దేశం గర్వించేలా చేసిన మను బాకర్ గురించి ఆ విషయం ఎవ్వరికీ తెలియదు!
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలపింక్స్ (Olympics) అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా పోటీలను చూసేందుకు జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోటీల్లో ఇండియా ఎక్కువ పతకాలు సాధించి దేశ కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని 140 కోట్ల ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలు పతకాల్లో దూసుకెళ్తున్నాయి. ఈ ఒలంపిక్స్‌లో భారత్ కూడా పతకాల ఖాతాను తెరిచింది. యువ షూటర్ మను బాకర్ (Manu Bhakar) భారత్ తరఫున ఒలంపిక్‌లో శుభారంభం చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య (Bronze) పతకం సాధించింది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను బాకర్ రికార్డు సృష్టించింది.
హర్యానాకు చెందిన మను బాకర్ ఒలంపిక్స్‌లో పతకం సాధించడంపై వివిధ వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, షూటర్ అభినవ్ బింద్రా, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ ప్రముఖులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అభినవ్ బింద్రా, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, విజయ్ కుమార్, గగన్ నారంగ్ తర్వాత షూటింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించిన ఐదో షూటర్‌గా మను బాకర్ నిలిచింది.

2022 ఆసియా గేమ్స్‌లో మను భాకర్ 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించింది. గత ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోనూ బంగారు పతకం సాధించింది. భారత్‌లో ఇతర క్రీడలకు క్రికెట్, కబడ్డీ ఉన్నంత ఆదరణ మరే క్రీడలకు లేదన్నిది సత్యం. అయితే ప్రస్తుతం ఒలింపిక్స్‌లో మనుబాకర్ గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు. మనుబాకర్‌కి వాహనాలంటే ఇష్టమా లేదో ఈ కథనంలో తెలుసుకుందాం..
22 ఏళ్ల మను బాకర్ అందరి లాగానే యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీని సెర్చ్ చేసినప్పుడు గత కొన్నేళ్లుగా ఆమె పంచుకున్న పోస్ట్‌ల్లో కార్లకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలు లేవు. మను బాకర్ ప్రధానంగా షూటింగ్, ఫిజికల్ ట్రైనింగ్, టూర్లకు సంబంధించిన పోస్టులను షేర్ చేసింది.

అయితే, ఒక ఫోటోలో మాత్రమే మను కారు పక్కన నిలబడి ఉంది. అది మను బాకర్ ఉపయోగించిన కారు కావచ్చని మేము భావిస్తున్నాము. దాని పేరే ఎంజీ గ్లోస్టర్. ఇది ఫుల్‌సైజ్ ఎస్‌యూవీ మోడల్‌గా ప్రఖ్యాతి గాంచింది. ఎంజి గ్లోస్టర్ ఇండియన్ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి పోటీ ఇస్తుంది.
ప్రస్తుతం ఎంజీ గ్లోస్టర్ ఎస్‌యూవీ ధర రూ.38.80 లక్షలుగా ఉంది. అదే సమయంలో, ఈ కారు టాప్ వేరియంట్ ధర రూ .43.87 లక్షలుగా ఉంది. ఇవి అన్ని ఎక్స్ షోరూమ్ ధరలు. అయితే మాకున్న సమాచారం ప్రకారం మను బాకర్‌కి కార్లపై అంతగా ఆసక్తి లేదని తెలుస్తోంది కానీ త్వరలోనే మను ఇంటి ముఖద్వారం కార్లతో నిండిపోతుందని ఆశిస్తున్నాం.
ఎందుకంటే ఒలింపిక్స్ వంటి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన వారికి కార్లు బహుమతిగా ఇవ్వడం చాలా ప్రముఖ కంపెనీలకు అలవాటుగా ఉంది. ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ మహీంద్రా ఇందుకు ఉదాహరణ. అందువల్ల, మహీంద్రా లేదా ఇతర కంపెనీలు మనుకు కారును బహుమతిగా ఇచ్చే అవకాశం ఉంది. చాలా సందర్భాల్లో మహీంద్రా క్రీడాకారులకు కార్లను గిఫ్ట్‌గా అందించింది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








