్థలు పడ్డానని తెలిపాడు. దీంతో సొంతంగా ఆలోచించి ప్యాడిల్ షిఫ్టర్లను అమర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఏర్పాట్లు చేసేందుకు తనకు 9 వేల రూపాయలు ఖర్చు అయినట్లు చెప్పాడు. ఈ విషయాలు అన్ని ఉబర్ డ్రైవర్ చెబుతుండగా వీడియో తీసిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. X( ట్విట్టర్)లో షేర్ చేశాడు.

వీడియో వైరల్.. నెటిజన్లు ప్రశంసలు : భారత్‌లో ప్రతిభకు కొరత లేదని, సరైన మద్దతు అవసరం అంటూ X (ట్విట్టర్)లో పోస్టు చేశారు. ఈ ఉబర్ డ్రైవర్‌కు హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు భాషలు తెలుసునని రాసుకొచ్చాడు. ఈ వీడియో కొద్ది సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉబర్ డ్రైవర్ పై ప్రశంసలు కురుపిస్తున్నారు.
ఏంటీ ప్యాడిల్ షిఫ్టర్లు : ప్యాడిల్ షిఫ్టర్లు అన్ని కార్లలో కనిపించవు. కేవలం హైస్పీడ్ కార్లలో మాత్రమే ప్యాడిల్ షిఫ్టర్లు ఉంటాయి. అధిక వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా స్టీరింగ్ వీల్ వెనుక ఈ ప్యాడిల్ షిఫ్టర్లు అమర్చబడి ఉంటాయి. అయితే ఈ ఉబర్ డ్రైవర్ తన ఆరోగ్య కారణాలతో కారు డ్యాష్‌బోర్డు వద్ద ఈ ఏర్పాట్లు చేశాడు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








