10 ఏళ్లలోపు పిల్లలను ముందు సీట్లో కూర్చోబెడుతున్నారా? తాట తీస్తున్నఅక్కడి ప్రభుత్వం

ప్రస్తుతం కుటుంబ ప్రయాణాలు ఎక్కువ అయ్యాయి. కారుతో భార్య, పిల్లలతో కలిసి సరదాగా బయటకు వెళ్లి తిరిగి రావడం లాంటి వాటిని చాలా మంది చేస్తున్నారు. అయితే ఇలా వెళ్తున్న పిల్లలను కొంతమంది ముందు సీట్లో కూర్చోబెడుతుంటారు. అలాగే వారిని పాఠశాలలకు తీసుకెళ్లేటప్పుడు కూడా తమ పక్కనే ముందు సీట్లో కూర్చోబెడతారు. అయితే ఇలా చేయడం ప్రమాదకరం అని చాలా మందికి తెలియదు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ముందు సీట్లో కూర్చోబెట్టవద్దని ఇటీవల శాస్త్రీయ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. చంటి బిడ్డలతో కలిసి ప్రయాణించే వారు వెనుక సీట్లోనే కూర్చోవడం ఉత్తమం. వీటికి సంబంధించిన నియమాలు కూడా ఉన్నాయి. తాజాగా UAE ప్రభుత్వం 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను తమ ఒడిలో పెట్టుకుని ప్రయాణించే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఇటీవల కాలంలో నిబంధనలు అతిక్రమించి ముందు సీట్లో పిల్లలతో ప్రయాణించిన వారిపై, అలాగే, దీనికి సంబంధించిన గతంలో జరిగిన ఉల్లంఘనలపై చర్యలకు ఉపక్రమించింది. పిల్లలు వాహనాల్లో ముందు సీట్లో కూర్చోవడానికి సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు తల్లిదండ్రులకు 400 దిర్హామ్‌ల జరిమానా విధించనుంది. అలాగే ఇదే సమయంలో అవగాహన సైతం కల్పించనుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలకు సీటు బెల్ట్ పెట్టడం సరైన విధానం కాదని చట్టం పేర్కొంటుంది.

Uae Parents To Be Fined For Seating Children

ఈ వయస్సు పిల్లలకు ప్రత్యేక చైల్డ్ సీటును ఉపయోగించాలని UAE ప్రభుత్వం చెబుతుంది. ఏదైనా ప్రమాద సమయంలో పిల్లలు ముందు సీట్లలో ఉన్నప్పుడు సీటు బెల్ట్ తాకిడికి ఊపిరాడక చనిపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకునే వేగం చాలా ఎక్కువగా(200-300 km/h వరకు) ఉంటుంది. చిన్న పిల్లల శరీరం పెద్దల కన్నా సున్నితంగా ఉండటంతో ఎయిర్‌బ్యాగ్ కారణంగా తీవ్ర గాయాలు లేదా ప్రాణాపాయం కలగవచ్చు.

పెద్దల కోసం డిజైన్ చేసిన సీటు బెల్ట్‌లు చిన్న పిల్లలకు సరిగ్గా ఉండవు. అలాగే, యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలు విండ్షీల్డ్ గ్లాస్‌కి తగిలి తీవ్ర గాయాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ముందు భాగంలో పిల్లలు కూర్చుంటే బ్రేకింగ్ సమయాల్లో వేగంగా ముందుకు పడిపోవచ్చు. పిల్లల కోసం ప్రత్యేక చైల్డ్ సీటును ఉపయోగించడం ద్వారా వారికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవచ్చు. కార్లలో ISOFIX సీట్లు ఉండేలా చూడాలి.

Children Sitting in Front

ఇండియాలో 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లోని సెక్షన్ 125(1) A ప్రకారం, ఏడు సీట్లకు మించని వాహనాలలో డ్రైవర్, ముందు సీట్లో కూర్చున్న వారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలి. కానీ ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే పిల్లలకు సురక్షితమైన సీటు అందించడంపై స్పష్టంగా ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో తమ వాహనాల్లో పిల్లల కోసం సీట్లను ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి అవగాహన కల్పించడం అవసరం.

కొత్తగా కారు కొనేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పెద్దలకు, పిల్లలు ఇద్దరికీ సురక్షితంగా ఉండే కారును ఎంచుకోవడం ఉత్తమం. ప్రస్తుతం తయారీ సంస్థలు కూడా పిల్లల భద్రతకు సంబంధించి SOFIX యాంకర్లు, చైల్డ్ డోర్ లాక్‌లు, విండో లాక్‌లు, వెనుక సీట్ బెల్ట్ రిమైండర్‌లు మొదలగు సేఫ్టీ ప్రమాణాలను అందిస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, March 14, 2025, 17:05 [IST]
English summary
Parents who place children under 10 years old in front seats will be fined the uae
Read more on: #offbeat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+