Viral Video విమానంలో విరాళాలు సేకరించిన పాకిస్థాన్‌ ప్రయాణికుడు.. ఎందుకో తెలుసా..?

విమానాలు, రైళ్లకు సంబంధించిన కొన్ని కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో ఇటీవల బాగా వైరల్‌ అవుతున్నాయి. రైళ్లు, మెట్రోల్లో డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు, విమానాల్లో గొడవలు సహా ఇతర వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఓ విమానంలో ఓ ప్రయాణికుడు చేసిన పని ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఎప్పుడు రికార్డు చేశారో తెలియలేదు.

పాకిస్థాన్‌ ఆర్థిక పరిస్థితిలో ఇటీవల అనేక కథనాలు బయటకు వచ్చాయి. ఆర్థిక పరిస్థితులు పూర్తి దిగజారిన ఆ దేశంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న వీడియోలు, వార్తలు చాలా చూశాం. ప్రభుత్వంపై అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహం చేసిన వీడియోలు కూడా చూశాం. అయితే తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి విమానంలో విరాళాలు సేకరించడం ఈ వీడియోలో గమనించవచ్చు.

pakistan flight passenger collects donations

బ్లూ జాకెట్‌, తెలుపు కుర్తా, పైజామా ధరించిన ఓ ప్రయాణికుడు విమానం మధ్యలో నిల్చొని ఓ ప్రకటన చేశాడు. తాము లాహోర్‌లో మదర్సా నిర్మాణం చేపడుతున్నామని, అందుకోసం విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపాడు. ప్రయాణికులు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే, వారు నిల్చోవలసిన అవసరం లేదని, తానే వారి వద్దకు వస్తానని తెలిపాడు. తాను బిక్షాటన చేయడం లేదని, సాయం చేయాలని కోరాడు.

ఈ వీడియోను ప్రయాణికుల్లో ఒకరు రికార్డు చేసి, అప్‌లోడ్‌ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.

pakistan flight passenger collects donations

ప్రయాణికుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్న విమానయాన సంస్థలు.. విమానాల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విమానంలో విరాళాలు సేకరిస్తుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఎయిర్‌పోర్టులో కఠినంగా వ్యవహరించే అధికారులు, విమానాల్లో విరాళాలు అడుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ కొందరు ట్విట్టర్‌ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహుశా పాకిస్థాన్‌లో ఈ ఘటన జరిగి ఉండవచ్చని అందువల్లనే చర్యలు తీసుకోలేదేమో అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్‌లో మదర్సాల కోసం విరాళాలు సేకరించడం తప్పు కాదని ఇస్లామిక్‌ నాయకులు నమ్ముతారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే విరాళాలు అడిగిన వ్యక్తి ఎవరనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన 26 సెకన్ల వీడియో వైరల్‌ అవుతోంది. విరాళాలు అడుగుతున్న సమయంలో విమానం ఇంకా టైక్‌ ఆఫ్‌ కాలేదు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, July 17, 2023, 19:11 [IST]
English summary
Pakistan flight passenger collects donations to construct madarsa video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+