పెట్రోల్, డీజీల్ కార్లు రోడ్లపైకి రావొద్దు.. అక్కడ రేపటి నుంచే కఠిన రూల్స్ అమలు చేసే అవకాశం!
దేశంలో రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్య రెట్టింపు అవుతోంది. జనాలు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బదులుగా సొంత వాహనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న వెహికిల్స్‌లో 80 శాతం వరకు సాంప్రదాయ పెట్రోల్, డీజీల్ వెహికిల్స్ మాత్రమే ఉన్నాయి. వీటి నుంచి విడుదలయ్యే ఉద్గారాల వల్ల వాయు కాలుష్యం వేగంగా పెరుగుతోంది. ఈ సమస్య దేశవ్యాప్తంగా రోజురోజుకి ఎక్కువవుతోంది. పరిశ్రమలు, నిర్మాణ పనుల నుంచి వెలువడుతున్న కాలుష్యం కూడా ఇందుకు కారణం అవుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి కాలుష్యం వెలువడుతోంది. అందుకే రోడ్లపై పెట్రోల్, డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో అక్కడ సరిబేసి విధానం సైతం అమలు చేస్తున్నారు. అయినా కానీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పెట్రోల్, డీజిల్ వాహనాల పార్కింగ్ ఛార్జీలను సైతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫీజుని రెండు రెట్లు పెంచే అవకాశం ఉంది. పార్కింగ్ ఛార్జీలు పెంచడం వల్ల వాయు కాలుష్య సమస్య ఎలా తగ్గే అవకాశం ఉంటుందని ఢిల్లీ సర్కార్ భావిస్తోంది.

దీనిపై ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. పార్కింగ్ ఫీజు పెంచితే ప్రభుత్వ వాహనాల వినియోగం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్ ఫీజుని భారీగా పెంచడం వల్ల బస్సు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణాను జనాలు వినియోగించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చర్య వల్ల రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి వాయు కాలుష్యం అదుపులోకి రానుంది.
అయితే ప్రజలు పార్కింగ్ ఫీజుల పెంపు అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరమైన ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా ప్రజలు వివిధ శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

అందుకే రాజధాని ఢిల్లీలో వాహనాల పార్కింగ్ ఛార్జీలను పెంచి రూల్స్‌ని మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వ అధికారులు సైతం భావిస్తున్నారు. ఢిల్లీలో మొత్తం 400 ప్రాంతాల్లో పార్కింగ్ ఛార్జీలను పెంచాలని అధికారులు ఇప్పటికే ప్రాంతాలను ఫైనలైజ్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కి చేరుకున్న ఈ ప్రతిపాదన చివరి దశలో ఉంది.
దీనికి సంబంధించిన నివేదిక నవంబర్ 14న రానుంది. దీనికి ఆమోదం లభిస్తే వీలైనంత త్వరగా దీనిని అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఢిల్లీ ప్రజలు వాహనాల పార్కింగ్ కోసం అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ రూల్స్ అమల్లోకి వస్తే ప్రజలు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించడంలో ఎటువంటి సందేహం లేదు. వాహనాల రాకపోకలు తగ్గడం వల్ల వాయుకాలుష్యం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: ఈ రూల్స్‌ని ప్రజలు ఏ మేరకు పాటిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారనుంది. ప్రభుత్వం అమలు చేయనున్న చర్యల వల్ల దేశ రాజధాని ప్రజలకే లబ్ది చేకూరనుంది. ఎక్కువ మంది ప్రజా రవాణా వాహనాలకు మారితేనే మార్పు వస్తుంది. ఒకవేళ రూల్స్‌ని పాటించకుంటే ప్రభుత్వ అమలు చేయనున్న కచ్చితమైన నిర్ణయాల వల్ల ప్రజలపై అదనపు భారం పడటం గ్యారంటీ.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








