ఫ్లైట్‌లో రచ్చ చేసిన ప్రయాణికుడు.. ఫ్లోర్‌పై ఉమ్మి వేసి మల, మూత్ర విసర్జన..
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్న ఎయిరిండియాలో మరో ఘటన చేసుకుంది. ఈ సంస్థకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు ఫ్లోర్‌పైనే మల, మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఢిల్లీ ఎయిరిండియా విమానంలో మరో ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 24న ముంబయి - ఢిల్లీ ఎయిరిండియా విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో వంటమనిషిగా చేస్తున్న ఓ వ్యక్తి ఈ నెల 24 న ముంబయి నుంచి డిల్లీ వెళ్లిన ఎయిర్ ఇండియా ఏఐసీ 866 విమానంలో ప్రయాణించాడు.

ఈ క్రమంలో 17ఎఫ్ సీట్లో కూర్చున్న ప్రయాణికుడు.. తొమ్మిదో వరుస వద్దకు వెళ్లి ఫ్లోర్‌పై ఉమ్మివేశాడు. అనంతరం మల, మూత్ర విసర్జన చేశాడు. అతడి అసభ్య ప్రవర్తనతో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అతని చేష్టలను గమనించిన క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుడిని మౌఖికంగా హెచ్చరించారు. అనంతరం ఇతర ప్రయాణికులకు దూరంగా అతడిని క్యాబిన్ సిబ్బంది ఐసోలేట్ చేసింది.
ఘటన అనంతరం పైలట్ ఇన్ కమాండ్‌కు సమాచారమందించినట్లు సిబ్బంది తెలిపారు. సమాచారమందుకున్న పైలట్ వెంటనే సంస్థ ఉన్నతాధికారులకు సందేశం పంపించారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఎయిరిండియా భద్రతా సిబ్బంది ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఫ్లైట్ కెప్టెన్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు.. IGI పోలీస్ స్టేషన్‌లో ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరిచినట్లు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసిందని తదుపరి విచారణ జరుగుతోందని వెల్లడించారు. అయితే, అతడు మద్యం మత్తులో ఇలా అనుచితంగా ప్రవర్తించాడా... లేదా అన్నది తెలియరాలేదు.
ఈ ఘటనపై ఎయిరిండియా ఓ ప్రకటన విడుదల చేసింది. ముంబయి - ఢిల్లీ విమానంలో ఓ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించి తోటి ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడని పేర్కొంది. ఈ ఘటన తర్వాత విమానంలో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు తమ సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణికుడిని ఐసోలేట్ చేశారని ఎయిరిండియా వివరించింది.
విమానం ల్యాండ్ అవ్వగానే సదరు వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పగించారని.. పోలీసులు కేసు కూడా నమోదు చేశారని వివరించింది. ఇలాంటి వికృత, అభ్యంతరకర ప్రవర్తనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. పోలీసుల దర్యాప్తునకు తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది.
గతేడాది కూడా న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న మత్తులో ఉన్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి, సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సంఘటన పట్ల తీవ్ర ఆందోళన రేకెత్తింది. ప్రయాణికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై అటు డీజీసీఏ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిరిండియాకు జరిమానా విధించింది. ఆ తర్వాత కూడా పలు ఘటనలు వార్తల్లోకెక్కాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








