పాక్ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ బాబర్ అజాం కారు రంగుపై నెటిజన్ల ట్రోలింగ్.. ఈ సినిమాతో పోలుస్తూ...!!

పాకిస్థాన్‌ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజాం ఇటీవల పర్పుల్ కలర్‌ లంబోర్గిని అవెంటడోర్‌ కారును ( lamborghini aventador ) కొనుగోలు చేశారు. పాక్‌లోని లాహోర్‌లోని తన ఇంట్లో లంబోర్గినీతో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే వినియోగించిన లంబోర్గిని అవెంటడోర్ వెర్షన్‌ సహా ఇతర వివరాలు తెలియలేదు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫోటోలో బాబర్‌ అజాం తన పర్పుల్‌ కలర్‌ లంబోర్గిని అవెంటడోర్‌తో ఫోజులివ్వడాన్ని చూడవచ్చు. అయితే కొత్త స్పోర్ట్స్‌ కారును కొనుగోలు చేసిన సందర్భంగా బాబర్ అజాంను సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు. మరికొందరు మాత్రం ట్రోల్‌ చేస్తున్నారు.

babar azam car collection

బాలీవుడ్‌ ప్రముఖ సినిమా 'టార్జాన్‌' ది వండర్‌ కారుతో పోలుస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఎందుకంటే పర్పుల్‌ రంగులో ఉండే కార్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటాయి. ఖరీదైన కార్లలోనూ ఇలాంటి రంగులు చాలా అరుదుగా కనిపిస్తాయి. టార్జాన్‌ సినిమాలో ఉన్న కారు కూడా ఇదే రంగులో ఉంటుంది.

టార్జాన్ సినిమా విడుదలై సుమారు 20 సంవత్సరాలు గడుస్తుంది. దాంతోపాటు సినిమాలోని కారుకు సూపర్‌ పవర్స్‌ ఉంటాయి. ఈ సినిమాలో కారు చేసే విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కారణంగానే క్రికెటర్‌ బాబర్‌ అజాం కారును టార్జాన్‌ సినిమాలోని కారుతో పోలుస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.

pak cricket former captain babar azam new lamborghini car news

బాలీవుడ్ సినిమా కోసం : ప్రముఖ ఆటోమొబైల్ డిజైనర్‌ దిలీప్ ఛబ్రియా ఈ కారును బాలీవుడ్ సినిమా కోసం తయారుచేశారు. అయితే టార్జాన్‌ సినిమాలోని కారు, బాబర్ అజాం కార్లు వేర్వేరు డిజైన్‌లను కలిగి ఉన్నా... ఒకే రంగును కలిగి ఉండడంతో ట్రోలింగ్‌కు గురైయ్యారు.

లంబోర్గిని అవెంటడోర్‌ ఇంజిన్ వివరాలు : లంబోర్గిని అవెంటడోర్‌ 6.5 లీటర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ V12 పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు విక్రయాలను 2022లోనే సంస్థ నిలిపి వేసింది. అయితే నిలిపివేసేందుకు ముందు అనేక ఫేస్‌లిఫ్ట్‌, అప్‌డేట్‌లు సహా లిమిటెడ్‌ ఎడిషన్‌ వాహనాలు విడుదల అయ్యాయి.

pak cricket former captain babar azam gets trolled

లంబోర్గిని అవెంటడోర్‌ కారుతోపాటు ఆడి A5, ఆడి E- ట్రాన్ GT, హ్యుందాయ్ సొనాటా కార్లను కలిగి ఉన్నారు. దీంతోపాటు BAIC BJ40, జీప్ రాంగ్లర్ మరియు మహీంద్రా కారును కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లంబోర్గిని అలెంటడోర్‌ కారు 4 వేరియంట్లు మరియు 7 రంగులో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.01 కోట్ల నుంచి రూ.5.79 కోట్లు ( ఎక్స్‌షోరూం ) గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, November 30, 2023, 11:10 [IST]
English summary
Pak cricket former captain babar azam buys lamborghini aventador
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+