విమాన ప్రమాదం చివరి క్షణాల్లో ప్రత్యేక ఫుటేజ్: విపత్తు తర్వాత సెల్ఫీ !
ఈ మధ్య కాలంలో నేల మీద లాంగ్ డ్రైవింగ్‌లు ఎలా ప్రాచుర్యం పొందుతున్నాయో అలాగే ఆకాశంలో చేసే స్కైడైవింగ్‌లు కూడా ప్రాచుర్య పొందుతున్నాయి. ఇలాగే కొంత మంది స్కైడైవింగ్ అత్యుత్సాహులు వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే కొన్ని అడుగుల ఎత్తు నుండి పంట పొలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. నేల కొరిగే విమానాలు దాదాపుగా పేలిపోతుంటాయి. అయితే అదృష్యవశాత్తు అందరూ ప్రాణాలతో భయటపడ్డారు. దీని గురించి పూర్తి వివరాలు మరియు ప్రమాదం తరువాత తీసుకున్న సెల్ఫీలు....

స్కైడైవింగ్ ఉత్సాహులు సుమారుగా 17 మంది వరకు కాలిఫోర్నియాలోని శాక్రామెంటో నుండి విమానంలో బయలుదేరారు.

సింగల్ ఇంజన్ గల కెస్నా విమానంలో వారు లోడి పారాచూట్ సెంటర్ నుండి ప్రయణాన్ని ప్రారభించారు.

వీరు ప్రయాణాన్ని ప్రారంభించిన కాసేపటికి విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అయితే విమానాన్ని ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేయడానికి వెనక్కి మళ్లారు.

అప్పటికే విమానం ఎత్తు అంతకంతకు తగ్గిపోతూవచ్చింది. చివరికి వారు ప్రయాణిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ద్రాక్ష తోటల్లో కూలిపోయింది.

ఈ విమానంలో ప్రయాణించిన వారిలో ఒక వ్యక్తి గోప్రో అనే కెమెరాను తన హెల్మెట్ ముందు భాగంలో అమర్చుకున్నాడు. తద్వారా విమానంలో జరిగిన సంభాషణలు వెలుగులోకి వచ్చాయి.

మొదటగా విమానంలో సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని ఎయిర్ పోర్ట్‌లో ల్యాండ్ చేయడానికి వెళుతున్నట్లు పైలట్ ప్రకటించాడు.

అందులో ప్రయాణిస్తున్నారు అందరూ రక్షించండి రక్షించండి అంటూ హాహాకారాలు చేయడం మొదలు పెట్టారు. విమానం కూలిపోవడానికి ముందే క్రిందకు దూకడానికి కూడా కొందరు ప్రయాణించారు.

విమానంలో ఎటువంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోలేదు అని అందులో ప్రయాణిస్తున్న వారికి వివరణ ఇచ్చాడు. చివరగా అక్కడ ఉన్న ద్రాక్ష తోటల్లో వెల్లకిలా పడి కూలిపోయింది.

స్కైడైవింగ్ చేస్తున్న అందరు కూడా సురక్షితంగా ప్రాణాలతో భయటపడ్డారు. కూలిపోయిన విమానంతో స్వీయ చిత్రాలు (సెల్ఫీలు) తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

మోడీ విమాన ప్రయాణం, మరియు ఎవరికి తెలియని ఆసక్తికర నిజాలు


Click it and Unblock the Notifications








