పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

భారతదేశంలో కొత్త వాహనాలకు డిమాండ్‌ను పెంచడానికి ప్రభుత్వం పాత వాహనాలను స్క్రాప్ చేసిన వాహన యజమానులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ మేరకు భారత ప్రభుత్వం అమలు చేస్తున్న స్క్రాపేజ్ విధానానికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసింది. ఇటీవలి 'ఆటోమొబైల్ రంగంలో తిరోగమనం' అనే నివేదికలో భాగంగా ఈ సూచనలు వచ్చాయి.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

ప్రస్తుతం, ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమోటివ్ మార్కెట్లలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. మన దేశంలో ఆటోమొబైల్స్ అమ్మకాలు అనేక అభివృద్ధి చెందిన దేశాల కంటే ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ, అభివృద్ధి చెందిన ఆటోమోటివ్ మార్కెట్‌ల నుండి భారతదేశాన్ని వేరు చేసే విషయం ఒకటుంది. అదేంటంటే, భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాహన స్క్రాపేజ్ విధానం.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

భారతదేశంలో చాలా వరకు వాహనాలు ఎప్పుడూ స్క్రాప్ చేయబడవు. అవి పూర్తిగా శిధిలావస్థకుని, డ్రైవింగ్‌కు పనికిరాని దశలో ఉన్నప్పుడు మాత్రమే స్క్రాప్‌యార్డ్‌కు వెళ్తాయి. ఫలితంగా, చాలా పాత కార్లు ఇప్పటికీ మన దేశ రోడ్లపై తిరిగుతూ కనిపిస్తుంటాయి. ఇలాంటి వాహనాలలో చాలా వరకు పాత వాహనాలు విపరీతమైన వాయు కాలుష్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో, భారత రోడ్లపై కాలుష్యాన్ని కలిగించే మరియు ప్రమాదకరమైన పాత వాహనాలను క్రమంగా తొలగించేందుకు 2021లో భారత ప్రభుత్వం పాత వాహనాల రద్దుకు సంబంధించి కొన్ని నిబంధనలను అమలులోకి తెచ్చింది.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

ఒకప్పుడు క్రమబద్ధీకరించబడని స్క్రాపింగ్ రంగం చివరకు నియంత్రించబడే మార్గంలోకి వచ్చింది మరియు దేశవ్యాప్తంగా ఆటోమోటివ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (AVSF) యూనిట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ఇది నిజంగా భారత ప్రభుత్వం తీసుకున్న ఓ అద్భుతమైన చర్యగా చెప్పవచ్చు. అయితే, ఈ కేంద్రాలకు వెళ్లడానికి మరియు వారి పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి ప్రజలను ప్రోత్సహించడానికి కొన్ని రకాల ప్రోత్సాహకాలు తప్పనిసరిగా ఉండాలి.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

ఇదే విషయాన్ని స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ మొత్తం స్క్రాపింగ్ ప్రక్రియ కేవలం మన రోడ్లపై పాత కాలుష్యాన్ని తొలగించడానికి మాత్రమే కాదు, కొత్త వాహనాల అమ్మకాలను పెంచడం కూడా. ఇక్కడే ఆర్థిక ప్రోత్సాహకాలు కీలక పాత్ర పోషిస్తాయి. నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీలో 'ముందస్తు ఆర్థిక ప్రోత్సాహకాల' కోసం ప్రభుత్వం నిబంధనలను రూపొందించాలని పరిశ్రమలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

ఈ పాలసీలో చేర్చబడిన ఆర్థిక ప్రోత్సాహకాలు స్క్రాప్‌యార్డ్‌లు మరియు కొత్త వాహన డీలర్‌షిప్‌లకు కొంత మొత్తం లేదా ఆర్థిక ప్రోత్సాహకాల శాతాన్ని అందించడం తప్పనిసరి చేస్తుంది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాలు కొత్త కారు కొనుగోలుకు అనుసంధానించబడి ఉంటాయి మరియు అందువల్ల భారతదేశంలో కొత్త కార్ల కోసం డిమాండ్‌ భారీగా పెరుగుతుంది. ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడంతో పాటు, ఆటోమోటివ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (AVSF) యూనిట్ల ఎంపికపై మరింత పారదర్శకత ఉండాలని కూడా ఈ స్టాండింగ్ కమిటీ సూచించింది.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

ఇలాంటి స్క్రాపింగ్ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే నిర్దేశించిన పారామితులను ఈ కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలి. స్క్రాపేజ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటుగా, ప్రజలు తమ పాత వాహనాలను ఎక్కువ కాలం కలిగి ఉండేందుకు నిబంధనలను కూడా ప్రభుత్వం మరింత కష్టతరం చేసింది. ఇందులో భాగంగా, రీ-రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ పరీక్షలు, ఫిట్‌నెస్ సర్టిఫికేషన్ మొదలైన వాటి ధరలు గణనీయంగా పెరిగాయి.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

కాబట్టి, ఎవరైనా కూడా కాలం చెల్లిన పాత వాహనాలను తమ స్వాధీనంలో కలిగి ఉండాలనేకుంటే, వారు సాధారణం కన్నా ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా, వాటి నిర్వహణ కూడా పెరుగుతుంది. పాత వాహనాల పట్ల ఆసక్తి ఉన్న వారు మరియు వాటిని భరించగలిగే ఆర్థిక శక్తి ఉన్న వారు మాత్రమే వాటిని నిర్వహించగలరు. ఇలా చేయలేని వారు (పాత వాహనాలను వినియోగిస్తున్న వారు) ఎప్పుడో ఒకప్పుడు వాటిని వదులుకోవాల్సి వస్తుంది.

పాత వాహనాలను స్క్రాప్ చేసిన వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు.. కొత్త వాహనాలకు భారీగా పెరుగుతున్న డిమాండ్!

మదేశంలో ఏదైనా కొత్త విధానం లేదా కొత్త టెక్నాలజీని ప్రజలు వేగంగా స్వీకరించాలంటే, అందుకు తగిన ప్రోత్సాహకాలను అందించడం చాలా అవసరం. ఉదాహరణకు, ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకుంటే, ప్రభుత్వం ప్రోత్సాహకాలు మరియు రాయితీలు అందించిన తర్వాతనే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరిగాయి. వెహికల్ స్క్రాపింగ్ విషయంలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన అసరం ఉంది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాలు అమలులోకి వచ్చినప్పుడే వాహనాల స్క్రాప్ మరియు కొత్త వాహనాల కొనుగోలు పెరుగుతుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 17, 2022, 10:14 [IST]
English summary
Parliamentary panel suggests govt that financial incentives for scrapping of old vehicles in india will increase demand for new vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+