వందే భారత్‌లో ప్రయాణం చేయాలనుకున్నా.. కానీ ఇలాంటి రైలు ప్రయాణం చేస్తా అనుకోలేదు
వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాక.. అందులో ఉన్న సౌకర్యాలు సహా వేగం కారణంగా అనేక మంది ప్రజలకు ఈ రైళ్లలో ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి వందే భారత్‌లో ప్రయాణం చేసేందుకు చాలా రోజులుగా ఎదురుచూశాడు. అందుకోసం టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే అనంతరం జరిగిన పరిణామాలు అతన్ని ఖంగుతినేలా చేశాయి.
ఈ విషయాన్ని స్వయంగా ప్రయాణికుడు పాండే ట్వీట్ చేశాడు. ట్వీట్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రధాన మంత్రి కార్యాలయం, ఐఆర్‌సీటీసీకి ట్యాగ్ చేశాడు. రైల్లోని పరిస్థితులను ఫోటోలు, వీడియోలు తీసి ట్వీట్‌కు జత చేశాడు. అయితే రైల్వే నుంచి సమాధానం వచ్చినట్లు తెలుస్తోంది.

వందే భారత్‌లో తొలిసారిగా ప్రయాణం చేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశానని.. కానీ అదే పేరుతో ఉన్న మరో రైలు ట్రాక్ మీదకు రావడంతో షాక్‌కు గురయ్యానని ట్వీట్‌లో పేర్కొన్నాడు. వాష్‌రూంలు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, రైలు నిర్వహణ దారుణంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశాడు. వందే భారత్ రైలు ధరనే వసూలు చేసి, ఇలాంటి రైలును ఏర్పాటుచేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జూన్ 10 వందే భారత్ రైలులో ప్రయాణించాల్సి ఉందని పాండే తన ట్వీట్‌లో తెలిపాడు. న్యూఢిల్లీ నుంచి శ్రీ మాత వైష్ణో దేవీ మధ్య రైలు నడిచినట్లు చెప్పారు. అదే సమయానికి వందే భారత్ రైలుకు బదులుగా తేజస్ ఎక్స్‌ప్రెస్ పట్టాలపైకి వచ్చినట్లు చెప్పారు. ఆ ట్వీట్‌పై చాలా మంది స్పందించారు.
రైళ్లో కొందరు ప్రయాణికులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. వేపర్లను టాయిలెట్‌లో పడేస్తున్నారని, అందువల్ల నీరంతా స్టాక్ అయిపోతుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. టెక్నికల్ లేదా నిర్వహణ సమస్యల కారణంతో వందే భారత్ కోచ్‌లకు బదులుగా తేజస్ కోచ్‌లను అప్పుడప్పుడూ వినియోగిస్తున్నారని మరో ట్విట్టర్ యూజర్ స్పందించారు.

రైలు లోపలి భాగం చూస్తుంటే వందే భారత్ మాదిరిగా లేదని.. పాండే ట్వీట్‌పై ఓ యూజర్ కామెంట్ చేశారు. దానిపై పాండే స్పందించారు. తాము వందే భారత్ రైలు టికెట్ బుక్ చేసుకున్నామని, అందుకు బదులుగా తేజస్ రైలును ఏర్పాటుచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైల్వేలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, హమ్‌సఫర్ రైలు విషయంలోనూ ఇలానే వ్యవహరిస్తున్నారని ఓ యూజర్ కామెంట్ చేశారు. హమ్‌సఫర్ 3AC ఛార్జీలను వసూలు చేస్తున్నారని, కానీ సాధారణ LHB 3AC బోగీలను అందుబాటులో ఉంచుతున్నారని చెప్పారు. ఇదో పెద్ద కుంభకోణమని, ఎవరూ దీనిపై మాట్లాడడం లేదని ఓ ట్విట్టర్ యాజర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పాండే ట్వీట్‌పై Railway seva ట్విట్టర్ హ్యాండిల్ సిబ్బంది స్పందించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎదుర్కొ్న్న సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకొనేందుకు వీలుగా ఫిర్యాదును సంబంధిత అధికారులకు నివేదిస్తామని రైల్వే సిబ్బంది స్పష్టం చేశారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








