Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కొత్త వీడియో.. చూసారా !
అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా కార్ల దిగ్గజం భారతదేశంలో కూడా రెండవ అతి పెద్ద కార్ల తయారీ సంస్థ గా కీర్తి గడిస్తోంది. హ్యుందాయ్ తన కార్లను మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో కూడా విక్రయిస్తుంది. ఇటీవల పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ యొక్క వీడియో వెలువడింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఇటీవల వెలువడిన వీడియోలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కొత్త హ్యుందాయ్ టక్సన్ కారుని డ్రైవ్ చేస్తూ మరియు కారు గురించి తనకు నచ్చిన అన్ని విషయాలను వివరించాడు.

ఈ వీడియోను షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. షోయబ్ ఒకప్పుడు తన అభిమానుల నుండి సోషల్ మీడియాలో ఏ కారు కొనాలి అనే దాని గురించి సలహాలుకోరారు మరియు వారిలో చాలామంది కొత్త హ్యుందాయ్ టక్సన్ గురించి సూచించారు. ఇది భారతీయ మార్కెట్లో జీప్ కంపాస్ వంటి కార్లతో పోటీపడే ప్రీమియం ఎస్‌యూవీ.
MOST READ:బ్రతుకు తెరువుకోసం కొన్న రిక్షా స్వాధీనం చేసుకున్న అధికారులు.. తర్వాత ఏం జరిగిందంటే ?

అయితే, ఈ కారు హ్యుందాయ్ టక్సన్ యొక్క రివ్యూ యూనిట్ అని ఈ వీడియో చూడటం ద్వారా తెలుసుకోవచ్చు మరియు ఈ వీడియో కారు ప్రమోషన్ కోసం తయారు చేయబడింది. షోయబ్ హ్యుందాయ్ టక్సన్‌తో ఒక రోజు గడుపుతాడు, దీనిలో అతను ఇష్టపడిన అన్ని లక్షణాలతో కారు డ్రైవింగ్ అనుభవం గురించి తెలిపాడు.

కారు యొక్క డిజైన్ తో ప్రారంభించి, వారు దాని ఎక్స్టీరియర్ ప్రీమియం స్టైలింగ్ గురించి మాట్లాడుతారు. ఈ కారు రూపకల్పన మరియు స్టైలింగ్ అతన్ని బాగా ఆకట్టుకుంటాయి. హ్యుందాయ్ టక్సన్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ ఎస్‌యూవీగా అమెరికన్ ఏజెన్సీ ప్రకటించినట్లు షోయబ్ వివరించారు. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్, వైడ్ గ్రిల్ ఉన్నాయని వారు చెప్పారు.
MOST READ:భారత్‌లో ఆడి క్యూ 8 సెలబ్రేషన్ మోడల్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్ సమయంలో తాను ఈ కారుతో ప్రేమలో పడ్డానని షోయబ్ చెప్పాడు. చాలా హ్యుందాయ్ కార్ల మాదిరిగా, టక్సన్ అనేక ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్, వైర్‌లెస్ ఛార్జింగ్, లగ్జరీ క్యాబిన్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి అనేక ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
కారులో తగినంత లెగ్‌రూమ్ ఉందని షోయబ్ వివరించాడు. అతను ఆరు అడుగులు కాబట్టి ఈ కారులో సులభంగా కూర్చోగలడు. హ్యుందాయ్‌లో టక్సన్ ఆల్ సిస్టమ్, హెచ్‌ట్రాక్, క్రూయిస్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ బూట్ స్పేస్ కూడా తనకి బాగా నచ్చింది.
MOST READ:ఆర్టిస్ట్ చేసిన బస్ నమూనాకు KSRTC ఫిదా, తర్వాత ఏం జరిగిందో తెలుసా?

హ్యుందాయ్ టక్సన్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్సన్లతో లభిస్తుంది. పెట్రోల్ ఇంజన్ 152 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది మరియు డీజిల్ యూనిట్ గరిష్టంగా 185 బిహెచ్‌పి శక్తిని అందిస్తుంది. డీజిల్ వెర్షన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభించగా, పెట్రోల్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఏది ఏమైనా ఒక క్రికెటర్ కారు గురించి ఇంతగా ప్రశంసించడం నిజంగా హర్షించదగ్గ విషయమనే చెప్పాలి.