విమానం టేకాఫ్ అవుతుండగా డోర్ తెరిచేందుకు యువకుడి యత్నం.. అంతలోనే!!
ఇటీవల విమానాల్లో కొందరి అత్యుత్సాహ ప్రవర్తన వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టేకాఫ్ అవుతున్న విమానం తలుపు తెరిచేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించగా తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
విమానాల్లో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న ఘటనలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కొంతమంది ప్రయాణీకుల ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమానయాన సంస్థలు ట్రోల్ అవుతున్నాయి. క్రొయేషియాలోని జాదర్ నుంచి లండన్‌కి వెళ్లే ర్యాన్ ఎయిర్ విమానంలో ఓ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు.

ఇటీవల పాగ్ ద్వీపంలో జరిగిన హైడ్‌అవుట్ క్రొయేషియా మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ప్రయాణికులు లండన్‌కి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో యూకేకి చెందిన యువకుడు తోటి ప్రయాణికులను గందరగోళానికి గురిచేశాడు. సన్‌గ్లాసెస్‌ను విసిరేసి విమానం తలుపు తెరవాలని సిబ్బందితో గట్టిగా అరిచాడు. అతను తలుపు వైపు వెళ్ళే ముందు ఇతర ప్రయాణీకుల వైపు విచిత్రంగా సైగలు చేశాడు. తలుపు తెరవండి అని పదే పదే అరిచాడు.
ఘటన జరిగినప్పుడు విమానం రన్‌వేపై కదులుతూ లండన్‌కు బయలుదేరేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా యువకుడు ఇతర ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడున్న మహిళా సిబ్బందిని దాటుకుని మరీ తలుపు తెరిచేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఇద్దరు ప్రయాణికులు వారి సీట్ల నుంచి లేచి అతని ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియోను ఓ ప్రయాణికుడు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు.
ఇటీవల విస్తారా విమానంలో తన కూతురిని తాకినట్లు ఆరోపిస్తూ ఓ తండ్రి కూతురిని కొట్టేందుకు ప్రయత్నించిన వీడియో వైరల్‌గా మారింది. తల్లిదండ్రులు విమానంలో కుడివైపు కూర్చోగా, కూతురు ఎడమవైపు సీటులో కూర్చుంది. ఆమె పక్కనే మరో యువకుడు కూర్చున్నాడు. అయితే వీడియోలో అసలేం జరిగిందనే సమాచారం లేదు. అయితే తన కూతురిని యువకుడు తాకాడని ఆరోపిస్తూ తండ్రి అతనితో గొడవపడ్డాడు.
ఇటీవల సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వ్యక్తి ఓ చిన్నారి ఏడుపుతోతో సహనం కోల్పోయిన తీరు చూసి పలువురిని షాక్‌కు గురిచేసింది. విమానంలో చిన్నారి ఏడుపును చూసిన కోపోద్రిక్తుడైన వ్యక్తి విమాన సిబ్బందితో ఘర్షణకు పాల్పడ్డాడు. ఈ ఘటనల పట్ల నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
అంతే కాకుండా తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఘటన సైతం జుగుప్సను కలిగించింది. ఓ వ్యక్తి విమానం ఎక్కిన తర్వాత తన సీటును దాటుకుని వెళ్లి ఫ్లోర్‌పై ఉమ్మి వేసి అనంతరం మల, మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఇతర ప్రయాణికులు అవాక్కయ్యారు. వెంటనే సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ సంఘటనలు ప్రయాణీకుల ప్రవర్తన, విమానాల్లో భద్రతా చర్యల ఆవశ్యకత గురించి ఆందోళనలను లేవనెత్తిన మాట వాస్తవమే. ఒకప్పుడు ధనవంతుల కోసం రిజర్వ్ చేయబడిన విమానాలు ఇప్పుడు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. అందుకే ప్రయాణికులకు బస్సుకు, విమానానికి తేడా తెలియదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








