పొగమంచు ఎఫెక్ట్‌.. ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే ప్రయాణికుల భోజనాలు.. ఇండిగోకు భారీ జరిమానా

దేశవ్యాప్తంగా పొగ మంచు సమస్య తీవ్రతరం అవుతోంది. పొగమంచు కారణంగా వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మంచు ఎక్కువగా ఉండటంతో పలు విమానాల రాకపోకలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఈ క్రమంలో ముంబయి ఎయిర్‌పోర్టు(Passengers Eating On Airport Apron)లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తద్వారా ఇండిగో భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం రోజురోజుకీ ఎక్కువవుతోంది. తద్వారా తెలంగాణలోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport)లో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లాల్లిన ప్రయాణాలు నిర్ణీత సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుంటున్నా.. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేస్తున్నాయి.

Fine-To-Indigo-Airlines

షెడ్యూల్‌ ప్రకారం బయల్దేరాల్సిన విమానాలు సడెన్‌గా రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం నుంచి మంగళవారం వరకూ దాదాపు 40 విమాన సర్వీసులు రద్దు అయినట్లు సమాచారం. ఈ మేరకు ఇండిగో సంస్థ వివరాలు ప్రకటించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు.. విమానాలు రద్దు కావడంతో ఇబ్బందులు పడ్డారు.

కాగా ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల్లో పొగ మంచు ప్రభావంతో మరిన్ని సర్వీసులు కూడా రద్దయ్యే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ముంబయి ఎయిర్‌పోర్టు(Mumbai Airport Viral Video)లో చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫ్లైట్‌ ఆలస్యం కావడంతో ఎయిర్‌పోర్టులో నేలపైనే ప్రయాణికులు భోజనం చేసుకున్న సంఘటన జరిగింది. ఇందుకు గాను ఇండిగో సంస్థకు డీజీసీఏ, బీసీఏఎస్‌ రూ. 1.5 కోట్ల జరిమానా విధించాయి.

Fine-To-Indigo-Airlines

ఇండిగో సంస్థ(Fine To Indigo)తో పాటు ముంబయి ఎయిర్‌పోర్టుకు కూడా రూ. 90 లక్షలు జరిమానా విధించాయి. ఇండిగో, ముంబయి ఎయిర్‌పోర్టుకు DGCA(Directorate General Of Civil Aviation) రూ. 30 లక్షల చొప్పున జరిమానా విధించగా, BCAS(Bureau Of Civil Aviation Security) రూ. 1.20 కోట్లు, రూ. 60 లక్షల చొప్పున ఫైన్‌ విధించింది.

Fine-To-Indigo-Airlines

కాగా విమానాలు పార్కింగ్‌ చేసే ప్రదేశాన్ని యాక్టివ్‌ ఆప్రాన్‌(Active Apron)అంటారు. అయితే ఈ ప్రదేశంలో ప్రయాణికులు అధిక సమయం వేచి ఉండటం నిబంధనలకు విరుద్ధమని డీజీసీఏ తెలిపింది. దీంతో పాటు పైలట్ల రోస్టరింగ్‌, నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను ఎయిరిండియా, స్పైస్‌ జెట్‌ సంస్థలకు రూ. 30 లక్షల జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ తెలిపింది.

ఉత్తరాది దేశాల్లో భారీ పొగ మంచు(Fog Effect On Flight Services) కారణంగా అధిక సంఖ్యలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికులు గంటల పాటు ఎయిర్‌పోర్టులో వేచి ఉండాల్సి వచ్చింది. కాగా ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబయి ఎయిర్‌పోర్టులో దిగగా.. అప్పటికే ఆలస్యం కావడంతో కొందరు ప్రయాణికులు కిందికి దిగారు.

Fine-To-Indigo-Airlines

విమానాలు పార్కింగ్‌ చేసే ప్రదేశంలో నేలపై కూర్చుని ఆహారం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడంతో క్షణాల్లోనే వైరల్‌ అయ్యాయి. దీంతో ఇండిగో సంస్థకు డీజీసీఏ, బీసీఏఎస్‌ నోటీసులు జారీ చేసి భారీగా జరిమానా విధించాయి. మొత్తంగా పొగమంచు ఎఫెక్ట్‌తో ఇండిగో సంస్థ చిక్కుల్లో పడింది.

More from DriveSpark

Article Published On: Thursday, January 18, 2024, 12:19 [IST]
English summary
Passengers eating on apron at mumbai airport indigo airlines fined rs 1 5 crores by dgca
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+