వీడియో షేర్‌ చేసిన క్రికెటర్‌ బాబర్‌ అజామ్.. ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన!!

ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు తాము చేస్తున్న స్టంట్స్‌ లేదా తమకు నచ్చిన బైక్‌, కార్లు డ్రైవింగ్‌కు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తమ అభిమాన నటులు వీడియోలను కొందరు ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని ఘటనలతో సెలబ్రిటీల ఫ్యా్న్స్‌ భయపడుతున్నారు.

పాకిస్థాన్‌ పురుషుల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ తన ట్విట్టర్‌లో ఇటీవల ఓ వీడియోను షేర్‌ చేశారు. పాకిస్థాన్‌ రోడ్లపై ఓ స్పోర్ట్‌బైక్‌పై వెళ్తున్న వీడియోను బాబర్‌ అజామ్‌ పోస్ట్‌ చేశారు. బాబర్‌ నడుపుతున్న బైక్‌ అత్యంత ఖరీదైనది తెలుస్తోంది. ఆ బైక్‌పై అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్నారు.

Pak cricketer babar azam bike riding video

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యత్తుమ ఆటగాళ్లలో బాబర్‌ ముందువరుసలో ఉంటాడు. రానున్న నెలలో పాక్‌కు టోర్నమెంట్లు లేవు. ఈ కారణంగా.. బాబర్‌ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగా తనకు నచ్చిన బైక్‌తో రోడ్లపై షికారు చేసిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

బాబర్‌ ఎంతో ఉత్సాహంగా బైక్‌ రైడ్‌ చేస్తుండగా... వీడియో చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెటర్‌ పోస్ట్‌ చేసిన వీడియోపై స్పందిస్తున్నారు. వచ్చే వరల్డ్‌ కప్‌ వరకు బైక్ రైడ్‌లు చేయవద్దని, ఎటువంటి రిస్త్‌ తీసుకోవచ్దని ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. మీరు చాలా విలువైన వారని బైక్‌ డ్రైవింగ్‌ చేయవద్దని మరో అభిమాని కామెంట్ చేశాడు. వేగంగా బైక్‌ డ్రైవ్‌ చేయొద్దని బాబర్‌కు మరో అభిమాని రీట్వీట్‌ చేశాడు. జాగ్రత్తగా డ్రైవ్‌ చేయాలంటూ మరికొందరు అభిమానులు ట్వీట్లు చేశారు.

గత సంవత్సరం డిసెంబర్‌లో భారత్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. రూ‌ర్కీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా అత్యంత వేగంగా వచ్చిన పంత్ కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీ కొట్టిన అనంతరం అనేకసార్లు బోల్తాపడింది. అనంతరం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గమనించిన కొందరు ట్రక్కు డ్రైవర్లు పంత్‌ను కాపాడారు. స్థానికుల సాయంతో హాస్పిటల్‌లో చేర్పించారు. పంత్‌ జనవరిలో కాలు, మోకాలికి రెండు ఆపరేషన్లు చేయించుకున్నాడు. ప్రస్తుతం పంత్‌ కోలుకుంటున్నాడు. ఇటీవలే చేతి కర్ర సాయం లేకుండా నడుస్తున్న వీడియోను పంత్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ ఆండ్రూ సైమండ్స్‌ రోడ్డు ప్రమాదంలో మరణించారు. సైమండ్స్‌ ప్రయాణించిన కారు నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైంది. ఇలాంటి ఘటనలు కారణంగానే పలువులు సెలబ్రిటీల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అందువల్లనే బాబర్‌ అజామ్ వీడియోపైనా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, May 26, 2023, 18:31 [IST]
English summary
Pak cricketer babar azam shares a bike riding video fans says no more bikes till the world cup
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+