జనవరి 12 నుంచి ముంబైలో పార్క్స్ సూపర్ కార్ షో

By Ravi

భారతదేశంలోని ఏకైక లగ్జరీ, స్పోర్ట్స్, సూపర్ కార్ పెరేడ్ 'పార్క్స్ సూపర్ కార్ షో'లో 2014వ ఎడిషన్‌కు ముహుర్తం ఖరారైంది. ఈనెల 12వ తేది నుంచి దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఈ షో జరగనుంది. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమంలో అత్యంత విలాసవంతమైన మరియు అరుదైన కార్లను తిలకించే ఆస్కారం ఉంది.

ఎగ్జోటిక్ కార్ల యజమానులందరూ ముంబై నగర వీధులపైకి తమ సూపర్ కార్లతో వచ్చి సందడి చేయనున్నారు. ఇప్పటి వరకు వరుసగా ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న పార్క్స్ సూపర్ కార్ షో, ఇప్పుడు ఆరవ సీజన్‌లోకి ప్రవేశించింది. కాగా.. ఈ 6వ ఎడిషన్ పార్క్స్ సూపర్ కార్ షో ఎప్పటి మాదిరిగానే ముంబైలో జరగనుంది.

జనవరి 12, 2014వ తేది నుంచి ఈ షో ప్రారంభమవుతుంది. ఈ షోలో ఆడి, మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, లాంబోర్గినీ, ఆస్టన్ మార్టిన్, పోర్షే, ఫెరారీ, బెంట్లీ, రోల్స్ రాయిస్ వంటి అనేక విలావంతమైన మరియు విశిష్టమైన కార్లను ఈ షోలో తిలకించవచ్చు.

పార్క్స్ సూపర్ కార్ షో

గడచిన సంవత్సరం జరిగిన పార్క్స్ సూపర్ కార్ షోలో వై2కె టర్బైన్ పవర్డ్ సూపర్‌బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ఈ భూగ్రహంపై ఉన్న అత్యంత వేగవంతమైన మోటార్‌సైకిళ్లలో ఒకటి. ఈ ఏడాది జరగనున్న షోలో అమెరికన్ హాట్ రాడ్, రెబెల్ వంటి మోడళ్లను తొలిసారిగా ఇండియాలో చూసే అవకాశం ఉంటుంది.

పార్క్స్ సూపర్ కార్ షో

2014 పార్క్స్ సూపర్ కార్ షో పెరేడ్ జనవరి 12, 2014వ తేది ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. నరిమన్ పాయింట్‌లోని విధాన్ భవన్ పార్కింగ్ లాట్ వద్ద ప్రారంభమయ్యే ఈ పెరేడ్ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బికెసి) జంక్షన్ వరకు చేరుకొని, తిరిగి స్టార్టింగ్ పాయింట్‌కు వస్తుంది.

పార్క్స్ సూపర్ కార్ షో

వివిధ రకాల సూపర్ కార్లంటినీ ఒక్క చోటకు చేర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని, ఈ ఏడాది జరగనున్న పార్క్స్ సూపర్ కార్ షోలో ప్రపంచంలో కెల్లా అత్యుత్తమ సూపర్ కార్లను చూడబోనున్నామని సూపర్ క్లబ్ ఫౌండింగ్ చైర్మన్ గౌతమ్ సింఘానియా వెల్లడించారు.

పార్క్స్ సూపర్ కార్ షో

పార్క్స్ సూపర్ కార్ షో రూట్ మ్యాప్..

Vidhan Bhavan Parking Lot - Nariman Point - Marine Drive - Walkeshwar - Malabar Hill - Kamla Nehru Park - Kemps Corner - Breach Candy - Haji Ali - Worli Sea Face - Worli Sea Link - BKC Junction (U Turn) - Worli Sea Link - Worli Sea Face - Haji Ali - Peddar Road - Marine Drive - Nariman Point.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2014, 12:14 [IST]
English summary
Parx Super Car Show, the only one of its kind luxury, sports and supercar parade in India, is an annual event during which owners gather together to drive their exocitic machines through the streets of Mumbai. Making for quite a spectacle to watch, the Parx Super Car Show is now in its sixth year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+